Tuesday, 31 May 2016

పదవి విరమణ పొందిన ప్రధానోపాధ్యాయురాలు

పదవి విరమణ పొందిన  ప్రధానోపాధ్యాయురాలు

రెబ్బెన మండలం  గోలేటిలో సింగరేణి హై స్కూల్ లో ప్రధానోపాధ్యాయురాలు మంగళవారం రోజున  సుగుణ కుమారి  పదవి విరమణ పొందినారు  ఈ సందర్బముగా చిత్తరంజన్, డి జి ఎం మేనేజర్ పాతశాలకు  విచ్చేసి పదవి విరమణ   కృతఙ్ఞతలు తెలిపారు వారు మాట్లాడుతూ కొత్తగా వెంకటేశ్వర్లు ని ప్రధానోపాధ్యాయుడిగా నియమించా అన్నారు అదే విధముగా చిత్తరంజన్ మాట్లాడుతూ పతశాలకు కావాల్సిన సదుపాయాలు అందిస్తా మన్నారు విద్యార్థులకు క్రమశిక్షణ మరియు విద్య బోదన పెంచి మంచి ఫలితాలు తేవాలి అని అన్నారు అనంతరం సుగుణ కుమారి మాట్లాడుతూ 34 సం రాలుగా సింగరేణి పాటశాలలో పనిచేసి 4సం రాలుగా ప్రధానోపాధ్యాయురాలుగా అవకాశం కల్పించిందుకు కృతఙ్ఞతలు తెలిపారు అదేవిధముగా కొత్తగా వచ్చిన ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ ఈ అవకాశం తో తన వంతు కృషి చేస్తా అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రావు ఈ హన్మంతు కె బాస్కర్ పి ఇ టి యశ్వంత్ పాండురంగం  అన్వర్ సుమన్ కనకయ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

ఉరివేసుకొని యువతి మృతి

ఉరివేసుకొని యువతి మృతి 

(రెబ్బెన వుదయం ప్రతినిధి);    రెబ్బెన మండలంలో నారాయణపూర్ లో వాసాల హరిప్రియ 23  తల్లి దండ్రుల పక్కన పడుకొని సోమవారం అర్ధ రాత్రి  హరిప్రియ  లేసి వంట గది లో దూలానికి  ఉరి వేసుకొని చనిపోయింది మృతురాలు  కరీంనగర్ లో చదువుకునేటప్పుడు బిల్డింగ్ పైన నుంచి పడి తల కి దెబ్బ తగిలి మతి స్తిమితం సరిగ్గా లేదని కుటుంబికిలు తెలిపిన వివరాల ప్రకారం ఇంచార్జ్ ఎస్ ఐ టి వి రావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తం  అన్నారు 

అక్రమంగా కలప పటి వెత

అక్రమంగా కలప పటి వెత 


(రెబ్బెన వుదయం ప్రతినిధి); గోలేటి  నుంచి  మంచిర్యాల వెళ్తున్న ఆటో  నంబర్  ఎ పీ 1యు 4843 గల వాహనంలో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను. ఎఫ్ అర్  వో వినయ్ కుమార్ బాబు  అందించిన సమాచారముతో మంగళ  వారం రేపల్లవాడ వద్ద  డిప్యూటి ఆర్ వో శ్రీనివాస్ పకడ్బందిగా ఉపాయముతో 4  టేకు  దుంగలు పట్టు కున్నానట్లు  వాటి విలువ 9234 రూపాయలు ఉంటుందని ఆయన తెలిపారు.  బీట్ అధికారులు ఎం డి అతరోద్దిన్, మహ్మాద్, రవి, మధు  సిబ్బంది ఉన్నారు .

Monday, 30 May 2016

ట్రాక్టర్ బైక్ డీ ఒక్కరు మృతి

ట్రాక్టర్  బైక్ డీ ఒక్కరు మృతి 
(రెబ్బెన వుదయం ప్రతినిధి);  
రెబ్బెన మండలములో ని బెల్లపు ఒర్రె సమీపములో రెబ్బెన వైపు బైక్ పై వస్తున్నా సి ఎహ్ మల్లేష్  ను ఎదురుగా వస్తున్నా ట్రాక్టర్ దీకొనదముథొ మల్లేష్ మృతి చెందాడు . మృతుడు మల్లేష్ తన కు కొండపల్లి లో గల పొలాలను చూసి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్తానికులు తెలిపారు . 108 ఆమ్బులన్సుకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చిన 45 నిమిషాల వరకు రాకపోవడం తో మల్లేష్ కొస ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి . రెబ్బెనలో 108 అంబులెన్సు లేక పోవడమే దీనికి కారణమని మండల వాసులు అంటున్నారు . 










మండల స్థాయి క్రికెట్ పోటీలు ఏర్పాటు

మండల స్థాయి  క్రికెట్ పోటీలు ఏర్పాటు 

(రెబ్బెన వుదయం ప్రతినిధి); రెబ్బెన  మండలం వంకులం గ్రామా పంచాయితీ లో  రాల్లపేట గ్రామంలో సోమవారం రోజున  మండల స్తాయి క్రికెట్ పోటీలు తెలంగాణా ఆవిర్బావ దినోత్సవ సందర్బముగా యువకులకు క్రికెట్ పోటీలు ఏర్పాటు చేసారు ఈ పోటీలను రెబ్బెన ఎమ్ పి పి సంజీవ్ కుమార్ జడ్ పి టి సి  బాబు రావు ప్రారంబించారు అనంతరం వారు మాట్లాడుతూ క్రీడ నైపుణ్యంతో రావాలని క్రీడలు మానసిక ఉల్లాసంతో పటు దేహ  దరుడ్య తకు ఉపయోగపడుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో  తెరస  మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి,వంకులం సర్పంచ్ కమలాబాయి, మాజీ సర్పంచ్   టి డి పి మండల వైస్ ప్రెసిడెంట్  ప్రేం దాస్ మరియు తదితరులు  పాల్గొన్నారు.

సింగరేణి ఏరియాలో ప్రాజెక్ట్ ప్లానింగ్ డైరెక్టర్ పరిశీలన

 సింగరేణి  ఏరియాలో  ప్రాజెక్ట్ ప్లానింగ్ డైరెక్టర్ పరిశీలన 
(మంచిర్యాల్  వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని గోలేటి లో సింగరేణి ప్రాజెక్ట్ ప్లానింగ్ డైరెక్టర్ మనోహర్ రావు బెల్లంపల్లి ఏరియాలో  సోమవారం  పర్యటించారు ఏరియా లోని ఓపెన్ కాస్ట్ గనులు,  గోలేటి ఎక్ష్స్ రోడ్ లో  సి  ఎచ్ పి ని పర్శిలించారు   అనంతరం జి ఎమ్ కార్యలయంలో ఉన్నంత అధికారులతో సమీక్షా  నిర్బహించి   అయన మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియాకు సమస్త నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి ఉత్పక  లక్ష్యాలను అదిగా మించడానికి అన్ని చర్యలు చేపట్టాలని అన్నారు బొగ్గు ఉత్పత్తి తో పాటు అబివృద్దిని, కార్మికుల  సంక్షేమం మరియు లక్ష్యాలతో ముందుకు సాగాలన్నారు  ఓ సి పి లలో బొగ్గు ఉత్పత్తి సాదన కోసం సరైన ప్రణాళిక ఏర్పాటు చేయాలనీ,   కార్మికులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా  అన్ని జాగ్రతలు చూడాలన్నారు ఈ  సమావేశంలో యాక్టివ్ జి ఎమ్  కొండయ్య, ప్రాజెక్ట్ అధికారి సంజీవ రెడ్డి , మోహన్ రెడ్డి, ఏరియా ఇంజనీర్ రామారావు, జి ఎమ్ చిత్త రంజన్  డి వై ఎమ్ రాజేశ్వర్ తదితరులు పాల్గొనారు 

