Wednesday, 14 December 2016

నూతన కళాశాల వినియోగానికి నోచుకోని విద్యార్ధులు

నూతన కళాశాల వినియోగానికి నోచుకోని విద్యార్ధులు 

కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) నూతన కళాశాల శంకుస్థాపన చేసి కళాశాల పూర్తిగావించి  వినియోగానికి నోచుకోకుండా నిరుపయోగంగా ఉందని  తెలంగాణా విద్యావంతులవేదిక కొమరంభీం జిల్లా ఉపాధ్యక్షులు మిట్ట దేవేందర్ బుధవారం రోజున ఒక పత్రిక ప్రకటనలో  తెలిపారు. తెలంగాణా రాష్ట్రం సాధించుకొని రెండున్నర సంవత్సరములు కావస్తున్నా విద్యను మరుగునపడేస్తున్నారు . రెబ్బెన మండలం లోని ప్రభుత్వ కళాశాల  ప్రారంభమై  పదిహేను సంవత్సరాలు కావస్తున్నా విద్యార్థులు కష్టాలు తీరడం లేదని, రెబ్బెన మండలం లోని ఇందిరానగర్  ప్రధాన రహదారి పక్కన నూతన కళాశాలను  నిర్మించినప్పటికీ విద్యుత్ సౌకర్యం లేని కారణం గా  నిరుపయోగంగా ఉందని అన్నారు. కళాశాల, ఉన్నత పాఠశాల  రెండు ఒకే ప్రాంగణంలో కొనసాగుతుండడంతో  విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు అని వారు అన్నారు. ఇప్పటికైనా విద్యా అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని  కళాశాలలో వసతులు కల్పించి తరగతులు  ప్రారంభించేల చర్యలు చేపట్టాలాలని ను కోరారు.

No comments:

Post a Comment