Monday, 5 February 2018

ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి : ప్రశాంత్ జీవన్ పాటిల్

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 5;  ప్రజలనుంచి వచ్చే ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా పాలనాధికారి ప్రశాంత్ పాటిల్ అన్నారు. సోమవారం  కొమురంభీం జిల్లా కల్లెక్టరేటులో జరిగిన ప్రజాఫిర్యాదుల కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదులలో గోలేటికి చెందిన శంకర్ కల్యాణలక్ష్మి  డబ్బులకోసం, సరెండర్ అయిన మావోయిస్టు దివ్య పునరావాసం గురించి, లంబాడి ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరించాలని, సిర్పూర్ యు కు చెందిన అంగన్వాడీ ఆయా   పాత జితం ఇస్తున్నారని, పెరిగిన వేతనం ఇప్పించాలని, తదితర దరఖాస్తులు సుమారు 65 వచ్చినట్లు తెలిపారు. పాలనాధికారి అర్జీలను సత్వర పరిష్కారంకోసం అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త పాలనాధికారి అశోక్ కుమార్, డి ఆర్ డి ఓ సురేష్, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment