Tuesday, 20 December 2016

ప్రైవేట్ విశ్వ విద్యాలయాల బిల్లు ను నిరసిస్తూ ఏ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో రాస్తోరోకో

ప్రైవేట్ విశ్వ విద్యాలయాల బిల్లు ను నిరసిస్తూ  ఏ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో రాస్తోరోకో 




కొమురం బీమ్ రెబ్బెన డిసెంబర్ 19;  (వుదయం)  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ప్రైవేట్ విశ్వ విద్యాలయాల బిల్లు ఆమోదం మంత్రి మండలిలో ఆమోదం తెల్పడాన్ని నిరసిస్తూ  రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కళాశాల  ముందు జాతీయ రహదారి మీద ఏ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో  రాస్తోరోకో  చేపట్టారు.  ఈ సందర్బంగా  ఏ ఐ ఎస్ ఎఫ్ డివిజన్ కార్యదర్శి పూదరి.సాయికిరణ్ మాట్లాడుతు తెలంగాణ  రాష్ట్రము లో ప్రభుత్వ  విద్య వ్యవస్థ సవితి తల్లి ప్రేమ కు గురవుతుందని  అన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ శక్తులను పెంచి పోషించేందుకే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనిన దీనిని   ఏ ఐ ఎస్ ఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అయన అన్నారు. ప్రైవేట్ విశ్వ  విద్యాలయాలు ఏర్పడితే ప్రభుత్వ విశ్వ విద్యాలయాల  మనుగడ కష్టం  అవుతుందని  దీని వలన పేద బడుగు బలహీన  వర్గాల   విద్యార్థులు ఉన్నత చదులవు కు దూరం అయ్యే ప్రమాదం ఉందని  అన్నారు. తెరాస ప్రబుత్వమ్ ఏర్పడ్డాక పూర్తిగా విద్య ఉచితంగా అందిస్తామని చెప్పిన ముఖ్య మంత్రి గారి హామీ ఏమైందని ప్రశ్నించారు. కేజీ టూ పిజి ఉచిత విద్య అంటే ఇదేనా అని అన్నారు.ప్రైవేట్ విశ్వ విద్యాలయాల బిల్లు ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టె కుట్రపూరిత ప్రయత్నాలు చేస్తుందని దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ విశ్వవిద్యాలయాలు ఏర్పడితే సృజనాత్మక కోర్సులకంటే  గిరాకీ ఎక్కువ ఉన్న కోర్స్ లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయని దీని వాళ్ళ ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. ఈ  కార్యక్రమం లో ఏ ఐ ఎస్ ఎఫ్ కళాశాల అధ్యక్షుడు పార్వతి సాయికుమార్,నాయకులూ తిరుపతి,హరీష్,శ్రీధర్,సౌమ్య,స్వరకల్పన, మనీషా,విద్యార్థులు పాల్గొన్నారు.  

No comments:

Post a Comment