Sunday, 29 May 2016

వడ దెబ్బ తో ఒకరి మృతి

వడ దెబ్బ తో ఒకరి మృతి 

(రెబ్బెన వుదయం ప్రతినిధి); వడ దెబ్బతో రెబ్బెన మదలం లోని పున్జుమెర గూడెం కు చెందినా గుర్లె బోరు మేర (65) ఆదివారం ఉదయం మృతి చెందారు. మృతుడు బురుమెర  శని వారము  పులాజి బాబా గుడి వద్ద పని కి వెళ్లి వచ్చాడని , అస్వస్థకు గురయ్యాడని శనివారం ఉదయం వంతులు విరోచనాలు చేసు కొని అక్కడే మరణించినట్లు భందువులు పేర్కొన్నారు.

తెలంగాణా ఉద్యమకారులను ఆదుకోవాలి --బోగే ఉపేందర్

తెలంగాణా ఉద్యమకారులను ఆదుకోవాలి --బోగే ఉపేందర్

(రెబ్బెన వుదయం ప్రతినిధి); తెలంగా ఉద్యమ కారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని బి సి సంగం జిల్లా ఉపా ద్యాక్షుడు బోగే ఉపేందర్ అన్నారు , ఆదివారం రెబ్బెన కు వచ్చిన మంత్రి జాగు రామన్నకు వినతి పత్రాన్ని ఇచ్చారు , తెలంగాణా ఉద్యమములో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రాష్ట్ర సాధనలో పాల్గొన్నామని అన్నారు , ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని . ప్రతి ఒక్కరికి 5ఎకరాల భూమిని ఇవ్వాలలని , ఆర్థికంగా నష్టపోయిన వారికి 25 లక్షలు ఇవ్వాలని ,అదేవిదంగా బి సి సబ్సిడీ రుణాలు వెంటనే మంజూరు అయ్యే విదంగా చూడాలని అన్నారు .  

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదాం -జోగు రామాన్న

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదాం -జోగు  రామాన్న

(రెబ్బెన వుదయం ప్రతినిధి); మొక్కలను నాటి పర్యావనాన్ని కాపాడాల్సిన భాద్యత అందరి పై ఉందని అటవీ శాఖా మంత్రి జాగు రామాన్న అన్నారు . ఆది వారం రెబ్బెన లోని నర్సారిని సందర్శించి ఆయాన మాట్లాడారు. వర్షకాలం రానున్నందున అటవి శాఖ అధికారులు నర్సరిలో భారి ఎత్తున మొక్కలను పెంచి వాటిని సకాలంలో నాటి అదిలాబాద్ జిల్లాను పచ్చదనం తో  నిండుగా ఉండాలని అటవి శాఖ మంత్రి వర్యులు జోగు రామన్న అన్నారు  నర్సరిలో మొక్కలను శ్రద్ధగా పెంచి మండలం లో ని అటివి భూములలో మొక్కలు నాటి  పరియవరణ ణా న్ని కాపాడాలని అన్నారు . అదేవిదంగా ప్రభూత్వ ఉద్యోగులు మొక్కలు నాటి వాటిని కాపాడవసిన భాద్యత తమపై ఉందని అన్నారు . ఈ కార్యక్రమంలో ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ , ఎం పి  పి  కె సంజీవ్, వైస్ ఎం పి  పి  రేణుక , జెడ్ పి  టి సి బాబు రావు , సర్పంచ్ వెంకటమ్మ , జిల్లా ప్రధాన కార్య దర్శి చెన్న సోమషేకర్ , జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ జైస్వాల్ , నాయకులూ మోడెమ్ సుదేర్షన్ గౌడ్ , బి శ్రీధర్ ,ఎం శ్రీనివాసరావు , తదితరులు పాల్గొన్నారు , 

ఆవిర్బావ దినోత్సవ సంబరాలకు ఏర్పాట్లు పూర్తి

ఆవిర్బావ దినోత్సవ సంబరాలకు ఏర్పాట్లు పూర్తి


(రెబ్బెన వుదయం ప్రతినిధి); తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ సంబరాలలో బాగంగా బెల్లంపలి ఏరియాలోని సింగరేణి రెబ్బెన మండలంలోని గోలేటి టౌషిప్ సింగరేణి పాటశాల మైదానంలో తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ సందర్బంగా జూన్ 2న ఘనంగా జరుపుకోనుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని  ఏర్పాటుచేసినట్లు బెల్లం పల్లి ఏరియా ఎస్ ఓ టు  జి ఎం కొండయ్య  అన్నారు .  ఆదివారం  విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  వేడుకలలో తెలంగాణ ధూం దాం ,బతుకమ్మ ,తెలంగాణ  రుచులతో చేసిన వంటకాల ఏర్పాట్లు ,స్తానిక కళాకారులచే గాన నృత్యాలు ,మైళ లకు ,పిల్లలకు బెలంపల్లి ఏరియాలోని ఈ నెల 27న బెల్లంపల్లి టీ సి ఓ ఎ  క్లబ్ లో ,30న మాదారం టౌషిప్ కమిటి హాల్ లో ,31న గోలేటి టౌన్ షిప్ సింగరేణి పాటశాల మైదానంలో వివిధ రకాల ఆటల పోటీలు ,ముగ్గులు పోటీలు నిర్వయిం చి జూన్ 2వ తేదిన  బహుమతులు  ప్రదాన కార్యక్రమం ఉంటుందన్నారు . ఈ సమావేశములో  డిజియం జే . చిత్రంజన్ కుమార్ ఉన్నారు . 

Saturday, 28 May 2016

100రూపాయల కొరకు హత్య ప్రయతం

100రూపాయల కొరకు హత్య ప్రయతం 

అన్న వద్దకు తమ్ముడు 200 రూపాయలకు కూలికి వెళ్ళగా 100 రూపాయలు  ఇఛి  మరో 100 రూపాయల కోసం  హత్యప్రయత్నం.  ఈ దుర్గటన రెబ్బెన మండలంలోని ఎదవెల్లి గ్రామంలో అగ్గిల శ్రీకాంత్ శనివారం తన అన్న భీమేశ్ వద్ద 200 రూపాయలకు  కులి పనికోసం వెళ్ళగా సాయంత్రం వేళలో 100రూపాయలు ఇచ్చి మిగత 100 అడుగా తమ్ముడితో తగువులాడి గొడ్డలితోతలపై తీవ్రంగా  గాయపరచాడని ఇంచార్జాజ్ యస్ఐ టి.వి రావు తెలిపారు గాయపడిన అగ్గిల. శ్రీకాంత్ ను  108 లో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. 

