Saturday, 31 December 2016

ఎస్ వి ఇంగ్లిష్ మీడియంలో ముగ్గుల పోటీలు

                       
ఎస్ వి ఇంగ్లిష్ మీడియంలో ముగ్గుల  పోటీలు 

కోమురం భీంమ్ రెబ్బెన (వుదయం) రెబ్బెన మండలములోని సాయి విద్యాలయము ( ఎస్ వి ) ఇంగ్లిష్ మీడియం హై స్కూల్ లో నూతన సంవత్సరమును పురస్కరించుకొని విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించినట్లు పాఠశాల కరస్పాండెంట్  దీకొండ  విజయ కుమారి తెలిపారు . విద్యార్థులు రకరకాల రంగులతో అందమైన ముగ్గులు వేశారు . ఈ ముగ్గులతో ప్రథమ , ద్వితీయ , తృతీయ బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు . ఈ కార్య క్రమములో ప్రధానోపాధ్యాయుడు దీకొండ సంజీవ్ కుమార్ . ఉపాధ్యాయురాలు ఏ ఉష , ఎస్ డి రేష్మ , వై సుజాత తో పాటు విద్యార్థులు .  తదితరులు ఉన్నారు.

బెల్లం పల్లి ఏరియా ఉత్పత్తి 102 శాతం

బెల్లం పల్లి ఏరియా ఉత్పత్తి 102 శాతం 

కోమురం భీంమ్ రెబ్బెన (వుదయం) రెబ్బెన మండలంలోని గోలేటి బెల్లంపల్లి ఏరియా గనుల ఉత్పత్తి 4532000టన్నుల బొగ్గుకు ఉత్పత్తి లక్షానికి గాను 4621443టన్నుల బొగ్గు ఉత్పత్తితో 102 శాతంలో నిలిచిందని బెల్లం పల్లి ఏరియా జి ఎం రవి శంకర్ అన్నారు.  ఖైరిగూడ ఓ సి లక్ష్యం 2240000తన్నులు కాగ 2184684తన్నులతో 98 శాతంలోనూ దొర్లి ఓ సి 1 లక్ష్యం 1332000 తన్నులు కాగ 1979426 తన్నులతో 149 శాతంలోనూ అదే విదంగా దొర్లి ఓ సి 2 లక్ష్యం 300000 కాగ 112153 తన్నులతో 37 శాతంలో నినించిందన్నారు .  . డిషెమ్బర్ మాసానికిగాను బిల్లంపాల్ ఏరియా గనుల లక్ష్యం 536000తాన్నులు కాగా  722122తన్నులు సాధించి 135 శాతములో తెలిపారు .కంపెనీ నిర్దేశించిన లక్షణాన్ని అధిగమిస్తామని జి ఎం అన్నారు . బెల్లంపాలి ఏరియా కు భవిష్యత్తు ఉందని తెలిపారు .కార్మికుల సంక్షేమమే ముఖ్యమని  వారి సంక్షేమముకోసం ఎన్నో కార్య ర్కమాలు చేపడ్తు ఉన్నట్లు పేర్కొన్నారు .  ఈ కార్య క్రమములో  .  డి జి ఎం చిత్తరంజన్ కమార్ , ఐ ఐ యి  డి యోహాను . డిప్యూటి పర్సనల్ మేనేజర్ రాజేశ్వర్ లు పాల్గొన్నారు.

రెబ్బెన పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్ పి

   రెబ్బెన పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్ పి  


          కోమురం భీంమ్ రెబ్బెన (వుదయం)     నూతనంగా ఏర్పాడిన  కొమరం భీం జిల్లాలో  ని  రెబ్బెన  పోలీస్  స్టేషన్  శనివారం ఎస్  పి  సంప్రీత్ సింగ్    తనిఖీ చేసారు . రికార్డు పరిశీలించి పరిసరాల ప్రాంత జనావాసాల తీరును ఆరా తీశారు.పోలీస్ స్టేష నోలి రికార్డులను పరిశీలించారు . ఎస్ ఐ పని తీరును సిబ్బంది  పని తీరును అడిగి తెలుసుకున్నారు.

Friday, 30 December 2016

జిల్లాపాలనాధికారి కార్యాలయం ఎదుట ఒప్పంద అధ్యాపకులు నిరవధిక సమ్మె

జిల్లాపాలనాధికారి కార్యాలయం ఎదుట ఒప్పంద  అధ్యాపకులు నిరవధిక సమ్మె 


కోమురం భీంమ్ రెబ్బెన (వుదయం) డిసెంబర్ 30 ; ఒప్పంద అధ్యాపకులు  సమస్యలను పరిక్షరించాలని శుక్రవారం కొమరం భీం జిల్లా  కేంద్రం ఆసిఫాబాద్ పాలనాధికారి   కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె చేపట్టారు ఒప్పంద అధ్యాపకుల అస్సోసియేషన్  వారు   మాట్లాడుతూ రాష్ట్రా కమిటీ పిలుపు మేరకు సమ్మె ను నిర్వహిస్తున్నాం అని సమస్యను వెంటనే పరిష్కరించి ప్రభుత్వ అధ్యాపకులకు చెల్లిస్తున్న వేతనాలకు సమానం గా వేతనాలను చెల్లించాలన్నారు. పదవ పిఆర్సి  ప్రకారం  పరిమినెంట్ చేసి మూలా వేతనాన్ని చెల్లించాలి  అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమానపనికి సమానవేతనం చెల్లించాలి   వ్యాప్తం గా ఒప్పంద అధ్యాపకులు ఈ నెల  29 నుండి రాష్ట్ర వ్యాప్తం గా నిరవధిక సమ్మెలో  పాల్గొంటున్నాం అన్నారు. సమ్మెలో భాగం గా ఒప్పంద అధ్యాపకులు అస్సోసియేషన్ జె ఏ సి అద్వర్యం లో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ రిలే నిరాహార దీక్షలను జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంగం అధ్యక్షులు జి కరుణా గౌడ్ ,  తెలంగాణా  విద్యావంతుల జిల్లా నాయకులూ గుర్రాల వెంకన్నలు ప్రారంభించారు  ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ ఒప్పంద అధ్యాపకులను రేగులైజ్  చేయాలనీ వారి న్యాయమైన డిమాండ్ లను వెంటనే పరీక్షకరించాల్సిన భాద్యత ప్రభుత్వం పై ఉందని అన్నారు. మహిళలకు వేతనం తో కూడిన సెలవులను మంజూరు చేయాలనీ, విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని , క్యాజువల్ సెలవులను పెంచాలని డిమాండ్ చేసారు.  విద్యార్ధి సంఘాల నాయకులు మద్దతు పలికారు.ఈ  నిరవధిక సమ్మె లో రెబ్బెన ఒప్పంద అధ్యాపకులు   కె హరిదాసు , టి వెంకటేశ్వర్లు,  జి బైరాగి , ఏ నవీన్ రెడ్డి, యమ శ్రీనివాస్, బి. గంగాధర్, బి. రాజు , ప్రవీణ్, ప్రకాష్  తదితర ఒప్పంద అధ్యాపకులు పాల్గొన్నారు.

కాంట్రాక్టు లెక్చరర్ ల సమస్యలను వెంటనే పరిక్షరించాలి

కాంట్రాక్టు  లెక్చరర్ ల సమస్యలను వెంటనే పరిక్షరించాలి 


 రెబ్బెన కోమురం భీంమ్ (వుదయం) డిసెంబర్ 30 ; కాంట్రాక్టు  లెక్చరర్ ల సమస్యలను వెంటనే పరిక్షరించాలని  ఏ ఐ ఎస్ ఎఫ్ మరియు పి డి యు ఎఫ్ నాయకులూ శుక్రవారం రెబ్బన మండల తహశీల్ ధర్ కార్యాలయంలో ఆర్ ఐ అశోక్ కి వినతి పత్రం అందించారు అనంతరం వారు న్తలాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు జూనియర్ లచ్చులర్ ను రెగ్యూలర్ చేయాలని గత రెండు రోజులనుండి లచులర్ సమ్మె చేస్తున్నారు ఇంటర్ మీడియట్ చదువుతున్న విద్యార్థుల వార్షిక పరీక్షలు సమావిస్తున్న సమయంలో కాంట్రాక్టు లచులర్ వారి సమసిస్లు పరిష్కరించాలని సమ్మె చేయడం ద్వారా విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి కావున వారి యూక్క డిమాండు వారి యూక్క డిమాండ్ లను వంటనే సరి చేసి విద్యార్థుల చదువుకు భంగం కలగకుండా చుగూడాలన్నారు. ఈ కార్యక్రమం లో ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి  దుర్గం రవీందర్,    పి డి యు ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పాపారావు ఐ ఎస్ ఎఫ్ డివిజన్ కార్యదర్శి  పూదరి సాయి నాయకులూ పర్వతి సాయి , ప్రణయ్, హరీష్,లక్ష్మన్, అక్షయ్ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Wednesday, 28 December 2016

పశువులకు గాలికుంటూ వ్యాధి నివారణకు టీకాలు

పశువులకు గాలికుంటూ వ్యాధి నివారణకు టీకాలు 


కోమురం భీంమ్ రెబ్బెన (వుదయం) డిసెంబర్ 28; రెబ్బెన మండలం లోని కొండపల్లి,నేర్పల్లి గ్రామాలలో బుధవారంనాడు పశువుల వైద్యాధికారి సాగర్,గ్రామా సర్పంచ్ మాన్తుమేర పశువుల గాలికుంటూ వ్యాధి నివారణ టీకాల శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగ గ్రామాలల్లో ఉన్న 644 పశువులకు వైద్య అధికారి సాగర్ మరియు వైద్య సిబ్బంది అద్వర్యం లో గాలికుంటూ నివారణ  టీకాలు వేశారు.

మున్నూరుకాపు యువజన మండల అద్యక్ష్యుడిగ గజ్జెల మల్లికార్జున్

మున్నూరుకాపు యువజన మండల అద్యక్ష్యుడిగ గజ్జెల మల్లికార్జున్ 


కోమురం భీంమ్ రెబ్బెన (వుదయం) డిసెంబర్ 28; మున్నూరుకాపు  యువజన మండల అద్యక్ష్యుడిగ గజ్జెల మల్లికార్జున్ ఎన్నుకోవడం జరిగిందని జిల్లా యువజన అధ్యక్షుడు గడ్డల సురేష్,కార్యదర్శి సదాశివ్,జిల్లా ఉపాధ్యక్షులు పూదరి మల్లేష్ తెలిపారు.బుధవారం నాడు రెబ్బెన మండలం లోని రామాలయం లో మండల సమావేశం నిర్వహించి కొత్త మండల యువజన సమితి ఎన్నుకున్నారు.గౌరవ అధ్యక్షులు గ మిట్ట దేవేందర్,ప్రధాన కార్యదర్శిగా గోలేటి కి చెందిన గంగిశెట్టి సురేష్ ను ఎన్నుకోగా మండల కార్యదర్శులుగా  గాజుల సత్తయ్య,మానేం కార్తీక్ లను ఎన్నుకున్నారు.ఉపాధ్యక్షులు గ కస్తూరి మహేష్,గజ్జెల సృజన్లను ఎన్నుకున్నారు. ప్రచారకార్యదర్శి గ రెబ్బెన కు చెందిన మామిడి శేఖర్ కార్యవర్గ సభ్యునిగా ఓడ్నలా దుర్గప్రసాద్ లను ఎన్నుకున్నారు. ఈ సమావేశం లో సంఘం పెద్దలు ఎంపీపీ కార్నాథం సంజీవ్ కుమార్,చెన్న సోమశేఖర్,కుందారపు శంకరమ్మ,బాలకృష్ణ,గజ్జెల సత్యనారాయణ, దెబ్బటి శంకర్,దెబ్బటి  సత్తయ్య,ఇంగు మల్లేష్,నాగరాజు,ఇందూరి రవీందర్,మండల మధుకర్,అంగాల రమేష్ పాల్గొన్నారు.

Monday, 26 December 2016

ప్రజా సంక్షేమాన్ని మరచిన ప్రభుత్వం - గుండా మల్లేష్

ప్రజా సంక్షేమాన్ని మరచిన ప్రభుత్వం - గుండా మల్లేష్ 

కోమురం భీంమ్ రెబ్బెన (వుదయం) డిసెంబర్ 26; ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన ప్రభుత్వలు ప్రజా సంక్షేమాన్ని మరచి పోయాయని   సి ప్ ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండా మల్లేష్ అన్నారు. సిపిఐ 91వ  ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా సోమవారం రెబ్బెన బస్సు ప్రాంగణ సమీపంలో సిపిఐ జండాని ఆవిష్కరించి పార్టీ బాలేపితం కొరకు నాయకులతో చర్చించారు, అలాగే ప్రభుత్వాల తీరును గురించి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజల కష్ట  సుఖాలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదాని కెసిఆర్ డబల్ బెడ్రూమ్ ఊరి కో కోడి ఇంటికో ఈక అనే చందనంగా మారిందని ఎద్దేవా చేశారు. దళితులకు 3 ఎకురాలు డబుల్ బెడ్ రూమ్లు లేవు. ఒకవేళ అమలులోకి వస్తే లబ్దిదారులకు కాకుండా పార్టీ కార్యకర్తలకే అంకితం అయ్యాయి అన్నారు.  కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని అసలు తెలంగాణాలో కాంట్రాక్టు వ్యవస్థ అనేదే ఉండదని ఎన్నికల ప్రచారంలో అన్నారు కానీ ఇప్పటికీ అదే వ్యవస్థ కొనసాగుతుందని అన్నారు.  మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు కాంట్రాక్టర్లకు కమిషన్ పథకాలు గా  మరయని అన్నరు. కేంద్రం లో నోట్ల రద్దు వాళ్ళ తీవ్ర ఇబ్బందులను ఏదురుకుంటున్నారని మోధీ  కొండని తవ్వి ఎలుకను  పట్టినట్లు వ్యవహరిస్తున్నట్లు పాతనోట్ల రద్దు పేరిట సామాన్య ప్రజల  జీవితాలతో చలగాటలు ఆడుతున్నారు అన్నారు. ఈరోజు బ్యాంకుల ముందు  సామాన్యులే కనబడుతు బారులు  తీరిన ప్రజలకు నోట్ల కొరత మాత్రం తీరడం లేక ప్రాణాలు కోల్పోయి ,పెళ్లిళ్లు ఆగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అన్నారు.   బడాబాబులు మాత్రం కోట్లకు కోట్లు  కొత్త 2000 వేల రూపాయల నోట్లతో పట్టుబడుతున్నారు. బ్లాక్ మని వెలికితీయుటలో ప్రభుత్వం విఫలం అయింది అన్నారు.  సిపిఐ పార్టీ బ్రిటిష్ వాళ్ళ పాలనాలు వాళ్ళతో పోరాడి స్వతంత్రం తెచ్చిన ఘనత ఈ ఎర్ర జండదేనని రానన్న రోజుల్లో ప్రభుత్వాలు విఫలమై ఎర్ర జండానే స్తానం దక్కుతుందని నినాదాలు చేశారు.  ఈ కార్య క్రమములో  సి పి  ఐ జిల్లా కార్య వర్గ సభ్యులు ఎస్ తిరుపతి , ఏ ఐ ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దుర్గం రవీందర్ , ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా సహాయ కార్య దర్శి బోగే ఉపేందర్ , రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ధరణి సత్యనారాయణ, పట్టాన కార్యదర్శి జగ్గయ్య , ఏ ఐ టి యూ సి మండల్ కార్యదర్శి రాయిలా నర్సయ్య, పి సాయి మహిపాల్ తదితర నాయకులూ  ఉన్నారు.

Sunday, 25 December 2016

సోనాపూర్ లో నగదు రహిత లావాదేవీల సర్వే



 సోనాపూర్ లో నగదు రహిత లావాదేవీల సర్వే  

కోమురం భీంమ్ రెబ్బెన (వుదయం) డిసెంబర్ 25; నగదు రహిత లావాదేవీల పై రెబ్బెన తహశీల్ధార్ బండారి రమేష్ గౌడ్ ఆదివారం ప్రత్యేకంగా సిబ్బందితో సర్వే  కు వెళ్లారు . ఈ సందర్బంగా ఆయన   ఇంటి ఇంటి కి వెళ్లి సమగ్రంగా సర్వేను చేపట్టాలని అన్నారు . ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని సిబ్బందికి తెలియ జేశారు. ప్రతి ఒక్కరికి బ్యాం కు  పాసు పుస్తకాలు ఉండాలని , ఏ టి ఎం లు ఉండే విదంగా చూడాలని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉపపాద్యాయుడికి తీవ్ర గాయాలు

ప్రభుత్వ ఉపపాద్యాయుడికి తీవ్ర గాయాలు 


కోమురం భీంమ్ రెబ్బెన (వుదయం) డిసెంబర్ 25; రెబ్బెన మండలములోని ఆదివారం  నక్కలా గూడా ప్రధాన రహదారి పై జరిగిన రోడ్ ప్రమాదంలో తక్కళ్ళ పల్లి ప్రభుత్వ పాఠశాలలో తెలుగు పండిత్  గా పని చేస్తున్న ఆత్రం కేశవ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి . ఆత్రం కేశవ్ ద్విచక్ర వాహనం పై వస్తుండగా ఎదురుగా వస్తున్నా ద్విచక్ర వాహనం ఢీకొనడముతో తల కు తీవ్ర ఘాయాలయ్యాయి . రెబ్బన పొలిసుల  సహాయముతో  హుటా హుటిన  108 అంబులెన్సులో బెల్లం పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు


కోమురం భీంమ్ రెబ్బెన (వుదయం) డిసెంబర్ 25;   క్రిస్మస్‌ వేడుకలను క్రైస్తవ సోదరులు ఆనందోత్సాహాలతో ఆదివారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా   మండలంలోని రెబ్బెన, గంగాపూర్, గోలేటి, నంబాలా, ఇంద్రానగర్ లలో ఏసుక్రీస్తు ప్రార్థనా మందిరాలైన చర్చిలు ప్రార్థనల తో పులకించాయి. తెరాస నాయకులూ దుస్తులు మిఠాయిలు పంచి  క్రిస్మస్‌ వేడుకలలో పాలుపంచుకున్నారు  అలాగే పలు చర్చిలలో ఫాస్టర్లు ఇచ్చిన సందేశం క్రైస్తవ సోదర ,సోదరీమణుల్లో శాంతి, దయ ,కరుణ, జాలీ అనే అంశాలు ప్రభావితం చేసేవిధంగా వున్నాయి. దీంతోపాటు చర్చిలను పలు ప్రాంతాల్లో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. కాగా పలువురు పాస్టర్లు అబాగ్యుల కోసం, ప్రపంచం అంతా ప్రశాంతంగా వుండాలని, ప్రకృతి వైపరిత్యాలనుంచి, మత ఘర్షణల నుంచి, కుల, జాతి విబేధాల వల్ల ప్రజలకే కాదు ఏప్రాణికి నష్టం, కష్టం కలుగకూడదని, ప్రతి ఒక్కరూ కరుణ. జాలి కలిగి ఇతరులను ఇబ్బంది పెట్టకుండా తాను సంపాదించిన సొమ్ములో కొంతైనా దానం చేసి పేద ప్రజలను ఆదుకోవాలని, సమాజ సేవలో పాలుపంచుకోవాలని, క్రీస్తు చూపిన మార్గంలో ప్రయాణించి శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు. కాగా ఈ వేడుకల్లో వున్న క్రైస్తవ సోదరులు చిన్న పిల్లలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, వున్న వారు స్వీట్లు, బిస్కెట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో  ఎం పి  పి  సంజీవ్ కుమార్ , జెడ్ పి టి సి బాబురావు,  తహసీల్దార్ బండారి రమేష్ గౌడ్  మార్కెట్ వైస్ ఛైర్మెన్ కుందారపు శంకరమ్మ, సర్పంచులు పెసర  వెంకటమ్మ,  గజ్జెల సుశీల,  తోట లక్ష్మణ్,టి ఆర్ ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి   సోమశేఖర్ , జిల్లా నాయకులు సుదర్శన్ గౌడ్ , జిల్లా ఉపాద్యాయుడు నవీన్ జైస్వాల్ ,ఉప సర్పంచ్  మండల అధ్యక్షుడు పోటు  శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్లు పల్లె రాజేశ్వర్, మధునయ్య,  టౌన్ అధ్యక్షుడు అశోక్, ఎం శ్రీనివాస్, మోడెం చిరంజీవి గౌడ్, ఎస్ వి  ఇంగ్లిష్ మీడియం కరస్పాండెంట్ ఢీకొండ  విజయ కుమారి , హెడ్ మాస్టర్ సంజీవ్ కుమార్ ,  ఫాస్టర్లు బాబు రావు , జేరిమియా , రాజ రత్నం,మనఃహార్, తిమోతి, విజయ్ ' జాషువా, మంజుల, తదితరులు ఉన్నారు.

సింగరేణి క్రీడాకారులకు బంగారు పథకాలు

 సింగరేణి క్రీడాకారులకు బంగారు పథకాలు 
కోమురం భీంమ్ రెబ్బెన (వుదయం) డిసెంబర్ 25 బెల్లంపల్లి ఏరియా సింగరేణి క్రీడాకారులకు కోల్ ఇండియా లెవెల్ పోటీలలో బంగారు పతాకాలు సాదించారని స్పోర్ట్స్ సుపేర్వేజర్ హెచ్ రమేష్ తెలిపారు.  కోల్కత్తాలో జరిగిన సి ఎల్ ఐ ఇంటర్ కంపెనీ పోటీలలో  గోలేటి ఖేరాగూడ ఓపెన్ క్యాస్ట్ లో ఈ పి  ఆపరేటర్  ఎం యు భాస్కరా చారీ ,  మురారి రావు కు బంగారు పథకాలు రావడముతో బెల్లంపల్లి ఏరియా కు వన్నె తెచ్చ్చారని ఏరియా జి ఎం కె రవి శంకర్ అన్నారు . ప్రత్యక అభినందనలు తెలిపారు.

Saturday, 24 December 2016

కాలుష్యాన్ని నియంత్రించాలి ; జేబీ పొడేల్

కాలుష్యాన్ని నియంత్రించాలి ; జేబీ  పొడేల్ 

కోమురం భీంమ్ రెబ్బెన (వుదయం) డిసెంబర్ 24 రెబ్బెన మండల కేంద్రం నుండి  కూత వేటు దూరం లో ఉన్న దేవుల   గుడం గిరిజన తండా ప్రజలు తీవ్ర కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు జేబీ  పొడేల్ గోలేటి బీజేపీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల  సమావేశం లో అన్నారు దేవులగూడెం సమీపం లో ఉన్న కోల్ వార్ఫ్ లోడింగ్ పాయింట్ ఉండటం వాళ్ళ ఇక్కడ నిత్యం ఓపెన్ కాస్ట్  ల నుండి లారీ ల ద్వారా బొగ్గు తీసుకు వచ్చి ఇక్కడ డంప్ చేయడం జరుగుతుంది ఐతే పల్లవి ఫ్యాక్టరీ సమీపం లో రైల్వే బ్రిడ్జి కింది నుండి బొగ్గు  లారీలు వెళుతున్నాయి రాష్ట్రీయ రహదారి ఫై బొగ్గు చుర పేరుకుపోయి వాహనాలు వెళుతునపుడు దుమ్ము ధూళి కళ్ళలో పడి  వాహన చోదకులు ఇబ్బందుల పాలవుతున్నారని అన్నారు ముఖ్యంగా వార్ఫ్ లోడింగ్ పరిసర ప్రాంతం ఐన దేవులగుడ గిరిజన తండా దుమ్ము దూలితో కాలుష్య బారిన పడి అక్కడి ప్రజలు శ్వాసకోశ వ్యాధిన పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు  ఇకనైన సంబంధిత అధికారులు స్పందించి వార్ఫ్ లోడింగ్ డంపింగ్ యార్డులో మరియు రోడ్ ఫై స్ప్లింకెర్ల ద్వారా నీటిని కొట్టించాలని అన్నారు లేని పక్షములో గిరిజనుల పక్షాన అండగా ఉండి బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చెపాటుతామని హెచ్చరించారు ఈ సమావేశం లో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు  సునీల్ చౌదరి ఆసిఫాబాద్ అసెంబ్లీ కన్వీనర్ చక్రపాణి జిల్లా సీనియర్ నాయకులూ మురళి మండల అధ్యక్షులు కుందారపు బాల కృష్ణ తదితరులు ఉన్నారు.

కేజీబీవీ ని తనిఖీ చేసిన తహసీల్దార్


కేజీబీవీ ని తనిఖీ చేసిన  తహసీల్దార్ 

కోమురం భీంమ్ రెబ్బెన (వుదయం) డిసెంబర్ 24 రెబ్బెన  మండలం లోని గంగాపూర్ లో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంను   శనివారం రోజున తహసీల్దార్ బండారి రమేష్ గౌడ్ ఆకస్మిక తనిఖీ చేసారు విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని తగు జాగ్రత్తలు పాటిస్తూ  పోషక విలువైన ఆహారాన్ని అందించాలని అన్నారు. బియ్యం కూరగాయలను  కడిగిన తరువాతనే వండాలని వంట వన్డే వర్కర్లు సూచి శుభ్రతతో విదులని నిర్వహించాలన్నారు. పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్తమ ఉత్థిర్ణతను  చేరుకోవాలని అన్నారు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాలు చేసారు . వీరితో పటు విఆర్వో ఉమాలాల్ ఉన్నారు.

క్రీడాకారుల కోసం షటిల్ కోర్ట్ ప్రారంభం


క్రీడాకారుల కోసం షటిల్ కోర్ట్ ప్రారంభం 

కోమురం భీంమ్ రెబ్బెన (వుదయం) డిసెంబర్ 24 కోమురం భీంమ్ రెబ్బెన (వుదయం) డిసెంబర్ 24 రెబ్బెన రైల్వే స్టేషన్ సమీపంలో క్రీడాకారుల కోసం  తెరాస నాయకులూ నూతన షటిల్ కోర్టుని ప్రారంభించారు. యువకుల నైపుణ్యాన్ని వెలికితీసే క్రమంలో యువకులను ప్రోత్సహిస్తే క్రీడారంగంలో రాణిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బాబురావు సర్పంచ్ పెసర వెంకటమ్మ, ఆసిఫాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ ఉపసర్పంచ్ శ్రీధర్ తెరాస తూర్పు జిల్లా ఉపాద్యక్షులు నవీన్ కుమార్ జైస్వాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి  చెన్న సోమశేఖర్, టౌన్ అధ్యక్షులు రాపర్తి అశోక్, సోమయ్య , నాయకులు   మోడెమ్ చిరంజీవిగౌడ్ , వెంకన్న గౌడ్ తదితరులు ఉన్నారు.

ఘనంగా సింగరేణి ఆవిర్బావ దినోత్సవ వేడుకలు

 ఘనంగా సింగరేణి  ఆవిర్బావ దినోత్సవ వేడుకలు 




కోమురం భీంమ్ రెబ్బెన (వుదయం) డిసెంబర్ 23 బెల్లంపల్లి ఏరియా లోని గోలేటి టౌన్ షిప్ లో గల భీమన్న మైదానంలో సింగరేణి డే వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.  బెల్లంపల్లి ఏరియ జనరల్ మేనేజర్ కె.రవిశంకర్  సింగరేణి పథక ఆవిష్కరణ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రారంభించారు. సింగరేణి  చరిత్రను, ప్రగతి, విజయాలను చాటిచెప్పే విధంగా ఏర్పాటు చేసిన స్టాళ్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.వివిధ విభాగాల్లో సేవలు అందించిన కార్మికులు సేవాసమితి  బహుమతులు ప్రధానం చేసరు  అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం కర్మికులుపైనే కాకుండా కార్మికుల కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద వహిస్తోంది అని అన్నారు కార్మికుడు ఇంటి వద్ద ప్రశంతగా ఉన్నపుడే ఉత్పతి పై దృష్టి సాదిస్తారని ఆయన అన్నారు కార్మికుల కుటుంబాలను దృష్టిలో ఉంచుకోని ఆరోగ్యం కోసం ఆయుర్వేద వైద్య సదుపాయములు కల్పించమని నిరుద్యోగ యువతీయువకులు స్వయం కృషితో పారిశ్రామికవేత్తలు స్వయం సంపాదకులుగా ఏదిగే అవకాశం కల్పిస్తాము అన్నారు  అనంతరం గుస్సాడి నృత్యం మరియు సంగీతసాహిత్య ,మిమిక్రి  సంస్కృత కార్యక్రమాలు జరుపుకున్నారు   ఈ కార్యక్రమలో ఎస్ ఓ టు జి యం కొండయ్య, రెబ్బెన తహసీల్దార్ బండారి రమేష్ గౌడ్,సేవాసమితి అధ్యక్షురాలు అనురాధ రవి శంకర్ డి జి యం ప్రర్సనల్ చిత్రరంజన్ కుమార్, డి వై పి యం రాజేశ్వర్,  ఈ నర్సారెడ్డి డి జి యం సివిల్ ప్రసాద్, యూనియన్ నాయకులూ స్ తిరుపతి యం శ్రీనివాస్, మొగ్లీ, చార్లెస్, సేవాసభ్యులు కుందారపు శంకరమ్మ,  లక్ష్మి, తదితర సభ్యులు అధికారులు, ఉద్యోగులు    పాల్గొన్నారు. 

Wednesday, 21 December 2016

నేడు కొమురం భీం జిల్లా కలెక్టర్ చంపాలాల్ గొల్లేటి టౌన్ షిప్ సందర్శన నగదు రహిత లావాలదేవిలా పై అవగాహనా

 నేడు కొమురం భీం జిల్లా కలెక్టర్ చంపాలాల్ గొల్లేటి టౌన్ షిప్ సందర్శన 
నగదు రహిత  లావాలదేవిలా  పై అవగాహనా 
    

కొమురం బీమ్ రెబ్బెన డిసెంబర్ 22;   నేడు కొమురం భీం జిల్లా కలెక్టర్ చంపాలాల్ గొల్లేటి టౌన్ షిప్ సందర్శన 

నగదు రహిత  లావాలదేవిలా  పై అవగాహనా సదస్సు ఈ రోజు గురునారం సింగరేణి ఆఫీస్ లో మధ్యాహ్నం 3గంటలకు   నిర్వహించబడునని తసీల్దార్ బండారి రమేష్ గౌడ్ తెలిపారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, వ్యాపారస్తులు, రైతులు,మొబైల్ పాయింట్ యజమానులు పెటిలైజర్లు, చిన్న తరహా వ్యాపారస్తులు, అంగన్ వాడికార్య కర్తలు, రేషన్ డీలర్లు,  సింగరేణి అధికారులు, కార్మికులు అందరు ఈ  నగదు రహిత లావా దేవిల అవగాహనా సదస్సుకు రావాలని కోరారు. రెబ్బెన మండలం లోని గొల్లేటి గ్రామపంచాయతి పైలెట్ పంచాయతీ గా ఎన్నికైనట్టు తెలిపారు. అందుచే   నగదు రహి రహిత దేవిలను ప్రత్సాహిస్తూ స్వీపింగ్ మిషిన్ వాడకాన్ని అమలులోకి తీసుకు వచ్చి ప్రజలకి అవగాహాన కల్పిస్తూ   ప్రతి ఒక్క సామాన్యులకు అందుబాటులకు వచ్చేలా సహకరరించాలని కోరారు.

గుర్తు తెలియని రైలుకు ఢికొని వైద్య అధికారి మృతి

గుర్తు తెలియని రైలుకు ఢికొని  వైద్య అధికారి  మృతి 

కొమురం బీమ్ రెబ్బెన డిసెంబర్ 21; రెబ్బెన మండలంలో ప్రభుత్వ ఆసుపత్రి లో పనిచేస్తున్నాఎల్ రజిత (27) ఆసుపత్రి వెనక ఉన్న రైల్వే ట్రాక్ వద్ద మంగళారం సాయంత్రం గుర్తు తెలియని రైలు కింద పడి మరణించినట్టు   రైల్వే జి ఆర్ పి  పోలీస్ ఏ సత్తయ్య తెలిపారు.రజిత  తాండూర్ ఆసుపత్రిలో పని చేస్తుండగా తాత్కాలికంగా కార్య నిర్వహణ రెబ్బెన ప్రభుత్వ ఆసుపత్రి లో పని చేస్తు మంగళవారం ఉదయం 9:00 గం ,ల నుండి  సాయంత్రం 5గ వరకు డ్యూటీ ముగించుకొని వెళ్ళినట్లు వైద్య  సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం కార్యనిరవ్హణలో ఎదో తెలియని మనస్థాపనతో  మొభావంగా ఉండేదని తెలిపారు ,  కేసు నమోదు చేసుకొని దారియాప్తు చేస్తున్నాం అన్నారు.

నగదు రహిత లావా దేవిలను కొనసాగించాలి

నగదు రహిత  లావా దేవిలను  కొనసాగించాలి 
    

కొమురం బీమ్ రెబ్బెన డిసెంబర్ 21;  నగదు రహిత లావా దేవిలను ప్రజలు కొనసాగించాలని రెబ్బెన  రెబ్బెన ఎంపీడీ ఓ కార్యాలయంలో బుధవారం అధికారులు ప్రజా ప్రతినిధులతో ప్రత్యేక  ఏర్పాటు చేసి నగదు రహిత అవగాహన సదస్సు ఏర్పాటు చేసారు. ఈ సమావేశం లో ప్రత్యేక అధికారి శ్రీనివాస్ ఎంపీపీ  సంజీవ్ కుమార్ ,  తసీల్దార్ బండారి రమేష్ గౌడ్, ఎంపీడీఓ సత్యనారాయణ్ సింగ్ లు పాల్గొని  అవగాహన కార్యక్రమo  చేపట్టారు .  మాట్లాడుతూ  కేద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పేద నోట్ల రద్దు ఫై ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణం లో నగదు రహి రహిత దేవిలను ప్రత్సాహిస్తూ స్వీపింగ్ మిషిన్ వాడకాన్ని అమలులోకి తీసుకు వచ్చి ప్రజలకి అవగాహాన కల్పిస్తూ   ప్రతి ఒక్క సామాన్యులకు అందుబాటులకు వచ్చేలా అధికారులు ప్రజా ప్రజా ప్రతినిధులు సహకరరించాలని అన్నారు , ఈ కార్యక్క్రమంలోఅంగన వాడికార్య కర్తలు ,ఎంపీటీసీ లు  సర్పంచులు  తదితర అధికారులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

Tuesday, 20 December 2016

మేరు సంఘం మండల కమిటీ ఎన్నిక

మేరు  సంఘం మండల కమిటీ ఎన్నిక 


కొమురం బీమ్ రెబ్బెన డిసెంబర్ 20; రెబ్బెన మండలం లో మేర సంఘం మండల కమిటీ ఎన్నిక స్థానిక ఆర్ అండ్ బి గెస్టుహౌస్ లో మండల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. మేరు కుల మండల అధ్యక్షుడుగా బొమ్మినేని శ్రీధర్, ఉపాధ్యక్షులుగా గందే శంకర్ ,కీర్తి మోహన్ ,కోశాధికారి గా బొమ్మినేని వెంకటరమణ ,ప్రధానకార్యదర్శిగా రాయిల్లా నర్సయ్య ,కార్యదర్శులుగా ఆత్మకూరి నరేష్ ,రాయిల్లా శ్రీనివాస్ ,ఎక్కేవార్ దయాకర్ ,రాపర్తి సంతోష్ ,సలగదారులుగా బి లక్ష్మీనారాయణ ,ఆర్ సత్యనారాయణ ,బి సత్యనారాయణ ,బి మల్లయ్య ఈ సందర్బంగా మేర మండల అధ్యక్షుడుగా శ్రీధర్ మాట్లాడుతూ మండలం లో మేర సంఘాన్ని అన్ని రంగాలలో బలోపేతం చేస్తూ రాష్ట్రప్రభుత్వం చేపడుతున్నటువంటి పలు సంక్షేమ పతకాలను అర్హులైన ప్రతి ఒక్క మేర కులస్తులకు అందేలా కృషి చేస్తామని  అన్నారు ఏ సమావేశం లో ఆర్ అశోక్ ,ఆర్ కృష్ణ ,ఎం శంకర్ ,జి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. 

ఐక్య మతాలను ఆదరించడమే ప్రభుత్వ లక్ష్యం

ఐక్య మతాలను ఆదరించడమే ప్రభుత్వ లక్ష్యం 

కొమురం బీమ్ రెబ్బెన డిసెంబర్ 20;  (వుదయం) ఐక్య మతాలను ఆదరించడమే టి ఆర్ ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ కుందారపు శంకరమ్మ అన్నారు . క్రిస్మస్ పండగ వేడుకల సందర్బంగా రెబ్బెనలో ఏసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో పేద ప్రజలకు ప్రభుత్వం అందజేసిన దుస్తులను పంచిపెట్టి కేక్ కట్ చేసి మిఠాయి లు  పంచారు. అనంతరం కుందారపు శంకరమ్మ  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాం ఐక్య మాటలని ఆదరించడమే ప్రభుత్వం లక్షమని ఆమె అన్నారు సమస్త ప్రజలకు సమన్యాయం చేయటమే కెసిఆర్ లక్షమని అన్నారు  ప్రభుత్వం అందించే  ఎన్నో సంక్షేమ పథకాలను  సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు .  ఈ కార్యక్రమాన్నిసర్పంచ్ పెసారు వెంకటమ్మ, పాస్టర్ బాబురావు ,తెరాస టౌన్ అధ్యక్షుడు అశోక్, తదితరులు పాల్గొన్నారు. 

సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగులందరినీ అవుట్ సోర్సింగ్ లోకి మార్చాలి

సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగులందరినీ అవుట్ సోర్సింగ్ లోకి మార్చాలి 


 కొమురం బీమ్ రెబ్బెన డిసెంబర్ 20;  ఉద్యోగులందరినీ అవుట్  సోర్సింగ్ లో కి మార్చాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుందని దానిని వెంటనే విరమించుకోనేలా చేయాలనీ మహాజన పాదయాత్ర  లో భాగంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కి తరలివచ్చిన మహాజన పాదయాత్ర కు  వచ్చిన సి.పి.ఐ (యం) తెలంగాణా కార్యదర్శి తమ్మినేని  వీరభద్రం గార్కి సర్వ శిక్షా అభియాన్ లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్యక్రమంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ (సి.ఆర్.పి),జిల్లా ప్రధాన కార్యదర్శి మారుమొకం రాజేష్ వినతి పత్రం అందజెసి మాట్లాడుతూ సర్వ శిక్షా అభియాన్ లో ఒప్పంద పద్దతిలో పని చేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ (సి.ఆర్.పి),డేటా ఎంట్రీ ఆపరేటర్(సి.సి.ఓ),యం.ఐ.ఎస్ ,మెసేంజర్ ,ఐ.ఈ.ఆర్.టి,కేజిబివి సి.ఆర్.టి లము.మేము గత 6 (ఆరు) సంవత్సరాలుగ సర్వ శిక్షా అభియాన్ లో ఒప్పంద పద్దతిలో పని చేస్తున్నాము.గౌరవ ముఖ్యమంత్రి   గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సర్వ శిక్షా అభియాన్ లో ఒప్పంద పద్దతిలో పని చేస్తున్న అందరిని ఎటువంటి షరతులు లేకుండా క్రమబద్ధికరిచేలా ,సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పు సమాన పనికి సమాన వేతనం అందించేలా చూడాలని , చాలి చాలని వేతనాలతో పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ (సి.ఆర్.పి),డేటా ఎంట్రీ ఆపరేటర్(సి.సి.ఓ),యం.ఐ.ఎస్ ,మెసేంజర్ ,ఐ.ఈ.ఆర్.టి,కేజిబివి సి.ఆర్.టి ల కి ఉద్యోగ భద్రత కల్పించాలని,సర్వ శిక్షా అభియాన్ ‘’ప్లానింగ్ అప్రువాల్ బోర్డు (పిఎబి ) ప్రకారం(సి.ఆర్.పి)లకి  16200/- వేతనం  ఇవ్వాలని, ప్రభుత్వ జీవిత భీమా (10 లక్షలు )అమలు చేయాలని ,మహిళా ఉద్యోగులకు లకి 6 నెలల మాతృత్వ సెలవులు కల్పించేల ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని ,     అంతేకాకుండా ఇటివలి కాలంలో సర్వ శిక్షా అభియాన్ లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్యక్రమంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ (సి.ఆర్.పి),జిల్లా ప్రధాన కార్యదర్శి మారుమొకం రాజేష్ ,జిల్లా సభ్యులు వేముల సత్యనారాయణ ,మిట్ట దేవేందర్ ,రాంటెంకి మహేశ్వర్, సి.సి.ఓ ఇగురపు కృష్ణ , మెసేంజర్ పెరుగు రామయ్య , ఐ.ఈ.ఆర్.టి లు ,కేజిబివి సి.ఆర్.టి లు పాల్గొన్నారు .

సామాజిక తెలంగాణ సాధ్యమైనప్పుడే బంగారు తెలంగాణ సాధ్యం ; తమ్మినేని వీరభద్రం


సామాజిక తెలంగాణ సాధ్యమైనప్పుడే బంగారు తెలంగాణ సాధ్యం ; తమ్మినేని వీరభద్రం 



కొమురం బీమ్ రెబ్బెన డిసెంబర్ 20; సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందన్నసీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మహా జన  పాదయాత్రమంగళ వారనికి కొమరంభీం జిల్లా  రెబ్బెనలో 66వ రోజుకి  చేరుకుంది  ఈ పాదయాత్ర ర్యాలీ   సమావేశంలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందన్న  సత్యాన్ని ప్రభుత్వం గుర్తించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వర్గాలు మాత్రమే సంతోషంగా ఉన్నారని.. బడుగు బలహీన వర్గాలు వారు కనీసం పండగ చేసుకునే స్థితిలో కూడ  లేరని అన్నారు. అన్ని వార్గాలకు సమాన న్యాయం చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని ఆయన విమర్శించారు. దీనిపై తెలంగాణ ప్రజలతోనే పోరాటం చేస్తానని తెలిపారు. పర్యటిస్తున్న పాదయాత్ర బృందానికి తమ బాధలు చెప్పుకున్నారు.సీఎం మనవడు దళితుడి కొడుకు ఒకే బడిలో చదివనప్పుడే తెలంగాణలో అసలైన సామాజిక న్యాయం  జరుగుతుందని అన్నారు. ఐకేపీ వి ఓ ఏ (గ్రామ అసిస్టెంట్ ) గత 16సంవత్సరాలుగా మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేస్తున్నారని గత ప్రభుత్వం ఇస్తున్న 2000/-రూ కూడా ఈ ప్రభుత్వం 38నెలలుగా బాకాయి ఉందని ఎన్నికల ముందు ఐకేపీ విఓఏ లకు 5000/-రూ ఇస్తామని కెసిఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు ,మధ్యన బోజనకార్మికులు కాంట్రాక్టు వర్కర్లను రెగ్యులరైజ్ చేయకపోవడానికి వెనుక సామాజిక కోణం ఉందని, వీళ్ళంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కాబట్టే రెగ్యులరైజ్ చెయ్యట్లేదని అన్నారు.కొమరంభీం జిల్లాలో కొంతమంది  వృద్ధులు తమకు ఫించన్లు రావట్లేదని పిర్యాదులు చేశారని సమస్యలు పరిష్కరించాలంటూ గ్రామంలో పలు సమస్యలు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు పాదయాత్ర బృందానికి తెలియచేశారు. సర్వశిక్షాభియాన్ ,ఆశా ,అంగన్వాడీ ,ఐకేపి విఓఏ ,విద్యార్ధి సంఘాల నాయకులు తమ సమస్యలపై వినతి పత్రం అందచేశారు. ఈ వినతిపత్రాలపై ఆయన స్పందించి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరి సమస్యలపై కెసిఆర్ కి లేఖలురాస్తున్నామని సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఎర్ర జెండా ప్రజల పక్షాన ఉంటూ తెలంగాణ ప్రజలకు సమన్యాయం చేకూరుస్తామన్నారు ఈ మహా జన పాదయాత్ర సమావేశంలో జంవెస్లీ,ఎస్ . రమ ,  ఎం.వి.రమణ ,ఎం డి అబ్బాస్ ,పి ఆశయ్య ,కె నాగేష్ ,ఎం శోభన్ నాయక్ ,నైతం రాజు , స్థానిక నాయకులు రాయల నర్సయ్య ,సుధాకర్ ,రవీందర్ ,సాయి ,తదితరకార్మిక నాయకులు ,ప్రజలు ఉన్నారు 

ప్రైవేట్ విశ్వ విద్యాలయాల బిల్లు ను నిరసిస్తూ ఏ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో రాస్తోరోకో

ప్రైవేట్ విశ్వ విద్యాలయాల బిల్లు ను నిరసిస్తూ  ఏ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో రాస్తోరోకో 




కొమురం బీమ్ రెబ్బెన డిసెంబర్ 19;  (వుదయం)  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ప్రైవేట్ విశ్వ విద్యాలయాల బిల్లు ఆమోదం మంత్రి మండలిలో ఆమోదం తెల్పడాన్ని నిరసిస్తూ  రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కళాశాల  ముందు జాతీయ రహదారి మీద ఏ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో  రాస్తోరోకో  చేపట్టారు.  ఈ సందర్బంగా  ఏ ఐ ఎస్ ఎఫ్ డివిజన్ కార్యదర్శి పూదరి.సాయికిరణ్ మాట్లాడుతు తెలంగాణ  రాష్ట్రము లో ప్రభుత్వ  విద్య వ్యవస్థ సవితి తల్లి ప్రేమ కు గురవుతుందని  అన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ శక్తులను పెంచి పోషించేందుకే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనిన దీనిని   ఏ ఐ ఎస్ ఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అయన అన్నారు. ప్రైవేట్ విశ్వ  విద్యాలయాలు ఏర్పడితే ప్రభుత్వ విశ్వ విద్యాలయాల  మనుగడ కష్టం  అవుతుందని  దీని వలన పేద బడుగు బలహీన  వర్గాల   విద్యార్థులు ఉన్నత చదులవు కు దూరం అయ్యే ప్రమాదం ఉందని  అన్నారు. తెరాస ప్రబుత్వమ్ ఏర్పడ్డాక పూర్తిగా విద్య ఉచితంగా అందిస్తామని చెప్పిన ముఖ్య మంత్రి గారి హామీ ఏమైందని ప్రశ్నించారు. కేజీ టూ పిజి ఉచిత విద్య అంటే ఇదేనా అని అన్నారు.ప్రైవేట్ విశ్వ విద్యాలయాల బిల్లు ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టె కుట్రపూరిత ప్రయత్నాలు చేస్తుందని దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ విశ్వవిద్యాలయాలు ఏర్పడితే సృజనాత్మక కోర్సులకంటే  గిరాకీ ఎక్కువ ఉన్న కోర్స్ లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయని దీని వాళ్ళ ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. ఈ  కార్యక్రమం లో ఏ ఐ ఎస్ ఎఫ్ కళాశాల అధ్యక్షుడు పార్వతి సాయికుమార్,నాయకులూ తిరుపతి,హరీష్,శ్రీధర్,సౌమ్య,స్వరకల్పన, మనీషా,విద్యార్థులు పాల్గొన్నారు.  

Sunday, 18 December 2016

రైతుల క్షేమమే భాజపా లక్ష్యం ; రాష్ర ఉపాధ్యక్షులు ఎస్ కుమార్

రైతుల క్షేమమే భాజపా లక్ష్యం ; రాష్ర ఉపాధ్యక్షులు ఎస్ కుమార్ 

కొమురం బీమ్ రెబ్బెన (వుదయం) డిసెంబర్18 రైతుల సంక్షేమం కోసం ఫసల్ భీమా యోజన పథకాన్నీ  నరేందర్ మోడీ  ప్రవేశ పెట్టారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ కుమార్ అన్నారు ఆదివారం రెబ్బెన మండలం లో గోలేటి లో కొమరంభీ జిల్లా బిజెపి కార్యాలయంలో ముఖ్య అతిధి గ హాజరై మాట్లాడారు రైతులు పంటలపై  ఇన్సూరెన్స్ చేపియాలని సూచించారు. ఫసల్ భీమా యోజన అంటే రైతులు పండించిన పంటలకు ప్రకృతి వైపరీత్యాల నష్టం జరిగిన చొ పంటల తాలూకా ఇన్సూరెన్స్ లతో రైతులు నష్ట పోకుండా  లబ్ది చేకూరడానికి ఏర్పాటు చేసిన పతాకాము అని  అన్నారు . ఈ పథకం కింద  రబీ సీజన్లో వారి కి ఒక ఎకరా వారికీ  28000 వేలు భీమా మొత్తానికి గాను 420 చొప్పున జొన్నపంటకు 10,000 రూ  మొత్తానికి 150 చొప్పున, మొక్క జొన్నకు 20,000 రూ   భీమా  300 చొప్పున , మినుములు 10,000 రూ . బీమా కు 150రూ , చొప్పున వేరు సెనగ 18,000 కు 270భీమా తో మిర్చికి 24,000 రూ  బీమా 12000 ప్రీమియం గ రైతులు ఫసల్ భీమా యోజన పథకంలో చెల్లించినట్లైతే ప్రకృతి విపరీత్య అగ్నిప్రమాదం ,పిడుగు పాటు ,వడగళ్ల వాన,  అతివృష్టి చే పంటలు నీట మునిగిన, వాతావరణం అనుకూలించక తెగలు పట్టిన పొలాలకు ఏఇలాంటి కరుణాలచే రైతులు నష్ట పోయినచో ప్రీమియం కట్టిన రైతులకు ప్రభుత్వం తరుపున 25% నష్ట పరిహారాన్ని చెల్లిస్తున్నదని తెలిపారు . రైతులు పంట రుణాలు పొందే బ్యాంకులలో నిర్బండ ప్రతిపదికాన భీమా ప్రీమియం బ్యాంక్ అధికారులకు చెల్లించాల్సి ఉంటుంది అన్నారు రైతుల కు మరింత సమాచారం కొరకు సంభంధితి వ్యవ సాయ అధికారులను సంప్రదించి ఫసల్ భీమా యోజన పథకాన్నివినియీగించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో  జిల్లా అధ్యక్షులు జెపి పొడేల్, మాజీమంత్రి అమర్సింగ్ థిలావత్, బిజెపి జిల్లా ప్రధాన కకార్యదర్శి బొనగిగి శాతిష్  బాబు, జిల్లా ఉపాధ్యక్షులు కేసరి ఆంజనేయులు గౌడ్ తదితర నాయకులూ తదితరులు ఉన్నారు.       

Friday, 16 December 2016

బొగ్గు రవాణా కొరకు టెండర్ల ప్రకటన


బొగ్గు రవాణా కొరకు టెండర్ల ప్రకటన


కొమురం బీమ్ రెబ్బెన (వుదయం) డిసెంబర్ 16  రెబ్బెన లోని గొల్లేటి బెల్లంపల్లి ఏరియా  ఖైర్గూడా ఓపెన్ కాస్ట్ నుండి రెబ్బెన  సైడింగ్ వరకు రెండు నెలల వరకు మరియు రామకృష్ణపూర్ సి హెచ్ పి వరకు 4 నెలల పాటు  బొగ్గు రవాణా చేయుటకు టెండర్లు ప్రకటించడం జరిగిందని డి జి ఎం  పర్సనల్  చిత్తరంజన్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెండర్ ఫారంలు గొల్లేటి జి ఎం  కార్ర్యలయంలో పర్చేజ్ డిపార్ట్మెంట్ నందు లభిస్తాయని పూర్తి వివరాలు జతచేసిన  పారములను ఈ నెల 21తేదీన మధ్యాహ్నం 12 గంటల లోపు జి ఎం  కార్ర్యలయం నందున అందచేయాలన్నారు. అందచేసిన పారములను అదే రోజు సాయంత్రం తెరువబడును అని తెలిపారు. ఈ  టెండర్ల పూర్తి సమాచారం కోసం పర్చేజ్ డిపార్ట్మెంట్ కార్యాలయం నందు సంప్రదించాలని కోరారు.  

Thursday, 15 December 2016

అది వాసికొలవార్ జిల్లా కమిటీ ఎన్నికను విజయవంతం చెయ్యాలి

అది వాసికొలవార్  జిల్లా కమిటీ ఎన్నికను విజయవంతం చెయ్యాలి
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) ఆదివాసీ మన్నెవార్ కొలావర్ సేవ సంగం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోమురం భీం జిల్లా నూతన కమిటీ  18 తేదీన  ఆదివారం రోజున  ఆసిఫాబాద్ లోని కేస్లాపూర్ హనుమాన్ మందిర్ పునరావాస కాలనీ యందు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆదివాసీల రాష్ట్ర నాయకులూ బర్స పోచయ్య, గుర్రాల రవీందర్,రెబ్బన మండల అధ్యక్షుడు మైలారపు శ్రీనివాస్ లు తెలిపారు. వారు మాట్లాడుతూ  కొమురం భీం జిల్లా ఆదివాసీ రిజర్వేషన్ పోరాట సమితి ఏ ఆర్ పి ఎస్ తుడుం దెబ నూతన కమిటీలను ఎన్నుకోబడును అంతే కాకుండా ఆదివాసీ మన్నెవార్ల అమ్మ గౌరవ దినోత్సవం జనవరి 08 వ  తేదీన 14వ జండా పండుగ గురించి సుదీర్ఘమైన చర్చించబదును మరియూ గిరిజన తేగల వర్గీకరణ గురించి ఏ బి సి డి లు గ వర్గీకరించుటకై అది వాసి తేగల కులసంఘాల నాయకులూ విద్యార్ధి ఉద్యోగ సంఘ  నాయకులూ తమ జాతి ప్రయోజనాల కోసమై చర్చించా బడే సమావేశానికి అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి బుర్సా పోషమల్లు మండల ఉపాధ్యక్షుడు కోడిపె వంకటేష్ , రవి గణపతి తదితరులు ఉన్నారు.

ఉపాధి పనులపై ప్రజా సమీక్షా సమావేశం

ఉపాధి పనులపై ప్రజా సమీక్షా సమావేశం
 
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల కేద్రం లో గురువారం ఎంపిడిఓ కార్యాలయం లో డి ఆర్ డి ఓ పిడి శంకర్ సమక్షం లో మండల ఉపాధి హామీ పనులు ప్రజా వేదిక సమావేశాన్నీ నిరవహించారు ఈ సమావేశంలో పలుగురు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లు ,ఉపాధి కూలీలు మాట్లాడి సమస్యలను మరియు పనివివరాలను వెల్లడించారు . ఈ సమస్యల వివరాలలో పలుగురు బిపిఎమ్ లు ఉపాధి కూలి వేతనాలు చెల్లింపులలో అవకతోకలు చేసి అక్రమాలకు పలుపడుతున్నలట్లు కూలీలు పేర్కొన్నారు. పిడి శంకర మాట్లాడుతూ అక్రమాలకు పాలు పడ్డ బిపిఎం లపై  తగిన విచారన జరిపించి ఫై అధికారులకు జాబితాలను పంపించి చర్యలు తీసుకుంటాం అన్నారు అలానే ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మరియు మేట్లు  పనిచేస్తున్న కూలీలా జాబితా లను నమోదు చేయక వారి వేతనాలను అందించక పోవడం  ఫీల్డ్ అసిస్టెంట్ మరియు మేట్లు  , టెక్నీషన్ లు ఎలాంటి తప్పి ధాలను జరగకుండా  చూడాలని సూచించారు . ఈ కార్యక్రమంలో  ఎం పి పి కర్నాథం సంజీవ్ కుమార్ జ డ్ పి టి సి  బాబురావు తహసిల్దార్ రమేష్ గౌడ్, ఎండిఓ సత్యనారాయణ్ సింగ్,  ఎ పి ఎమ్ రాజ్ కుమార్ వెంకటరమణ, ఎ పి ఓ కల్పనా, మండల సర్పంచులు , ఎంపిటిసిలు మరియు ఉపాధీ హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.

పేద విద్యార్థులకు ఆట దుస్తులు పంపిణి

పేద  విద్యార్థులకు ఆట దుస్తులు పంపిణి 

కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) గ్రీన్ హెల్త్ ఫౌండేషన్ వ్యవస్థపకుడు వస్త్ర్హం నాయక్ గురువారం రెబ్బెన మండలం లోని పులికుంట కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు  ఆట దుస్తులను పందిపిని చేసారు. ఈ కార్యక్రమం లో రెబ్బెన తాసిల్దర్ రామేశ్ గౌడ్, మండల విద్యాధికారి వెంకటేషేరా స్వామి పాల్గొని మాట్లాడారు విద్యార్థులకు బాగా చదువుకొని ఉన్నతశ్రేణిలకు చేరాలంటే ,పేద విద్యార్థులకు ఆర్ధికంగా చేయతనిచ్చే లక్ష్యం తో ఈ విద్యార్థులకు సహాయం చేయడం గొప్పతనం అని అన్నారు ఇలానే సహాయక కార్యక్రమాలు ఇంకా చేయాలనీ మా తరుపునుంచికూడా విద్యార్థులకు సహాయం అందిస్తాం అని తాసీల్దార్ అన్నారు . ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు టి శ్రీనివాస్ ,సి ఆర్ పి  దేవేందర్ ,సత్యనారాయణ్ ,పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని విజయవంతం చేయండి; జీఎం రవి శంకర్

సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని విజయవంతం చేయండి; జీఎం రవి శంకర్ 

కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) సింగరేణి ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా ఈ నెల 23వ తేదీన రెబ్బన మండలం లోని గోలేటి శ్రీ భీమన్న క్రీడా ప్రాంగణం లో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతాయని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కే రవి శంకర్ తెలిపారు ఉదయం పతాకావిష్కరణ కార్యక్రమం  ఉంటుందని అన్నారు. సాయంత్రం 6 గంటలనుండి 10గంటలు వరకు హైద్రాబాద్ సినీ కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి అన్నారు ఈ నెల 20 తేదీన  గోలేటి టౌన్ షిప్ న సింగరేణి పాఠశాల గ్రౌండ్లో సాయంత్రం 5 గంటల నుండి మాదారం టౌన్ షిప్ లో మినీ గ్రౌండ్  ముందు సాయంత్రం 5 గంటల నుండి అలాగే పర్యావరణ పరిరక్షణ లో భాగంగా మాదారం టౌన్ షిప్ మరియూ గోలేటి టౌన్ షిప్ లో ని క్వాటర్స్ లో ఉండేవారు తమ ఇంటి పచ్చదనం పరిశుభ్రత తో పాటించిన వారి యొక్క ఉత్తమ గృహమును ఎన్నుకోవడం జరుగుతుంది కావున పచ్చదనా పరిశుభ్రత పాటిస్తూ తమ ఇంటిని అందంగా ఆలన్కరించిన కార్మికుల పేరులను నమోదు చేసుకోవలసినదిగా పేర్కొన్నారు  సింగరేణి ఆవిర్భావ దినోత్సవ  సంబరాలలో ఏరియా పరిసర వాసులు అధిక సంఖ్యలో   పాల్గొని విజయవంతం చేయలని కోరారు.

Wednesday, 14 December 2016

సుదీర్ కమిషన్ సిఫార్సుల పట్ల మైనార్టీల హర్షం

సుదీర్ కమిషన్ సిఫార్సుల పట్ల మైనార్టీల హర్షం 

కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) తెలంగాణ సామాజిక విద్యాపరంగా వెనుక బడిన ముస్లింలకు  12 %  రిజర్వేషన్లు కల్పించాలని సుదీర్ కమిషన్ తెలంగాణ ప్రభుత్వం నికి సిఫారసు చేయడం హర్ష నియమానికి మండల మైనారిటీ టీ ఆర్ అస్ కో ఆపాశం సభ్యులు ఎం ఏ జాకిర్ ఉస్మాని అన్నారు బుధవారం రెబ్బన లో ఏర్పాటు చేసిన సమావేశం లో రాష్ట్ర ముఖ్యమంత్రి మైనార్టీలకు ఇచ్చిన వాకదా నాలను 12 %   రిజర్వేషన్స్ వాగ్దనం త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కె చెంద్రశేఖర్ రావ్ మైనార్టీలకు  చేస్తారు ఈ మేరకు బి సి కమిషన్ శనివారం నోటిఫికేషన్ విదుదలచాసింది అన్నారు బుధవారం నుండి శుక్రవారం వరకు రోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బి సి కమిషన్ నూతన కార్యాలయం సమావేశ మందిరంలో విచారణ నిర్వహిస్తున్నారు ఆసక్తి గల ప్రజలు సంస్థలు కులసంఘాలు తమ అభిప్రాయాలను మౌలికంగా లేదా లిఖిత పూర్వకంగా వివరించ వచ్చు మైనార్టీల సంక్షమనికి ముఖ్యమంత్రి కే సి ఆర్ సౌరథ్యంలో తే తెరాస ప్రభుత్వం చేస్తున్న కృషికి మైనార్టీలు ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమంలో  సయ్యాద్ ఎక్బల్ ,  అహ్మద్,  ఎస్ డి అఫ్రోజ్  ,అలీ , మన్సూర్, అన్సారీ, జుబెరొద్దీన్ ,శధర్, అలీ తదితరులు పాల్గొన్నారు.

కళాశాల సమస్యలు పరిష్కరించక పోతే ఆమరణ నిరాహార దీక్ష


కళాశాల సమస్యలు పరిష్కరించక పోతే ఆమరణ నిరాహార దీక్ష
ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రాధాన కార్యదర్శ  దుర్గం రవీందర్

కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) కళాశాల తరగతులు ప్రారంభించి సమస్యలు పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడుతామని  ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రాధాన కార్యదర్శ  దుర్గం రవీందర్ అన్నారు బుధవారం గౌట్ జూనియర్ కాలేజ్ ఎదురుగా సుమారు నాలుగు గంటలపాటు ధర్నా నిర్వహిచారు ఎఫ్ జిల్లా ప్రాధాన కార్యదర్శ  దుర్గం రవీందర్ మాట్లాడుతూ  తెలంగాణా రాష్ట్రం సాధించుకొని రెండున్నర సంవత్సరములు కావస్తున్నా, విద్య సంవత్సరం మొదలై ఆరు నెలలు గడుస్తున్నా విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం అవట్లేదు అన్నారు. రెబ్బెన మండలం లోని ప్రభుత్వ కళాశాల  ప్రారంభమై  పదిహేను సంవత్సరాలు కావస్తున్నా విద్యార్థులు కష్టాలు తీరడం లేదని, రెబ్బెన మండలం లోని ఇందిరానగర్  ప్రధాన రహదారి పక్కన నూతన కళాశాల శంకుస్థాపన చేసి కళాశాలలో మౌలిక సదుపాయాలు  విద్యుత్ నీరు కలిపించి నూతన  కళాశాలలో తరగతులు ప్రారంభించాలని అన్నారు లేనిచో ఏ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో అమర నిరాహార ద్దీక్షలు చేపడతామని అన్నారు. ఈ ధర్నాకు స్పందించిన స్థానిక తహస్జిల్ధార్ రమేష్ గౌడ్ . జడ్ పి టీ సి బాబూరావ్ లు కళాశాల వద్దకు చేరుకొని చరవాణిలో ఎం ఏల్ సి పురాణం సతీష్  తో  అధికారులతో మాట్లాడి తొందరలోనే సమస్యలు పరిష్కరించి విద్యార్థులు సమస్యలు పరిష్కరించి నూతన భవనాలకు తరలిస్తామని హామీ ఇవ్వడం తో ధర్నాని విరమించారు. ఈ ధర్నాలో జిల్లా కార్యవర్గ సభ్యులు కస్తూరి రవి డివిజన్ కార్యదర్శి పుదరి సాయి నాయకులు పర్వతి సాయి సందీప్ శేషి తదితరులు పాల్గొన్నారు. 

నూతన కళాశాల వినియోగానికి నోచుకోని విద్యార్ధులు

నూతన కళాశాల వినియోగానికి నోచుకోని విద్యార్ధులు 

కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) నూతన కళాశాల శంకుస్థాపన చేసి కళాశాల పూర్తిగావించి  వినియోగానికి నోచుకోకుండా నిరుపయోగంగా ఉందని  తెలంగాణా విద్యావంతులవేదిక కొమరంభీం జిల్లా ఉపాధ్యక్షులు మిట్ట దేవేందర్ బుధవారం రోజున ఒక పత్రిక ప్రకటనలో  తెలిపారు. తెలంగాణా రాష్ట్రం సాధించుకొని రెండున్నర సంవత్సరములు కావస్తున్నా విద్యను మరుగునపడేస్తున్నారు . రెబ్బెన మండలం లోని ప్రభుత్వ కళాశాల  ప్రారంభమై  పదిహేను సంవత్సరాలు కావస్తున్నా విద్యార్థులు కష్టాలు తీరడం లేదని, రెబ్బెన మండలం లోని ఇందిరానగర్  ప్రధాన రహదారి పక్కన నూతన కళాశాలను  నిర్మించినప్పటికీ విద్యుత్ సౌకర్యం లేని కారణం గా  నిరుపయోగంగా ఉందని అన్నారు. కళాశాల, ఉన్నత పాఠశాల  రెండు ఒకే ప్రాంగణంలో కొనసాగుతుండడంతో  విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు అని వారు అన్నారు. ఇప్పటికైనా విద్యా అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని  కళాశాలలో వసతులు కల్పించి తరగతులు  ప్రారంభించేల చర్యలు చేపట్టాలాలని ను కోరారు.