Wednesday, 14 December 2016

కళాశాల సమస్యలు పరిష్కరించక పోతే ఆమరణ నిరాహార దీక్ష


కళాశాల సమస్యలు పరిష్కరించక పోతే ఆమరణ నిరాహార దీక్ష
ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రాధాన కార్యదర్శ  దుర్గం రవీందర్

కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) కళాశాల తరగతులు ప్రారంభించి సమస్యలు పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడుతామని  ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రాధాన కార్యదర్శ  దుర్గం రవీందర్ అన్నారు బుధవారం గౌట్ జూనియర్ కాలేజ్ ఎదురుగా సుమారు నాలుగు గంటలపాటు ధర్నా నిర్వహిచారు ఎఫ్ జిల్లా ప్రాధాన కార్యదర్శ  దుర్గం రవీందర్ మాట్లాడుతూ  తెలంగాణా రాష్ట్రం సాధించుకొని రెండున్నర సంవత్సరములు కావస్తున్నా, విద్య సంవత్సరం మొదలై ఆరు నెలలు గడుస్తున్నా విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం అవట్లేదు అన్నారు. రెబ్బెన మండలం లోని ప్రభుత్వ కళాశాల  ప్రారంభమై  పదిహేను సంవత్సరాలు కావస్తున్నా విద్యార్థులు కష్టాలు తీరడం లేదని, రెబ్బెన మండలం లోని ఇందిరానగర్  ప్రధాన రహదారి పక్కన నూతన కళాశాల శంకుస్థాపన చేసి కళాశాలలో మౌలిక సదుపాయాలు  విద్యుత్ నీరు కలిపించి నూతన  కళాశాలలో తరగతులు ప్రారంభించాలని అన్నారు లేనిచో ఏ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో అమర నిరాహార ద్దీక్షలు చేపడతామని అన్నారు. ఈ ధర్నాకు స్పందించిన స్థానిక తహస్జిల్ధార్ రమేష్ గౌడ్ . జడ్ పి టీ సి బాబూరావ్ లు కళాశాల వద్దకు చేరుకొని చరవాణిలో ఎం ఏల్ సి పురాణం సతీష్  తో  అధికారులతో మాట్లాడి తొందరలోనే సమస్యలు పరిష్కరించి విద్యార్థులు సమస్యలు పరిష్కరించి నూతన భవనాలకు తరలిస్తామని హామీ ఇవ్వడం తో ధర్నాని విరమించారు. ఈ ధర్నాలో జిల్లా కార్యవర్గ సభ్యులు కస్తూరి రవి డివిజన్ కార్యదర్శి పుదరి సాయి నాయకులు పర్వతి సాయి సందీప్ శేషి తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment