కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 16 ; విద్యార్థులు మానవీయ శాస్త్రాల పై అవగాహన పెంచుకోవాలని ఐటీ సీఎస్ఏ తెలంగాణ సివిల్ సర్వీస్ అకాడమిక్ ఆంగ్ల అధ్యాపకులు భీంరావు అదిల్ పిలుపునిచ్చారు. శుక్రవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మాతృశ్రీ డిగ్రీ కళా కళాశాల మరియు తెలంగాణ మాడల్ కళాశాలని.రెబ్బెన ఆర్డ్ & సైన్స్ కళాశాల విద్యార్థులకు ఆలయ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ ప్రస్తుత పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఇష్టంతో శ్రమిస్తే విజయం తమ సొంతమవుతుందని అన్నారు తాము ఎంచుకునే లక్ష్యాన్ని ఇష్టంతో పట్టుదలతో శ్రమించాలని అన్నారు విద్యార్థులు యువకులు వ్యసనాలకు దూరంగా ఉంటూ విద్యపైన ప్రత్యేకంగా దృష్టిపెట్టి ఉన్నత లక్ష్యానికి చేరుకోవాలి అని అన్నారు పరీక్షల సమయంలో విద్యార్థులు సెల్ ఫోన్లను అధికంగా వాడడం వలన విద్యార్థులకు సరైన నిద్రలేకపోవడంతో జ్ఞాపకశక్తి తగ్గడం జరుగుతుందని మానసిక ఆరోగ్యం పైన ప్రభావం చూపుతోందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ సభ్యులు జాగిరి శ్రీకాంత్, దుర్గం రవీందర్ పూదరి సాయి కిరణ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment