ఐక్య మతాలను ఆదరించడమే ప్రభుత్వ లక్ష్యం
కొమురం బీమ్ రెబ్బెన డిసెంబర్ 20; (వుదయం) ఐక్య మతాలను ఆదరించడమే టి ఆర్ ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ కుందారపు శంకరమ్మ అన్నారు . క్రిస్మస్ పండగ వేడుకల సందర్బంగా రెబ్బెనలో ఏసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో పేద ప్రజలకు ప్రభుత్వం అందజేసిన దుస్తులను పంచిపెట్టి కేక్ కట్ చేసి మిఠాయి లు పంచారు. అనంతరం కుందారపు శంకరమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాం ఐక్య మాటలని ఆదరించడమే ప్రభుత్వం లక్షమని ఆమె అన్నారు సమస్త ప్రజలకు సమన్యాయం చేయటమే కెసిఆర్ లక్షమని అన్నారు ప్రభుత్వం అందించే ఎన్నో సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు . ఈ కార్యక్రమాన్నిసర్పంచ్ పెసారు వెంకటమ్మ, పాస్టర్ బాబురావు ,తెరాస టౌన్ అధ్యక్షుడు అశోక్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment