గౌడ కులస్తులు యూనిటీగా ఉండీ సమస్యలను పరిష్కరించుకోవాలి ; ముకేశగౌడ్
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) తెలంగాణా రాష్ట్రములోని గౌడ కులస్తులు అందరు ఒకే యూనిటీ గా ఉంటూ సమస్యలను పరిష్కరించుకోవాలని తెలంగాణా గౌడ కులస్తుల రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షడు గాజుల ముకేశగౌడ్ అన్నారు . మంగళ వారము రెబ్బెన లోని ఎల్లమ్మ గుడి వద్ద నిర్వహించిన తెలంగాణా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గౌడ కులస్తుల సర్వ సభ్య సమావేశములో ముఖ్య అతిధిగ హాజరై మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గౌడ కులస్తుల కు మండలానికి 5 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించాలని , ప్రతి ఒక్క గీత కార్మికునికి లైసెన్సులు కొరకు గౌడ కులస్తులకు గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని, ఎక్సయిజ్ అధికారులు కల్తీ కళ్ళు పేరా మీద గీత కార్మికులను హింసించడం మానుకోవాలని ఆయన తెలిపారు .ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లాలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్టాపన కోసం స్థలాన్ని కేటాయించాలని అన్నారు .అలాగే గౌడ కులస్తులు ఉన్న గ్రామాలలో విగ్రహ స్థాపనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ అన్నారు. ఏజెన్సీలో నివసించే వారికి ఎస్టీ కులధ్రువీకరణ పత్రాలను ఇప్పించేలా కృషి చేస్తామన్నారు . నిరుపేదలైన గౌడ కులస్తులకు సంగం తరపున హైదరాబాద్ లో చదువు మరియు వసతిలు ఉన్నాయని ,అందరు స్సాద్వినియోగం చేసుకోవాలని కులస్తులు అందరు ఒకే తాటి ఫై ఉంటు అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలని అన్నారు .అలాగే ఎల్లమ్మ గుడి కోసం సంగం తరపున సహాయం చేస్తామన్నారు. గౌడ కులస్తులు అందరు సబ్యత్వం నమోదు చేసుకోవాలని అన్నారు .సంఘం లో ప్రమాద బీమా సౌకర్యం కలదన్నారు. ఈ సందర్భం గ జిల్లా కమిటి ని ఎన్నుకున్నారు త్వరలో మండలాలు గ్రామాలలో కమిటి లు ఎన్నుకుని ప్రతి ఒక సమస్యలను సంఘం దృష్టికి చేరేలా ప్రతి ఒక్కరు సహాయ పడాలన్నారు . గీత కార్మికులు కుల వృత్తిని కొనసాగిస్తూ వారి యొక్క పిల్లలని ఉన్నత చదువులకు ప్రోత్సహించి చదివిపించాలన్నారు . ఈ కార్య క్రమములో , నాయకులు బొమ్మేనా బాలేష్ గౌడ్, రామగోని ప్రకాష్ గౌడ్, కొండ్ర జెగ్గా గౌడ్, సుదర్శన్ గౌడ్, సర్వేశ్వర్ గౌడ్, చిరంజీవి గౌడ్,కొయ్యడ రాజా గౌడ్ ,శాంతి కుమార్ గౌడ్ ,వెంకటేశ్వరా గౌడ్ ,అన్నపూర్ణ సుదర్శన్ గౌడ్ తదితర గౌడ కులస్తులు ఉన్నారు.
No comments:
Post a Comment