Friday, 27 May 2016

మండల స్థాయి క్రీడ పోటిలకు ఎంపిక

 మండల స్థాయి క్రీడ పోటిలకు ఎంపిక 

 (రెబ్బెన వుదయం ప్రతినిది);  రెబ్బెన మండలంలోని తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ సంబరాలలో బాగంగా గోలేటి భీమన్న స్టేడియంలో శుక్రవారం నాడు వాలీబాల్ ,పుట్ బాల్ ,లాంగ్ జంప్ ,హై జంప్.మండల స్థాయి క్రీడలను జపిటిసి బాబురావు ప్రారంబించారు . అనంతరం వారు మాట్లాడుతూ యువకులు అన్ని క్రీడ రంగాలలో ముందుండి ఆదిలభాద్ జిల్లాను రాష్ట్ర స్థాయి క్రీడల్లో ముందుండాలని   తహసిల్దార్ రమేష్ గౌడ్, ఎపియం రాజ్ కుమార్ ,మండల విద్యాధికారి వెంకటేశ్వరస్వామి తదితరలు ఉన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ వేడుకలు ఘనంగా జరపండి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ వేడుకలు ఘనంగా జరపండి 


(రెబ్బెన వుదయం ప్రతినిధి); కేసియర్ కళలు కన్నా బంగారు తెలంగాణ ఆవిర్బావ దినోత్సవాన్ని జూన్ రెండున ఘనంగా జరుపుకోవాలని యంపిపి సంజీవ్ కుమార్ అధ్యక్షతన శుక్రవారం రోజున   రెబ్బెన యంపి డి ఒ కార్యాలయంలో మండల అధికారులకు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జూన్ రెండొవ తేదిన జరుపుకునే తెలంగాణ ఆవిర్బావ సంభారాలను అధికారులు సర్పంచులు ప్రభుత్వ ఉద్యోగులు అందరు వారివారి కార్యాలయాలలో పారిశుధ్య పనులు చేయింఛి అందమైన రంగురంగుల  విద్యుత్ దీపాలతో కార్యాలయ భవనాలను అలంకరించు కోవాలని ప్రతి ఒక గ్రామపంచాయతిలో 25కిలోల మిట్టాయిలను పంచాలని కోరారు . అనంతరం ముఖ్యాతితిగా విచ్చేసిన జడ్ పి టి సి బాబురావు ,పర్యవేక్షణ అధికారి తహసిల్దార్ రమేష్ గౌడ్ మరియు యంపి డి ఒ లక్ష్మినారాయన లు మాట్లాడుతూ ఒక్క రోజు జరుపుకునే తెలంగాణ సంబరాలు ఉదయం 8గంటల లోపు ప్రభుత్వ కార్యాలయాలలో పథాక ఆవిష్కరణ చేయాలి . తెలంగాణ తల్లి విగ్రహాలకు ,తెలంగాణ అమర వీరులస్థూపాలకు పూలమాలలు వేసి నివ్వాళ్ళు అర్పించాలన్నారు . అలాగే కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలోని పంచాయతి పరిధిలో మహిళలకు ముగ్గుల పోటిలు,పాటల పోటీలు నిర్వయిం చాలని తెలిపారు . అదేవిధంగా అధికారులు ,ప్రభుత్వ ఉద్యోగులు ,మహిళలు ప్రతి ఒక్కరు తమవంతు భాద్యత వహింఛి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్  ఎపియం లు వెంకటరమణ ,రాజ్ కుమార్ పంచాయితీరాజ్ ఏ ఈ జగన్   ,ఎపిఒ కల్పన ,ఇసిడియస్ సూపర్ వేజర్ లక్ష్మి ,అర్ డ బ్ల్యు సోని ,యంపిటిసిలు మండల సర్పంచులు తదితరలు పాల్గొన్నారు.

Thursday, 26 May 2016

సాదా బైనామలను ఉచిత భూ పట్టాలు చేసుకోండి -తహసిల్దార్

సాదా బైనామలను   ఉచిత భూ పట్టాలు చేసుకోండి -తహసిల్దార్ 

(రెబ్బెన వుదయం ప్రతినిధి); తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సాధబైయన ద్వారా 5ఎకరాలభూమి రైతులు  ఉచిత భూ పట్టాలు చేసుకోవాలని రెబ్బెన మండల తాహసిల్దార్ బండారి రమేష్ గౌడ్ గురువారం పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు.  2-06-2014  లోపల సాధబైనమ ద్వారా 5ఎకరాల భూమి కొనుగోలు చేసినవారు సకాలంలో వచ్చే నెల  తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోచ్చావ ల సందర్బంగా రైతులకు ఉచిత భూ పట్టాలు తీసుకొనుటకు స్థానిక మీ సేవలలో సాధబైనామ లు మరియు ఇతర భూ పత్రాలను జూన్ 2నుండి జూన్ 10వ తేది వరకు మీ సేవలలో ధరకాస్తు చేసుకోని రైతు లు సద్వినియోగం చేసుకోవాలని  తాహసిల్దార్ కోరారు











కార్మికుల సమష్య ల పై ఒక్క రోజు నిరాహార దీక్ష

కార్మికుల సమష్య ల పై ఒక్క రోజు  నిరాహార దీక్ష
(రెబ్బెన వుదయం ప్రతినిధి); భెల్లం పల్లి ఏరియా లో సింగరేణి మైననర్స్ మరియు ఇం జనీరింగ్ వర్కర్స్ ఉనియన్ యచ్ యం యస్ విభాగం వారు కార్మికుల సమష్య ల పై గురువారం రెబ్బెన మండలం గోలేటి జియం కార్యాలయం ముందు  ఒక్క రోజు  నిరాహార దీక్ష చేపట్టారు వారు మాట్లాడుతూ సకలజన సమ్మే కాలపు వేతనాలను వెంటనే చెల్లించాలని వారసత్వపు ఉద్యోగాలను అమలు చేయాలనీ ,కార్మికుల కొరకు రెండు పడకల ఇం డ్లను నిర్మించాలని ,కాంట్రాక్ట్ కార్మికుల క్రమభద్ధికరన చేయాలనీ,జీతాల పెంపు ,తొలగించిన వారి ఉద్యోగాలు వారి పిల్లలకు ఇవ్వాలని అన్నారు. ఈ దీక్షలో మని రామ్ సింగ్ ,రాజనర్సు ,రాజన్న ,అం జనేయులు గౌడ్ తదితరలు పాల్గొన్నారు.

బీసి ఐక్య సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడిగా ఆంజనేయులు గౌడ్

బీసి ఐక్య సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడిగా ఆంజనేయులు గౌడ్  

(రెబ్బెన వుదయం ప్రతినిధి); బిసి ఐక్య సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడుగా అంజనేయులు గౌడ్ ను ఏక గ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని  ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు విజిఅర్ నారగోని తెలిపారు.  హైదరాబాద్ లోని బషీర్ భాగ్ ప్రెస్ క్లబ్ లో బిసి ఐక్య సంఘర్షణ సమితి రాష్ట్ర మహా సభలోజరిగిన ఎన్నికలో రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన కేసరి అంజనేయులు గౌడ్ ని  ఎన్నుకున్నారు. బిసి ఐక్య సంఘర్షణ సమితి గత మూడు పర్యాయాలుగా జిల్లా ఆధ్యక్షుడుగా 10సం  రాల నుంచి బిసి హక్కులకై పోరాటాలు చేస్తు   జిల్లా అధ్యక్షుడుగా కొనసాగారు  . బిసి ఐక్య సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులుగా ఏక గ్రీవంగా ఎన్నికవడం పట్ల బిసి ఐక్య సంఘర్షణ సమితి జిల్లా కార్యదర్శి భోగె . ఉపేందర్ , మండలాద్యక్షుడు పాలగాని పర్వతాలు , ఉపధ్యక్షుడు సియఃచ్. శ్రీనివాస్ , రాయిల్ల . నర్సయ్య , కార్యదర్శి రామగిరి . సతీష్, మానేం . సంతోష్ లు సంతోషం వ్యక్తం చేశారు.  

Wednesday, 25 May 2016

జిల్లా స్థాయి చెస్ పోటిలకు ఎంపికైన నవనీత్


జిల్లా స్థాయి చెస్ పోటిలకు ఎంపికైన నవనీత్ 

(రెబ్బెన వుదయం ప్రతినిధి); జిల్లా చెస్ చాంపియన్ షిప్ రెబ్బెన మండలం గోలేటి గ్రామానికిచెందిన సంమిడ్ల నవనీత్ సాధించినట్లు  జిల్లా అసోసియేషన్ డేలప్ మెంట్ చైర్మెన్ యస రాజిరెడ్డి తెలిపారు మంచిర్యాల్ పట్టణంలోని రివిలేషన్ హైస్కూల్ లో జిల్లా స్థాహి అండర్ 11 13  ఓపెన్ విభాగాల్లో చెస్ చాంపియన్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు.  అండర్ 11విభాగంలో ఐదు రౌండ్లలో ప్రతిభ చూపి జిల్లా చెస్ చాంపియన్ షిప్ ను సొంతం చేసుకున్నడు. ఈ నెల 28,29 తేదిల్లో హైదరాభాద్ లో నిర్వహించే అంతర్ జిల్లా చెస్ చాంపియన్ పోటిల్లో నవనీత్ పాల్గొననున్నట్లు తెలిపారు సంమిడ్ల నవనీత్  ని జెడ్పిటిసి బాబురావు ,యంపిపి సంజీవ్ కుమార్ మరియు తదితర నాయకులు అందరు ప్రత్యేక అబినందనలు తెలుపుతూ జరుగ బోయె రాష్ర్ట స్థాయి పోటిలలో విజయం సాదించాలని అన్నారు.

Tuesday, 24 May 2016

రైలు ఎక్కుతూ జారిపడి వ్యక్తి మృతి

రైలు ఎక్కుతూ జారిపడి వ్యక్తి మృతి 

(రెబ్బెన వుదయం ప్రతినిధి);  రెబ్బెన మండలంలో ఆసిఫాబాద్ రైల్వే స్టేషన్ పరిదిలో మగళవారం   రోషన్ అలి ( 55 ) వెళ్తున్న రైలు ఎక్కే ప్రయత్నంలో జారిపడి మృతిచెందాడు. స్తానికులు ,కుటిం భికులు తెలిపిన వివరాల ప్రకారం భాద్రచాలంరోడ్డు నుండి సిర్పూర్ టౌన్ వెళ్ళే సింగరేణి రైలు ఎక్కుతూ జారిపడి మరణించిన  రోషన్ అలి మంచిర్యాల్ నివాసి ఆయనకు  ముగ్గురు అమ్మయిలు ,ముగ్గురు అబ్బాయిలు మరియు భార్య ఉన్నారు. రోషన్ అలీ కుటుంభాన్ని పోషించుటకు  ప్రతిరోజు రైలులో చిరువ్యపారం చేసుకుంటు జీవనం సాగించేవాడని ఇంకా మూడు రోజ్జులో కూతురు పెళ్లి ఉందని కుటిం భికులుతెలిపారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే సంఘ టన స్థలానికి హుటాహుటిన చేరిన పెద్ద అల్లుడు అలీ ,మేనల్లుడు వాలబ్ అలీ బోరున రోదించారు. 

కార్మికుల పని వేళలు మార్చాలని ధర్నా


కార్మికుల పని వేళలు మార్చాలని ధర్నా 


(రెబ్బెన వుదయం ప్రతినిధి); ఓపన్ కాస్టు లో కార్మికుల పని వేళలు మార్చాలని రెబ్బెన మండలంలో గోలేటి కైర్గుడా ఆర్చ్ వద్ద్ధ ఆదివారం నాడు కార్మికుల పనివేళలు మార్చాలని నినాదాలు చేస్తూ దర్న నిర్వహించారు టిబిజికేయాస్ యైస్ ప్రెసిడెంట్ నల గొండ సదాశివ్ మాట్లాడుతూ ఈమధ్యకాలంలో పనివేళలు మర్చినట్టే మర్చి మల్లి ఎదావిధిగా కార్మికులతో పనులు చేపిస్తున్నారు అధిక ఎడ్డలు ఉండటం వలన కార్మికుల ఆరోగ్య నిమితం మధ్యహ్నం పూట విశ్రాంతి కొరకు యాజమాన్యం ఉత్పత్తి తో పాటు కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కార్మికుల పనివేళలు మార్చాలని కోరారు ఈధర్నలొ టిబిజికేయాస్ ఏర్య కార్యదర్శి శంకరయ్య ,శ్రీనివాసరెడ్డి ,మోహన్ కుమార్ ,శంకర్ ,చార్లెస్ ,లక్ష్మినారయన తదితర కార్మికులు పాల్గొన్నారు   















  

మినీ మహానాడుకు భారీసంఖ్యలోతరలిన తెదేపా నాయకులు

మినీ మహానాడుకు భారీసంఖ్యలోతరలిన తెదేపా నాయకులు 



(రెబ్బెన వుదయం ప్రతినిధి); మినీ మహానాడుకు రెబ్బెన నుండి తెదేప నాయకులు ఆదివారం నాడు మంచిర్యాల లో జరుగుతున్న మిని మహానాడు సబకు బారి ఎత్తున తరలి వెళ్లారు తెలుగుదేశం మహిళా జిల్లా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి అధ్వర్యంలో మండలంలోని నాయకులు కార్యకర్తలు తరళారు తెదేప పార్టి మండల అధ్యక్షుడు సంగం శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు జె ప్రేమ్ ధాస్,దుర్గంరాము,అధికార ప్రతినిది రావుజీ, రెబ్బెన తెదేప పార్టి యూత్ మండల అధ్యక్షుడు మడ్డి శ్రీనివాస్,మండల కార్యదర్శి అజెయ్ కుమార్ జైశ్వాల్, పోతురెడ్డి,కిరణ్,కార్తిక్,సంతోష్ తదితరలు వెళ్లారు.

Saturday, 21 May 2016

రైతులకు సబ్సిడీ ఫై విత్తనాల పంపినీ

రైతులకు సబ్సిడీ ఫై విత్తనాల పంపినీ                                

(రెబ్బెన వుదయం ప్రతినిధి);రెబ్బెన మండలంలో  వ్యవసాయ రైతు  సహకార కేంద్రంలో శనివారం నాడు రైతులకు సబ్సిడీ ఫై కందులు మరియు జీలుగా విత్తనాలను పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో జెడ్. పి .టి.సి బాబురావు,సింగల్ విండో చైర్మన్  గాజుల రవి , మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు రేణుక, సర్పంచ్ పెసరి వెంకటమ్మ, ఎ. ఓ మంజుల , టి ఆర్ ఎస్ మండల అద్యక్షుడు పోటు శ్రీనివాస్ , సి. ఈ .ఓ సంతోష్  రైతు లు గోపి , గంగాధర్ , మల్లేష్ ,   శ్రీను దితరులు  పాల్గొనారు. 

ఘనంగా బౌద్ధ పౌర్ణమి వేడుకలు

  ఘనంగా బౌద్ధ పౌర్ణమి వేడుకలు
(రెబ్బెన వుదయం ప్రతినిధి);రెబ్బెన మండలంలో బౌద్ధ పౌర్ణమి వేడుకలు  ఘనంగా జరుపుకున్నారు.  గంగాపూర్ గ్రామం లో నేతకాని కులం ఆధ్వర్యం లో బౌద్ధ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకుని జెండా ఎగరవేశారు. అనంతరం వారు  మాట్లాడుతూ ప్రతి  ఏట బౌద్దపౌర్ణమి వేడుకలు గంగాపూర్ లో ఘనంగా జరుపు కుంటాం అని గ్రామం లో యువకులు అందరు బుద్దుని ఆశయ అడుగు జడలలో శాంతి మార్గం లో అందరు మసులు కోవాలని అన్నారు. సంఘం నాయకులు దుర్గం గంటమ్మ, ముంజం వినోద్ కుమార్, దుర్గం శంకర్ , తిరుపతి తదితరులు పాల్గొనారు .

విలేజ్ ట్రబల్ డెవలప్మెంట్ ఏజెన్సి ఎన్నికలలో ఉపాధ్యక్షులు గ ఏర్గేటి సతయ్య

విలేజ్ ట్రబల్  డెవలప్మెంట్ ఏజెన్సి ఎన్నికలలో ఉపాధ్యక్షులు గ ఏర్గేటి సతయ్య

(రెబ్బెన వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలం లోని నంబాల  గ్రామ  పంచాయితి పరిది లో  పులికుంట గ్రామంలో శనివారం నాడు ఐ. టి. డి .ఎ పి. ఓ  ఆదేశాల మేరకు నిర్వహించిన విలేజ్ ట్రబల్  డెవలప్మెంట్ ఏజెన్సి ఎన్నికలను   గ్రామ ససర్పంచ్ గజ్జెల సుశీల మరియు  వి .ఆర్. ఓ అద్వర్యంలో నిర్వహించారు. ఈ ఎన్నికలో వి టి డి ఎ ఉపాధ్యక్షులు గ ఏర్గేటి సతయ్య, వి టి డి ఎ కార్యదర్శి గ బురుస పోచమల్లు ఎన్నికయారు.



Friday, 20 May 2016

తెలంగాణా జాగృతి యూత్ మండల కార్యవర్గం ఎన్నిక

తెలంగాణా జాగృతి యూత్ మండల కార్యవర్గం ఎన్నిక      
 (రెబ్బెన వుదయం ప్రతినిధి);  తెలంగాణ  జాగృతి యూత్ మండల కార్యవర్గాన్ని  గురువారం నాడు రెబ్బెన ఆర్ అండ్ బీ అతిధి గృహం లొం నియోజక వర్గ అద్యక్షుడు హన్మండ్ల సాయికృష్ణ మరియు తూర్పు  కో  కన్వినర్ రంగు మహేష్ గౌడ్ కార్య వర్గ  సభ్యుల ఆధ్వర్యం లో జాగృతి మండల కార్యవర్గాన్ని  ఎన్నుకోవడం జరిగింది  . రెబ్బెన మండల జాగృతి యూత్ అద్యక్షుడు గా ఆవిడపు గోపి, మండల ఉపాద్యక్షుని గా మండల తిరుపతి, ప్రధాన కార్యదర్శి గా వనమాల వినయ్ , కోశాది కారిగా ముంజాల వెంకన్న గౌడ్, ప్రచార కార్యదర్శులు గా గాందార్ల  శ్రీనివాస్, టేకం వెంకటేష్ , కార్యవర్గసబ్యులు  అమిత్ జైశ్వాల్ , సాగర్ , ఆవిడపు తిరుపతి, బొడ్డు రాజు , వంశీ కోట్రంగి , గుర్లె బిమేష్ లను ఎన్నుకోవడం జరిగిందని కో కన్వినర్ రంగు మహేష్ గౌడ్  ఒక ప్రకటనలో తెలిపారు.

Wednesday, 18 May 2016

ఫీల్డ్ అసిస్టెంట్ల 9 వ రోజుకి చేరిన సమ్మె

ఫీల్డ్ అసిస్టెంట్ల  9 వ రోజుకి చేరిన సమ్మె  


(రెబ్బెన వుదయం ప్రతినిధి);  రెబ్బెనలో   ఎమ్ పి డి ఓ కార్యాలయం ముందు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాది హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు చేపటిన  నిరవదిక సమ్మె బుదవారానికి 9వ   రోజుకు చేరింది.   వీరికి  ఎ ఐ వై ఎఫ్ మండల అద్యక్షుడు జాడి తిరుపతి,ఈ సమ్మెలో వ్యసాయ కార్మిక సంఘం మండల అద్యక్షుడు అనుముల రమేష్  మద్దతు తెలిపారు.  అనంతరం మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టంట్ లకు  కనీసం వేతనం 15000 చెల్లించాలని అన్నారు,  వీరికి  మండల బదిలీ ఏర్పాటు చేయాలనీ అలాగే   రేగ్యులర్ చేయాలనీ అన్నారు.    రాష్టప్రబుత్వం  అధికారంలోకి రాక ముందు ఉద్యోగులను అన్నివిదాలుగా ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత రోడ్డున పడేయడం జరిగినది, కావున  ఫీల్డ్ అసిస్టెంట్లు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.  ఉపాది హామీ కులీలను 200 రోజుల పనిదినాలు కల్పించాలన్నారు. ,  ఫీల్డ్ అసిస్టంట్ లు   ఎ . తుకారం, డి .గణపతి  ఎ . ఫైకయ్య , స్వప్న,   మొగిలి, ఎమ్ . వెంకటేశం, తుకారం,కె.తిరుపతి,  ,దేవానంద్ జి . తిరుపతి ఉన్నారు 

తెలుగు దేశం పార్టి కోసం కృషి చేస్తా

 తెలుగు దేశం పార్టి కోసం కృషి చేస్తా 

(రెబ్బెన వుదయం ప్రతినిధి);    రెబ్బెన మండల తెలుగు దేశం పార్టి మండల అధ్యక్షుడు సంగెం శ్రీనివాస్ తెలుగు దేశం పార్టి కోసం కృషి చేస్తాను అన్నారు . బుదవారం  విలేకరులతో మాట్లాడుతూ గత 23 సంవత్సరాలుగా నుంచి  తెలుగు దేశం పార్టి లో పని చేస్తునానని తెలిపారు. రెండు సార్లు గా గ్రామ కమిటి అధ్యక్షునిగా ఎన్నిక అయ్యాను అని తెలిపారు. ప్రస్తుతం రెబ్బెన తెలుగు దేశం పార్టి మండల అధ్యక్షునిగ  పనిచేస్తునానని తెలిపారు.  తెలుగు దేశం పార్టీ నుంచి తన వంతు కృషి ప్రజలకు చేస్తానని అన్నారు.  మండల వాసులకు అందు బాటులో వుంటూ తన వంతు సహాయం చేస్తానని, అవినీతి జరగా కుండ చుస్తానాని రైతులకు సహయమ చేస్తా అన్నారు తెలుగు దేశం పార్టీ లో వుండడం సంతోష కరం అని అన్నారు. అదేవిదముగా మే 22 న మంచిర్యాల్ లో  జరిగే మినీ మహానాడు కి కార్యకర్తలు మండల వాసులు బారి ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలనీ కోరారు 

కలప అక్రమ రవాణా పట్టివేత

కలప అక్రమ రవాణా పట్టివేత   
 (రెబ్బెన వుదయం ప్రతినిధి); కాగజ్ నగర్ నుండి మంచరియాల్   వైపు వెళ్తున్న ఆటో   నంబర్  ఎ పీ 1ఎక్స్ 3790 గల వాహనంలో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను రెబ్బెన ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ   వద్ద ఎఫ్ అర్  వో వినయ్ కుమార్ సాహు అందించిన సమాచారముతో డిప్యూటి ఆర్ వో శ్రీనివాస్ చాకచక్యంగా కాపుకాసి పట్టుకున్నారు . 3 , టేకు దుంగలు , వాటి విలువ 5931 రూపాయలు ఉంటుందని ఆయన తెలిపారు. బీట్ అధికారులు ఎం డి అతరోద్దిన్ . మహ్మాద్ షరీఫ్ ,రవి ఉన్నారు

రైలులో నుంచి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

   రైలులో నుంచి  పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి 


(రెబ్బెన వుదయం ప్రతినిధి);  రెబ్బెన మండలంలో ఆసిఫాబాద్ రైల్వే స్టేషన్ పరిదిలో   గుర్తు తెలియని  రైలు నుండి  జారి   పడి   గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.  ఆ వ్యక్తి వయసు సుమారు   25 వరకు వుంటుంది.  ఆ వ్యక్తి వేసుకున్న డ్రెస్   నిలి కలరు షార్ట్,  కాఫీ కలరు పైంట్ వున్నట్లు   స్తానికులు వివరాల మేరకు  ఇంకా పూర్తి సమాచారం తెలియరాలేదు

Tuesday, 17 May 2016

ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకోవాలి

 ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకోవాలి  

(రెబ్బెన వుదయం ప్రతినిధి)రెబ్బెన గ్రామా పంచాయితి లో ఇంటింట మరుగుదొడ్లు నిర్మాణ క్రమంలో మంగళ వారం నాడు  వార్డ్  మెంబర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశం లో  సర్పంచ్ పెసరి వెంకటమ్మ మాట్లాడుతూ ఇంటింట మరుగుదొడ్లు నిర్మించాలని నూతనంగా ప్రవేశపెట్టిన ఓ డి ఎఫ్ పథకంలో  ఇంటింటా సర్వే చేసి మరుగుదొడ్లు లేని వారి దరకాస్తులు వాటిని ఎం పి డి ఓ వారికీ పంపిస్తాం అన్నారు. అలానే పారిశుద్యం  లో బాగంగా ప్రతి ఒక కాలనీలో మురికి కాలువలు శుబ్రం చేపిస్తున్నాం అన్నారు.  ఈ సమావేశం లో పంచాయితి కార్యదర్శి మురళీధర్, వార్డ్ మెంబర్లు చిరంజీవి గౌడ్ , ఆత్మకూరి నరేష్ , కళావతి , బొడ్డు యశోద , తదితరులు పాల్గొన్నారు.

తెలుగు దేశం పార్టి కార్యవర్గం ఎన్నిక

   తెలుగు దేశం పార్టి కార్యవర్గం ఎన్నిక                                                                                                                                                                         

(రెబ్బెన వుదయం ప్రతినిధి);  రెబ్బెన మండలం లో మంగళ వారం నాడు ఆర్ అండ్ బి  గెస్ట్ హౌస్ లో తెలుగు దేశం  పార్టి నూతన  కార్యవర్గ సమావేశం జరిగింది.  మహిళా విబాగం జిల్లా అధ్యక్షురాలు  సొల్లు లక్ష్మి అద్వర్యం లో పార్టి నూతన కార్యవర్గ ఎనుకున్నారు. మండల అధ్యక్షునిగా సంగం శ్రీనివాస్  , ఉపదాక్షునిగా జాదవ్ ప్రెమ్ దాస్,  మండల అదికార ప్రతినిది గా జాబరి రావుజి,  రెబ్బెన తెలుగు దేశం పార్టి  యూత్  మండల అధ్యక్షునిగా మడ్డి శ్రీనివాస్,  ఎన్నుకోవడం  జరిగింది. ఈ కార్యక్రమం లో టిడిపి పార్టి మండల కార్యర్దర్శి  అజయ్ కుమార్ జైస్వాల్ , టిడిపి జిల్ల ఉపాదక్షురాలు గజ్జెల అనసూయ , వెంకటరాజం , నానాజీ , గాలి ఓదెలు , మహేందర్  తదితరులు పాల్గొనారు  

వినూత్న రీతిలో ఫీల్డ్ అసిస్టెంట్ల దీక్ష

  వినూత్న రీతిలో  ఫీల్డ్ అసిస్టెంట్ల దీక్ష 


(రెబ్బెన వుదయం ప్రతినిధి);  రెబ్బెనలో   ఎమ్ పి డి ఓ కార్యాలయం ముందు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాది హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు చేపటిన  నిరవదిక సమ్మె మంగళవారానికి 8వ   రోజుకు చేరింది. మూతికి నల్లటి వస్రం కట్టుకొని  నిరసన తెలిపారు.  వీరికి  ఎ ఐ వై ఎఫ్ మండల అద్యక్షుడు జాడి తిరుపతి మద్దతు తెలిపారు.    అనంతరం మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టంట్ లకు  కనీసం వేతనం 15000 చెల్లించాలని అన్నారు,  వీరికి  మండల బదిలీ ఏర్పాటు చేయాలనీ అలాగే   రేగ్యులర్ చేయాలనీ అన్నారు.    రాష్టప్రబుత్వం  అధికారంలోకి రాక ముందు ఉద్యోగులను అన్నివిదాలుగా ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత రోడ్డున పడేయడం జరిగినది  కావున  ఫీల్డ్ అసిస్టెంట్లు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.  ఉపాది హామీ కులీల ను 200 రోజుల పనిదినాలు కల్పించాలన్నారు. ఈ సమ్మెలో వవ్యసాయ కార్మిక సంఘం మండల అద్యక్షుడు అనుముల రమేష్ ,  ఫీల్డ్ అసిస్టంట్ లు   ఎ . తుకారం, డి .గణపతి  ఎ . ఫైకయ్య , స్వప్న,   మొగిలి, ఎమ్ . వెంకటేశం, తుకారం,కె.తిరుపతి,  ,దేవానంద్ జి . తిరుపతి ఉన్నారు. 

ఇసుక మాఫియా ను అరికట్టాలని సబ్ కలెక్టర్ కు వినతి

ఇసుక మాఫియా ను అరికట్టాలని సబ్ కలెక్టర్ కు  వినతి

(రెబ్బెన వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని ఇసుక మాఫియాను అరికట్టాలని, అలాగే ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను  అమ్ముకుంటు ప్రభుత్వా ఆదాయానికి గండికోడుతున్నారని, దీనితో ప్రభుత్వానికి  కోట్లాది రూపాయల ఆదాయం  గండిపడుతుందని సోమవారం రెబ్బెన తహసిల్దార్ కార్యాలయం లో సబ్ కలెక్టర్ అద్వైత్ సింగ్ కుమార్ కు ఎ ఐ వై ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు బోగే ఉపేందర్, ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్లు వినతి పత్రంను అందచేసారు.  అనంతరం వారు మాట్లాడుతూ  గోలేటి  క్రాసు రోడ్డు వద్ద నిర్మిస్తున్న సింగరేణి సంస్ధ  అద్వర్యంలో  కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ [సి.ఎస్ .పి]  నంబాలవాగు  నుంచి గత కొన్ని సం,, ల నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అమ్ముకుంటు ప్రభుత్వా ఆదాయానికి గండికోడుతున్నారని అన్నారు.  ఈ నెల 10వ తేదిన అక్రముగా తరలిస్తున్నకంట్రాక్టర్ శంకరయ్య ట్రాక్టర్, జె సి బి లను పట్టుకొని , సి పి ఐ నాయకులు రెవెన్యు అధికారులకు అప్పజెప్పిన ఇంతవరకు  కంట్రాక్టర్ శంకరయ్య పై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నా కేవలం జరిమానాతో  సరిపెట్టడం సరికాదని,ఇసుక మాఫియా  అక్రమ రవాణా మండలంలో ఆగాలంటే బాధ్యులపై  వాల్టా చట్టం, క్రిమినల్ కేసులు నమోదు చేయాలనీ  డిమాండ్ చేసారు.

Sunday, 15 May 2016

ఫీల్డ్ అసిస్టంట్లకు ఆరోగ్యభద్రత కార్డులు జారి చేయాలి


 ఫీల్డ్ అసిస్టంట్లకు ఆరోగ్యభద్రత కార్డులు జారి చేయాలి 

(రెబ్బెన వుదయం ప్రతినిధి)ఫీల్డ్ అసిస్టంట్లకు  491 జి ఓ  ప్రకారం ప్రతి కుటుంబ సభ్యులకు ఆరోగ్య కార్డులు, ఉద్యోగ  అర్హులకు  ఇక్రిమెంటులు ఇవ్వాలని  సెక్రటరీ శ్రీనివాస్ అన్నారు.  రెబ్బెన లోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాది హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు ఎమ్ పి డి ఓ కార్యాలయం ముందు చేస్తున్న  సమ్మె శని వారనికి 5వ రోజుకు చేరుకుంది. వారు మాట్లాడుతూ  చాలి చాలని  వేతనాలతో  ఉద్యోగాలు చేస్తున్నామని, కనీసం వేతనం 15000 చెల్లించాలని, ఫీల్డ్ అసిస్టంట్ లకు  మండల బదిలీ ఏర్పాటు చేయాలనీ,  ప్రభుత్వం సమస్యలను పరిశీలించడం లో విఫలం అయింది అని తేలిపారు. ఈ  నిరవదిక సమ్మె ఫీల్డ్ అసిస్టంట్ లు వెంకటేశం, కె.తిరుపతి  మొగిలి, ఎ . తుకారం, ఎ. ఫైకయ్య   స్వప్న, డి గణపతి ,దేవానం. తిరుపతి , ఉన్నారు   

బిసి లకు కళ్యాణ లక్ష్మిపథకం వర్తింపు సంతోషకరం

బిసి లకు కళ్యాణ లక్ష్మిపథకం వర్తింపు సంతోషకరం 

  (రెబ్బెన వుదయం ప్రతినిధి); పేద యువతుల పెళ్ళి కోసం ఎస్సీ, ఎస్టీ బాలికలకు అందించే కళ్యాణ లక్ష్మిపథకంను వీరితో పాటు బిసి బాలికలకు కూడా  పథకం అందించడంఎంతో సంతోషకరమని  తెరాస తూర్పు జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు బీసి సంఘ జిల్లా మహిళా ఉప అద్యక్షురాలు కుందారపు శంకరమ్మ అన్నారు. శనివారం రెబ్బెన అధితి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరి సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి బిసి లకు కూడా  అందించడం ద్వారా పేద బాలికలకు ఎంతో చేయుతనించిన తెలంగాణా ప్రభుత్వ ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావుకి బిసి కుల సంఘం తరుపు నుంచి ప్రత్కేక ఆభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో నంబాల వార్డ్ సభ్యురాలు తీపుల సువర్ణ, పిల్లి లత, కోయడ సంధ్య, మిట్ల స్వరూప లు ఉన్నారు.

Friday, 13 May 2016

అక్రము ఇసుక రవాణాను నివారించడంలో రెవెన్యూ అధికారులు విఫలం -బోగే ఉపేందర్

అక్రము ఇసుక రవాణాను నివారించడంలో రెవెన్యూ అధికారులు విఫలం   -బోగే ఉపేందర్ 

(రెబ్బెన వుదయం ప్రతినిధి); అక్రము ఇసుక రవాణాను రెవెన్యూ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం సరికాదని  ఎ ఐ వై ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు బోగే ఉపేందర్  అన్నారు  శుక్రవారం రెబ్బెన తహసిల్దార్ కార్యాలయం ముందు దర్న చేసి తహసిల్దార్ కి వినతి పత్రం అందచేసారు  అనంతరం ఎ ఐ వై ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు బోగే ఉపేందర్ ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్లు  మాట్లాడుతూ  రెబ్బెన మండలంలోని నంబాల గ్రామా పంచాయితీ పరిదిలో సింగరేణి సమస్త అద్వర్యంలో నిర్మిస్తున్న కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ [సి ఎస్ పి]  నంబాలవాగు  నుంచి  అక్రముగా తరలిస్తున్న ట్రాక్టర్, జె సి బి ని, సి పి ఐ నాయకులు రెవెన్యు అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి అధినంలోకి తీసుకున్నారు కానీ గత మూడు రోజులనుండి  కంట్రాక్టర్ శంకరయ్య ,  జె సి బి,  ట్రాక్టర్ యజమానులపై ఎలాంటి చర్య తీసుకోలేదని ఇసుక అక్రమ పాల్పడ్డ శంకరయ్య రెవెన్యూ అధికారులుచూసి చూడనట్టు వ్యవహరించడం సరికాదు అన్నారు   గత కొంత కాలముగా కోట్లాది రూపాయల   అక్రము ఇసుక రవాణాను  తరలిస్తూన్నారని  సి ఎచ్ పి కంట్రాక్టర్ శంకరయ్య ను జె సి బి,  ట్రాక్టర్ యజమానులపై వాల్ట చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేసి ఇసుక రవాణాను అరికట్టలన్నారు కోట్లాది రూపాయల విలువ గల  ఇసుకను అక్రమంగా తరలించిన వారిపై విచారణ జరిపి  రికవరీ చేయాలని అన్నారు . ఉన్నంత అధికారులు తక్షణం స్పందించి ఇసుక రవాణాను డిమాండ్ చేసారు. రెబ్బెన తహసిల్దార్ రమేష్ ని వివరణ కోరగా ఫై అధికారులు సిఫార్సు చేసామని ట్రాక్టర్, జె సి బి ని, పోలీస్  వారి కస్టడిలో తీసుకోమని ఆదేశాలు జారి చేసామని కంట్రాక్టర్ శంకరయ్య కు జరిమానా విదిస్తామన్నారు అలానే అక్రమ ఇసుక రవాణా  చేయడం నేరమని మొదటిసారిగా పట్టుబడితే జరిమానా విదించి మరోసారి పట్టుబడితే చట్ట పరమైన కేసులు నమోదు చేస్తామని వారు తెలిపారు  ఈ సందర్బముగా ఎ ఐ వై ఎఫ్ మండల కార్యదర్శి  జాడి తిరుపతి, ఎ ఐ ఎస్ ఎఫ్ మండల కార్యదర్శి పూదరి సాయి  ఎ ఐ టి యు సి  మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.

