Sunday, 11 December 2016

సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి ; కాంట్రాక్ట్ లెక్చెరర్లు



 సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి ;  కాంట్రాక్ట్ లెక్చెరర్లు 

కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి); జిఓ  ప్రకారం వేతనాలు  చెల్లించకుండా తక్కువ వేతనం  చెల్లించడం సరికాదని సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని  రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కళాశాల కాంట్రాక్ట్ లెక్చెరర్లు శ్రీనివాస్ ,గంగాధర్ ,ప్రకాష్ ,ప్రవీణ్ ,అమరేంధేర్ ,మంజుల ,జాన్సీ ,దీప్తి,నిర్మలలు ఆరోపించారు . వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్ అద్యపకుల  జీతం  27000 చేయడానికి  విద్య శాఖ  ఆమోదం  తెలపడాన్ని  తీవ్రంగా  కండిస్తున్నారు . వారికీ రావలసిన బేసిక్ మరియు డి ఏ  చెల్లించాలని అన్నారు. గత ప్రభుత్వాలు పిఆర్ సి ని అమలు చేసిన వేంటనే మూలా వేతనాలను చెల్లించారు కానీ ఈ ప్రభుత్వం చెల్లించకపోవడం అవమాన కరం అన్నారు తెలంగాణ ప్రభుత్వం అమలులోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా చెల్లించకపోవడం తో కాంట్రాక్టు  అధ్యాపకులు మనోవేదము వ్యక్తపరుస్తున్నారు . కాంట్రాక్టు అధ్యాపకులు లేక పోతే ఈ రోజు కలశాలలు మూతపడతాయని తెలిపారు వెంటనే క్రమ బద్దికరణ చేయాలనీ డిమాండ్ చేసారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కాంట్రాక్టు లెక్చెరర్ లపై చిన్న చూపు ఎందుకని ప్రశ్నించారు.   

No comments:

Post a Comment