Sunday, 4 December 2016

కె సి ఆర్ చిత్రపటానికి పాలాబిషేకం

కె సి ఆర్ చిత్రపటానికి పాలాబిషేకం
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి)  తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండున్నర సమత్సరాలు కావస్తుంన శుభతరునణా రెబ్బన లో  ఆదివారం తెరాస మహిళా విభాగం నుండి మహిళలు కే సి ఆర్ చిత్ర పటానికి పాలాభి షేకం చేశారు . ఈ సందర్బంగా ఆసిఫాబాద్ మార్కెట్ వైస్ చేర్మెన్,  తెరాస మహిళా  జిల్లా ప్రధాన కార్యదర్శి   కుందారపు శంకరమ్మ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య మంత్రి కేసీఆర్ పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టాడని , అభివృద్ధికి బాటలు వేశారని తెలిపారు . వృద్దులు , వికలాంగులకు పెన్షన్లను 1000 , 1500 రూపాయలు అదేవిధంగా , షాదీ ముబారక్ , పేదలకు పెళ్లి కానుక లాంటి పథకాలను  ప్రవేశ పెట్టారని అన్నారు . గ్రామాల అభివృద్ధి పై దృష్టి సారించి ప్రతి గ్రామాల్లో రోడ్ల సౌకర్యం , మురికి కాల్వల నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు . ఈ కార్య క్రమములో మహిళలు పిల్లి పద్మ , లక్ష్మి , రమ వి మని , పార్వతి ,సుగుణ లు పాల్గొన్నారు .

No comments:

Post a Comment