108 లో మహిళ సుఖ ప్రసవం


108 లో మహిళ సుఖ ప్రసవం

రెబ్బెన: (వుదయం ప్రతినిధి): రెబ్బెన మండలంలోని తుంగేడ  గ్రామానికి చెందిన రేష్మ  అనే గర్బిని స్త్రీ   108 అంబులన్స్  లో శుక్రవారం ప్రసవించింది   తుంగేడ  గ్రామానికి చెందిన రేష్మ  భర్త రవి పురిటి నొప్పులతో బాధపడుతు వున్న తన బార్య కోసం 108కి ఫోన్ చేయగా హుటహుట్టుగా 108లోతుంగేడ  నుంచి రెబ్బెన హాస్పిటల్ తరలిస్తుండగా గంగాపూర్  సమీపంలో పండంటి  పాపని  ప్రసవించింది అనంతరం ప్రాథమ చికిస్త చేసి  తల్లి పాపను  రెబ్బెన  హాస్పిటల్ కి ఈ మ్ టి బషిరోద్దిన్ ఫైలేట్ తిరుపతిలు  తరలించారు తల్లి బిడ్డ క్షేమముగా వున్నారు అని వారు తెలిపారు 

ఇ జి ఎస్ ఉపాది హామీ కూలీలకు వేతనాలు చేల్లిపులో అక్రమాలు

ఇ జి ఎస్ ఉపాది హామీ కూలీలకు వేతనాలు చేల్లిపులో అక్రమాలు 


(రెబ్బెన వుదయం ప్రతినిధి); మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాది హామీ పథకంలోపనిచేస్తున్న కూలీల దగ్గరి నుండి బ్రాంచ్ పోస్ట్ మెన్ [ బి పి ఎమ్]  ఉపాది హామీ కులిలకు వేతనాలు చేల్లిన్చేటప్పుడు  10 రూపాయలనుండి 50 రూపాయల వరకు అదనంగా వసులు చేస్తున్నారు    రెబ్బెన గ్రామా పంచాయితీ పరిదిలో పని చేస్తున్న ఉపాది కూలీలు శుక్రవారం స్తానిక ఎం పి డి ఓ లక్ష్మి నారాయణ కి మరియు ఎ పి ఓ కల్పనకు వినపతి పత్రం అందించి అనతరం కూలీలు మాట్లాడుతూ వారం వారం వేతనాలు చేల్లిన్చేటప్పుడు  బ్రాంచ్ పోస్ట్ మెన్ [ బి పి ఎమ్] లు కూలిల దగ్గరి నుండి పైన మిగిలిన చిల్లర 10 నుండి 50 వరకు రూపాయలు తీసుకుంటున్నారు మరియు ఎ  గ్రామంలో వున్నా కూలీలకు వారి గ్రామాలలో ఇవ్వాల్సి వుండగా  మండల కేంద్రంలో వారి ఇంటి వద్ద ఇస్తున్నారు వేతనం తీసుకోవడానికి కూలీలు వారి రోజువారి వేతనం పోగొట్టుకొని మండుటెండలో మండల కేంద్రం లోని వారి ఇంటి వద్దకు వచ్చి  తీసుకోవలసి వస్తుందని కూలీలు ఆగ్రహం వ్యక్తం చేసారు . ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి ఇలాంటి దుస్తితి పురనవ్రుతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో ఎన్ . మల్లేష్ ,సంతోష్ ,హన్మంతు , పాoడు వగుమెర రాజుకుమార్ , రాజు,నరసింహ శ్యంరావు రమేష్, నర్సయ్య ,కాంతారావు తదితర కూలీలు పాల్గొన్నారు 

4వ రోజుకు చేరిన ఫీల్డ్ అసిస్టెంట్ల నిరవదిక సమ్మె

 4వ  రోజుకు చేరిన ఫీల్డ్ అసిస్టెంట్ల నిరవదిక సమ్మె 
(రెబ్బెన వుదయం ప్రతినిధి)రెబ్బెన మండలంలోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాది హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు . శుక్రవారనికి 4వ   రోజుకు చేరింది  ఎమ్ పి డి ఓ కార్యాలయం ముందు క్షేత్ర సహాయకుల సంఘo పిలుపు మ్మేరకు   నిరవదిక సమ్మె చేపట్టారు. వీరికి ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ మండల అద్యక్షుడు పుదరి సాయి కిరణ్ మద్దతు తెలిపారు   అనంతరం సెక్రటరీ శ్రీనివాస్ మాట్లాడుతూ  మాట్లాడుతూ    గత 12 సంవత్సరాలుగా  విదులు నిర్వహిస్తున్నామని చాలి చాలని  వేతనాలతో  ఉద్యోగాలు చేస్తున్నామని అని అన్నారు కనీసం వేతనం 15000 చెల్లించాలని అన్నారు ఫీల్డ్ అసిస్టంట్ లకు  మండల బదిలీ ఏర్పాటు చేయాలనీ అన్నారు ప్రభుత్వం సమస్యలను పరిశీలించడం లో విఫలం అయింది అని తేలిపారు రేగ్యులర్ చేయాలనీ అన్నారు ఫీల్డ్ అసిస్టంట్లకు  491 జి ఓ  ప్రకారం ప్రతి కుటుంబ సభ్యులకు ఆరోగ్య కార్డులు ఉద్యోగులకు  అర్హులను  బట్టి  ఇక్రిమెంటులు ఇవ్వాలని అన్నారు  ఈ  నిరవదిక సమ్మె ఫీల్డ్ అసిస్టంట్ లు జి .  కె.తిరుపతి ఎ . తుకారం ఎ . ఫైకయ్య   మొగిలి, తుకారం, స్వప్న, డి గణపతి ,దేవానంద్ జి . తిరుపతి ,ఎమ్ . వెంకటేశం  ఉన్నారు 

Thursday, 12 May 2016

లారి ద్విచక్ర వాహనం డీ ఒకరు మృతి

లారి ద్విచక్ర వాహనం డీ  ఒకరు మృతి 


(రెబ్బెన వుదయం ప్రతినిధి)  రెబ్బెన మండలంలో ప్రధాన రహదారిలో పులికుంట గ్రామం వద్ద లారి ద్విచక్ర  వాహనం  డీ  కొట్టడంతో  వాడయి  సుదర్శన్ 26  అక్కడికక్కడే  మృతిచెందాడు ఇతను గోలేటి  అబ్బాపూర్  లో ప్రైవేట్  డ్రైవర్ గా  పనిచేస్తునాడు.   ఇతనికి పెళ్లి అయి  2 నెలలు  గడుస్తుంది ఇంతలోనే  ఈ దుర్గటన జరిగింది కుటుంబానికి ఎంతో శోకాన్ని  మిగిలిన్చిపోయాడు  ఇతను కెరమెరి మండలంలోని గోయగాం  గ్రామానికి  చెందినవాడిగా గుర్తించారు.రెబ్బెన నుండి ద్విచక్ర వాహనం  బెల్లంపల్లి  వైపు వెళ్ళుతుండగ  ఎదురుగ వస్తున్నా లారి  డీ  కొట్టడంతో ఈ దుర్గటన జరిగిందని మాదారం ఇంచార్జి  ఎస్ ఐ రాంబాబు తెలిపారు.