అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల పరిది నుండి అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని రెబ్బెన తహసీల్దార్ బండారి రమేష్ గౌడ్ అన్నారు , శుక్రవారం తహశీల్ధార్ కార్యాలయములో ఆయన మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణము కోసము , ప్రభుత్వ పనులకు , మిషన్ భగీరథ పనులకు ఇసుకకు అనుమతులు ఇవ్వబడునని తెలిపారు . ఒక్కొక్క ట్రిప్పుకి 120 /- రూపాయలు బిల్లు కట్టాలని , ఒక్కొక్క వే బిల్లుకు ఒక్క ట్రిప్పు మాత్రమే అనుమతి ఇవ్వబడునని పేర్కొన్నారు . ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలతో పాటు జరిమానా, శిక్ష తప్పదని తెలిపారు.
No comments:
Post a Comment