Wednesday, 7 December 2016

ర్రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు ఎంపికై రెబ్బెన విద్యార్థులు

ర్రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు ఎంపికై రెబ్బెన విద్యార్థులు 

కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) తెలంగాణా రాష్ట్ర  స్థాయి కుంగ్ ఫు కరాటే  చాంపియన్ పోటీలకు రెబ్బెన మండలము నుండి విద్యార్థులు ఎంపికైనట్లు టోర్నమెంట్ చీప్ ఆర్గనైజర్ , కరాటే మాస్టర్ టి ప్రసాద్ తెలిపారు . మండలములోని సాయి విద్యాలయం ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ పాఠశాలకు చెందిన 25 మంది విద్యార్థులు ఈ పోటీలకు ఏంపికయ్యారని  ఆయన పేర్కొన్నారు . ఈ పోటీలు బెల్లంపల్లి  మండలములోని సోమగూడెం లో ఈ నెల 11 న శిశు మందిందిర్ లోని ఆవరణలో నిర్వహించ బడుతాయని తెలిపారు . ఈ పోటీలకు అటవీశాఖ  మంత్రి జోగు రామన్న , దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి , ఎం పి  బాల్క సుమన్ , ఆదిలాబాద్ ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ , ఎం ఎల్ ఏ లు దుర్గం చిన్నయ్య , కోవా లక్ష్మి లు ముఖ్య అతిథులుగా హాజరు అవుతున్నారని తెలిపారు . ఈ పోటీలలో సాయి విద్యాలయం (ఎస్ వి ) హై స్కూల్ కు చెందిన ఎం వెంకటేష్ , డి రోషన్ , బి అఖిల్ , ఎస్ సాయి కిరణ్ ,  ఏ సుప్రీత్ , ఏ వాసు దేవ్ , ఎస్ కృష్ణ , పి  విజయ్ కుమార్ , జె ఆకాష్ , పి  పార్థు , ఏ శ్రీరామ్ , నిఖిల్,  టి సాయి చందు, ఎం సాయి కిరణ్ , వై హర్ష వర్ధన్ , ఎల్ సిద్దార్థ , జె కృష్ణ , రోహిత్ కుమార్ లు , బాలికల విభాగంలో కె తేజశ్విని , జి అక్షయ , ఏ ప్రియాంక , బి శ్యామల లు ఎపికైనట్లు ఆయన  తెలిపారు . రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను రెబ్బెన ఎం పి  పి  కార్నాథం సంజీవ్ కుమార్ , జెడ్ పి టి సి అజమేరా బాబు రావు , బెల్లంపెల్లి జి ఎం రవి శంకర్ , మార్కెట్ వైస్ చైర్ మెన్ కుందారపు శంకరమ్మ , సర్పంచ్ పెసర వెంకటమ్మ , తహశీల్ధార్ రమేష్ గౌడ్ , ఏ పి  ఎం లు రాజ్కుమార్ , వెంకట రమణ , ఉప  సర్పంచ్ శ్రీధర్ లతో పాటు పాత కరస్పాండెంట్ ఢీకొండ  విజయ కుమారి , ప్రధానోపాధ్యాయుడు డి సంజీవ్ కుమార్ లు అభినందించారు,

No comments:

Post a Comment