కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 16 ; తెలంగాణ గురుకుల కామన్ నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థులు రెసిడెన్సియల్ పాఠశాలలలో ఐదవ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పూర్తి వివరాలకు హెచ్టిటిపి సెట్ కాలేజ్ గౌట్ ఇన్ నుండి పొందగలరని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల జిల్లా సమన్వయ అధికారి యు గంగన్న తెలిపారు. జిల్లాలోని వివిధ గ్రామాల్లో గల విద్యావేత్త లు, సామాజిక సేవకులు, విద్యార్థి నాయకులు విద్యార్థుల తల్లి తండ్రులకు అవగాహన కల్పించి దరఖాస్తు చేసుకోవడానికి ప్రోత్సహించాలని జిల్లా సమన్వయ అధికారి యు గంగన్న తెలియజేశారు. ఆన్ లైన్ లో ఈ నెల పదహారు నుండి మార్చ్ పది వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఏప్రిల్ ఎనిమిది న పరీక్ష నిర్వహిస్తారన్నారు.
No comments:
Post a Comment