గౌడ జన హక్కుల పోరాట సమితి మహా సభ
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) తెలంగాణ గౌడ జన హక్కుల పోరాటస్మిత జిల్లా సమావేశము మండల అధ్యక్షుడు మోడెమ్ సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం నాడు రెబ్బెన లోని అన్నపూర్ణ హై స్కూల్ లో నిరవహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధానకార్యదర్శి అమరవేణి నర్స గౌడ్ మాట్లాడుతు గౌడజన్ హక్కుల పోరాట సమితి నూతన జిల్లా కొమరం భీం ఏర్పడిన తర్వాత మొదటి సారిగా జరుపుకుంటున్నందకు సంతోషం వ్యక్తం చేసారు . గౌడ కుల వృత్తి రక్షణ కై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని హక్కుల కొరకై పోరాధాం అన్నారు . గీత కార్మికులను ఎక్స్చేంజి అధికారులు కల్తీ పేరట హింసించడం తగదు అన్నారు .560 జి ఓ ని అమలు పరిచి ఐదు ఎకరాల భూమిని కొనిస్తూ గౌడ కుల కమ్యూనిటీ హాల్ నిర్మించి ప్రతి ఒక్క గీత కార్మికుల లైసెన్స్ లను రినివల్ చేయాలన్నారు . ఈ సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీపతి లింగ గౌడ్ , జిల్లా ఇంచార్జి కేసరి ఆంజనేయులు గౌడ్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మనోహర్ గౌడ్ ,జి కర్ణ గౌడ్ ,మహేష్ గౌడ్,టి కిష్ట గౌడ్,లక్ష్మణ్ గౌడ్ ,మోడెమ్ సర్వేశ్ గౌడ్,మోడెమ్ చిరంజీవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment