ఆశ్రమ పాఠశాలలో పరీక్ష సామగ్రి పంపిణీ
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 24 ; పేద విద్యార్థులకు బెటర్ యూత్ బెటర్ సొసైటీ స్వచ్చంద సేవా సంస్థ అద్వర్యం లో శనివారం రెబ్బెన మండలం గోలేటి లోని ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రి (ప్యాడ్స్ ,పెన్స్) ని అందించారు. అధ్యక్షులు ఒరగంటి రంజిత్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమ శిక్షణగా ఉండి శ్రద్దగా చదువుకొని విద్యార్థులకు, వారి పాఠశాలకు , తల్లి తండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకొని పట్టుదలతో చదవాలని ఈ సం,, 100% ఉత్తిర్ణత సాధించాలని చెడు వ్యసనాలకు దూరంగ ఉండి సన్మార్గంలో నడవాలని ప్రతి ఒక్కరు కూడా సేవా భావం కలిగి ఉండాలని కోరారు. నిరుపేద విద్యార్థుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడతాం అని అన్నారు. అనంతరం ప్రదనోపాధ్యాయులు బెటర్ యూత్ సేవా సంస్థ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవ అధ్యక్షులు లక్ష్మణ చారి ఉపాధ్యక్షులు రాజశేఖర్ సెక్రెటరీ అజయ్,రవీందర్ కార్యదర్శులు ఏగ్గే తిరుపతి, బలుగురి తిరుపతి, విజయ్, రాజేష్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యయూడు సోమయ్య , వార్డెన్ దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment