Saturday, 24 December 2016

కాలుష్యాన్ని నియంత్రించాలి ; జేబీ పొడేల్

కాలుష్యాన్ని నియంత్రించాలి ; జేబీ  పొడేల్ 

కోమురం భీంమ్ రెబ్బెన (వుదయం) డిసెంబర్ 24 రెబ్బెన మండల కేంద్రం నుండి  కూత వేటు దూరం లో ఉన్న దేవుల   గుడం గిరిజన తండా ప్రజలు తీవ్ర కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు జేబీ  పొడేల్ గోలేటి బీజేపీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల  సమావేశం లో అన్నారు దేవులగూడెం సమీపం లో ఉన్న కోల్ వార్ఫ్ లోడింగ్ పాయింట్ ఉండటం వాళ్ళ ఇక్కడ నిత్యం ఓపెన్ కాస్ట్  ల నుండి లారీ ల ద్వారా బొగ్గు తీసుకు వచ్చి ఇక్కడ డంప్ చేయడం జరుగుతుంది ఐతే పల్లవి ఫ్యాక్టరీ సమీపం లో రైల్వే బ్రిడ్జి కింది నుండి బొగ్గు  లారీలు వెళుతున్నాయి రాష్ట్రీయ రహదారి ఫై బొగ్గు చుర పేరుకుపోయి వాహనాలు వెళుతునపుడు దుమ్ము ధూళి కళ్ళలో పడి  వాహన చోదకులు ఇబ్బందుల పాలవుతున్నారని అన్నారు ముఖ్యంగా వార్ఫ్ లోడింగ్ పరిసర ప్రాంతం ఐన దేవులగుడ గిరిజన తండా దుమ్ము దూలితో కాలుష్య బారిన పడి అక్కడి ప్రజలు శ్వాసకోశ వ్యాధిన పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు  ఇకనైన సంబంధిత అధికారులు స్పందించి వార్ఫ్ లోడింగ్ డంపింగ్ యార్డులో మరియు రోడ్ ఫై స్ప్లింకెర్ల ద్వారా నీటిని కొట్టించాలని అన్నారు లేని పక్షములో గిరిజనుల పక్షాన అండగా ఉండి బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చెపాటుతామని హెచ్చరించారు ఈ సమావేశం లో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు  సునీల్ చౌదరి ఆసిఫాబాద్ అసెంబ్లీ కన్వీనర్ చక్రపాణి జిల్లా సీనియర్ నాయకులూ మురళి మండల అధ్యక్షులు కుందారపు బాల కృష్ణ తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment