కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 24 ; వికలాంగుల అభివృద్ధికి మంజూరైన నిధులు పక్కదారి పడుతున్నాయని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆసిఫాబాద్ కమిటీ గౌరవ అధ్యక్షులు ముంజం ఆనంద్ కుమార్ ఆరోపించారు, శనివారం ఆసిఫాబాద్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లా ఏర్పడి రెండు సంవత్సరాలు గడిచినా వికలాంగులకు ఇప్పటివరకు ఎలాంటి రుణం ల్యాబ్ ద్వారా అందలేదాని . వికలాంగులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామంటున్నారు కానీ ఇప్పటి వరకు ఏమీ వికలాంగులకు చేరడం లేదు. మూడు సంవత్సరాల క్రితం పది లక్షల రూపాయలు వికలాంగుల స్వయం ఉపాధి కోసం వచ్చిన డబ్బులు వికలాంగులకు చేరక పోగా వాటిని డీఆర్డీవో ఆఫీస్ నిర్వహణ కోసం వారి అకౌంట్లో ఫిక్స్ డిపాజిట్ చేసుకున్నారు దానితో వచ్చే డబ్బుతో ఆఫీస్ నిర్వహణ కోసం వాడుతున్నారు. దీనిపై వెంటనే పై అధికారులకు విచారణ చేపట్టి వికలాంగులకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరరు. ఈ కార్యక్రమంలోకుదురుపాక మల్లేష్ బూర శ్రీనివాస్ జాడ పాలక రావు కె రాజయ్ తదితరులున్నారు.
No comments:
Post a Comment