Monday, 26 December 2016

ప్రజా సంక్షేమాన్ని మరచిన ప్రభుత్వం - గుండా మల్లేష్

ప్రజా సంక్షేమాన్ని మరచిన ప్రభుత్వం - గుండా మల్లేష్ 

కోమురం భీంమ్ రెబ్బెన (వుదయం) డిసెంబర్ 26; ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన ప్రభుత్వలు ప్రజా సంక్షేమాన్ని మరచి పోయాయని   సి ప్ ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండా మల్లేష్ అన్నారు. సిపిఐ 91వ  ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా సోమవారం రెబ్బెన బస్సు ప్రాంగణ సమీపంలో సిపిఐ జండాని ఆవిష్కరించి పార్టీ బాలేపితం కొరకు నాయకులతో చర్చించారు, అలాగే ప్రభుత్వాల తీరును గురించి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజల కష్ట  సుఖాలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదాని కెసిఆర్ డబల్ బెడ్రూమ్ ఊరి కో కోడి ఇంటికో ఈక అనే చందనంగా మారిందని ఎద్దేవా చేశారు. దళితులకు 3 ఎకురాలు డబుల్ బెడ్ రూమ్లు లేవు. ఒకవేళ అమలులోకి వస్తే లబ్దిదారులకు కాకుండా పార్టీ కార్యకర్తలకే అంకితం అయ్యాయి అన్నారు.  కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని అసలు తెలంగాణాలో కాంట్రాక్టు వ్యవస్థ అనేదే ఉండదని ఎన్నికల ప్రచారంలో అన్నారు కానీ ఇప్పటికీ అదే వ్యవస్థ కొనసాగుతుందని అన్నారు.  మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు కాంట్రాక్టర్లకు కమిషన్ పథకాలు గా  మరయని అన్నరు. కేంద్రం లో నోట్ల రద్దు వాళ్ళ తీవ్ర ఇబ్బందులను ఏదురుకుంటున్నారని మోధీ  కొండని తవ్వి ఎలుకను  పట్టినట్లు వ్యవహరిస్తున్నట్లు పాతనోట్ల రద్దు పేరిట సామాన్య ప్రజల  జీవితాలతో చలగాటలు ఆడుతున్నారు అన్నారు. ఈరోజు బ్యాంకుల ముందు  సామాన్యులే కనబడుతు బారులు  తీరిన ప్రజలకు నోట్ల కొరత మాత్రం తీరడం లేక ప్రాణాలు కోల్పోయి ,పెళ్లిళ్లు ఆగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అన్నారు.   బడాబాబులు మాత్రం కోట్లకు కోట్లు  కొత్త 2000 వేల రూపాయల నోట్లతో పట్టుబడుతున్నారు. బ్లాక్ మని వెలికితీయుటలో ప్రభుత్వం విఫలం అయింది అన్నారు.  సిపిఐ పార్టీ బ్రిటిష్ వాళ్ళ పాలనాలు వాళ్ళతో పోరాడి స్వతంత్రం తెచ్చిన ఘనత ఈ ఎర్ర జండదేనని రానన్న రోజుల్లో ప్రభుత్వాలు విఫలమై ఎర్ర జండానే స్తానం దక్కుతుందని నినాదాలు చేశారు.  ఈ కార్య క్రమములో  సి పి  ఐ జిల్లా కార్య వర్గ సభ్యులు ఎస్ తిరుపతి , ఏ ఐ ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దుర్గం రవీందర్ , ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా సహాయ కార్య దర్శి బోగే ఉపేందర్ , రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ధరణి సత్యనారాయణ, పట్టాన కార్యదర్శి జగ్గయ్య , ఏ ఐ టి యూ సి మండల్ కార్యదర్శి రాయిలా నర్సయ్య, పి సాయి మహిపాల్ తదితర నాయకులూ  ఉన్నారు.

1 comment:

  1. First rebbena C P I President evaru athanu edi athani name edi @ ee words niva athaniva video pettu Mr. Sunil Kumar (udayam reporter)

    ReplyDelete