రెబ్బన లో గౌడ కులస్థులు సభ్యత్వం నమోదు
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) తెలంగాణా గౌడ కులస్తులు సబ్యత్త్వం నమోదు చేసుకోవాలని రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షడు గాజుల ముకేశగౌడ్ అన్నారు. మంగళ వారము రెబ్బెన అథితి గృహములో జిల్లా గౌడ కులస్తులు ఏర్పాటు చేసిన సమావేశంములో ముఖ్య అతిధిగ హాజరై సభ్యత్వం నమోదు చేయించారు. అనంతరం మాట్లాడుతూ. కులస్తుల కు మండలానికి.560 జి ఓ ని అమలు పరిచి ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేశారు. మూడు నెలలలో లక్ష సభ్యత్వలు నమోదు కావలన్నారు ప్రతి ఒక్క గీత కార్మికునికి లైసెన్సులు కొరకు గౌడ కులస్తులకు గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని, ఎక్సయిజ్ అధికారులు గీత కార్మికులను హింసించడం మానుకోవాలని ఆయనడిమాండ్ చేశారు . ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లాలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్టాపన కోసం స్థలాన్ని కేటాయించాలని త్వరలోనే కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందజెస్తామని అన్నారు. నిరుపేదలైన గౌడ కులస్తులకు సంగం తరపున హైదరాబాద్ లో చదువు మరియు వసతులు ఉన్నాయని ,అందరు స్సాద్వినియోగం చేసుకోవాలని కులస్తులు అందరు ఒకే తాటి ఫై ఉంటు అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలని అన్నారు. యాదాద్రిలో ఐదు కోట్ల రూపాయిలతో సత్రాన్ని నిర్మించమనీ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సంఘం లో ప్రమాద బీమా సౌకర్యం కలదన్నారు. ఈ కార్య క్రమములో జిల్లా అధ్యక్షుడు మేడం సుదర్శన్ గౌడ్, సర్వేశ్వర్ గౌడ్, గౌడ్,కొయ్యడ రాజా గౌడ్, నాయకులు చిరంజీవిగౌడ్, మడ్డి శ్రీనివాస్ గౌడ్, శాంతి కుమార్ గౌడ్ ,వెంకటేశ్వరా గౌడ్ ,అన్నపూర్ణ సుదర్శన్ గౌడ్ తదితర గౌడ కులస్తులు ఉన్నారు.
No comments:
Post a Comment