Saturday, 3 December 2016

కృషి పట్టుదల ఉంటె ఎవరైనా సాధించొచ్చు ; జీఎం రవి శంకర్






కృషి పట్టుదల ఉంటె  ఎవరైనా  సాధించొచ్చు ; జీఎం రవి శంకర్ 
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) కృషి పట్టుదల తో ప్రయత్నిస్తే ఎవరైనా నిర్దేశించిన గమ్యానికి చేరుకుంటారని జీఎం రవి శంకర్ అన్నారు . శనివారం రెబ్బెన మండలం లో గోలేటి బెల్లం పల్లి ఏరియాలోని  సింగరేణి పాఠశాలలో సేవ సమస్ధ ఆధ్వర్యంలో   ప్రపంచ దివ్యంగల  దినోత్సవాన్ని నిర్వహించారు .ఈ సందర్బంగా  వికలాంగులకు ఏర్పాటు చేసిన  ఆటలపోటీలో గెలుపొందిన వారికీ బహుమతులు ప్రధానం చేసారు. అలాగే మిఠాయిలు పంచారు. అనంతరం సేవ సమస్త అధ్యక్షురాలు అనురాధ రవి శంకర్ లు   మాట్లాడుతూ   వికలాంగులని చిన్న చూపు చూడకుండా  ప్రోత్సహించాలి ,అన్ని రంగాలలో స్తానం కల్పించాలి అన్నారు . ఈ కార్యక్రమంలో స్నేహ కమిటీ అధ్యక్షులు గోపాల కృష్ణ ,సేవ సభ్యురాలు కుందారపు శంకరమ్మ , స్వామి గౌడ్ , తిరుపతి , రమేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment