Tuesday, 20 December 2016

సామాజిక తెలంగాణ సాధ్యమైనప్పుడే బంగారు తెలంగాణ సాధ్యం ; తమ్మినేని వీరభద్రం


సామాజిక తెలంగాణ సాధ్యమైనప్పుడే బంగారు తెలంగాణ సాధ్యం ; తమ్మినేని వీరభద్రం 



కొమురం బీమ్ రెబ్బెన డిసెంబర్ 20; సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందన్నసీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మహా జన  పాదయాత్రమంగళ వారనికి కొమరంభీం జిల్లా  రెబ్బెనలో 66వ రోజుకి  చేరుకుంది  ఈ పాదయాత్ర ర్యాలీ   సమావేశంలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందన్న  సత్యాన్ని ప్రభుత్వం గుర్తించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వర్గాలు మాత్రమే సంతోషంగా ఉన్నారని.. బడుగు బలహీన వర్గాలు వారు కనీసం పండగ చేసుకునే స్థితిలో కూడ  లేరని అన్నారు. అన్ని వార్గాలకు సమాన న్యాయం చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని ఆయన విమర్శించారు. దీనిపై తెలంగాణ ప్రజలతోనే పోరాటం చేస్తానని తెలిపారు. పర్యటిస్తున్న పాదయాత్ర బృందానికి తమ బాధలు చెప్పుకున్నారు.సీఎం మనవడు దళితుడి కొడుకు ఒకే బడిలో చదివనప్పుడే తెలంగాణలో అసలైన సామాజిక న్యాయం  జరుగుతుందని అన్నారు. ఐకేపీ వి ఓ ఏ (గ్రామ అసిస్టెంట్ ) గత 16సంవత్సరాలుగా మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేస్తున్నారని గత ప్రభుత్వం ఇస్తున్న 2000/-రూ కూడా ఈ ప్రభుత్వం 38నెలలుగా బాకాయి ఉందని ఎన్నికల ముందు ఐకేపీ విఓఏ లకు 5000/-రూ ఇస్తామని కెసిఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు ,మధ్యన బోజనకార్మికులు కాంట్రాక్టు వర్కర్లను రెగ్యులరైజ్ చేయకపోవడానికి వెనుక సామాజిక కోణం ఉందని, వీళ్ళంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కాబట్టే రెగ్యులరైజ్ చెయ్యట్లేదని అన్నారు.కొమరంభీం జిల్లాలో కొంతమంది  వృద్ధులు తమకు ఫించన్లు రావట్లేదని పిర్యాదులు చేశారని సమస్యలు పరిష్కరించాలంటూ గ్రామంలో పలు సమస్యలు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు పాదయాత్ర బృందానికి తెలియచేశారు. సర్వశిక్షాభియాన్ ,ఆశా ,అంగన్వాడీ ,ఐకేపి విఓఏ ,విద్యార్ధి సంఘాల నాయకులు తమ సమస్యలపై వినతి పత్రం అందచేశారు. ఈ వినతిపత్రాలపై ఆయన స్పందించి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరి సమస్యలపై కెసిఆర్ కి లేఖలురాస్తున్నామని సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఎర్ర జెండా ప్రజల పక్షాన ఉంటూ తెలంగాణ ప్రజలకు సమన్యాయం చేకూరుస్తామన్నారు ఈ మహా జన పాదయాత్ర సమావేశంలో జంవెస్లీ,ఎస్ . రమ ,  ఎం.వి.రమణ ,ఎం డి అబ్బాస్ ,పి ఆశయ్య ,కె నాగేష్ ,ఎం శోభన్ నాయక్ ,నైతం రాజు , స్థానిక నాయకులు రాయల నర్సయ్య ,సుధాకర్ ,రవీందర్ ,సాయి ,తదితరకార్మిక నాయకులు ,ప్రజలు ఉన్నారు 

No comments:

Post a Comment