Friday, 30 December 2016

జిల్లాపాలనాధికారి కార్యాలయం ఎదుట ఒప్పంద అధ్యాపకులు నిరవధిక సమ్మె

జిల్లాపాలనాధికారి కార్యాలయం ఎదుట ఒప్పంద  అధ్యాపకులు నిరవధిక సమ్మె 


కోమురం భీంమ్ రెబ్బెన (వుదయం) డిసెంబర్ 30 ; ఒప్పంద అధ్యాపకులు  సమస్యలను పరిక్షరించాలని శుక్రవారం కొమరం భీం జిల్లా  కేంద్రం ఆసిఫాబాద్ పాలనాధికారి   కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె చేపట్టారు ఒప్పంద అధ్యాపకుల అస్సోసియేషన్  వారు   మాట్లాడుతూ రాష్ట్రా కమిటీ పిలుపు మేరకు సమ్మె ను నిర్వహిస్తున్నాం అని సమస్యను వెంటనే పరిష్కరించి ప్రభుత్వ అధ్యాపకులకు చెల్లిస్తున్న వేతనాలకు సమానం గా వేతనాలను చెల్లించాలన్నారు. పదవ పిఆర్సి  ప్రకారం  పరిమినెంట్ చేసి మూలా వేతనాన్ని చెల్లించాలి  అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమానపనికి సమానవేతనం చెల్లించాలి   వ్యాప్తం గా ఒప్పంద అధ్యాపకులు ఈ నెల  29 నుండి రాష్ట్ర వ్యాప్తం గా నిరవధిక సమ్మెలో  పాల్గొంటున్నాం అన్నారు. సమ్మెలో భాగం గా ఒప్పంద అధ్యాపకులు అస్సోసియేషన్ జె ఏ సి అద్వర్యం లో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ రిలే నిరాహార దీక్షలను జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంగం అధ్యక్షులు జి కరుణా గౌడ్ ,  తెలంగాణా  విద్యావంతుల జిల్లా నాయకులూ గుర్రాల వెంకన్నలు ప్రారంభించారు  ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ ఒప్పంద అధ్యాపకులను రేగులైజ్  చేయాలనీ వారి న్యాయమైన డిమాండ్ లను వెంటనే పరీక్షకరించాల్సిన భాద్యత ప్రభుత్వం పై ఉందని అన్నారు. మహిళలకు వేతనం తో కూడిన సెలవులను మంజూరు చేయాలనీ, విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని , క్యాజువల్ సెలవులను పెంచాలని డిమాండ్ చేసారు.  విద్యార్ధి సంఘాల నాయకులు మద్దతు పలికారు.ఈ  నిరవధిక సమ్మె లో రెబ్బెన ఒప్పంద అధ్యాపకులు   కె హరిదాసు , టి వెంకటేశ్వర్లు,  జి బైరాగి , ఏ నవీన్ రెడ్డి, యమ శ్రీనివాస్, బి. గంగాధర్, బి. రాజు , ప్రవీణ్, ప్రకాష్  తదితర ఒప్పంద అధ్యాపకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment