వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 31; నిరక్షరాస్యులైన వయోజనులు అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని ఎపిఓ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.సోమవారంనాడు రెబ్బెన మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విసిఓ ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.సాక్షర భారత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వయోజన విద్యా కేంద్రాలను సమయ పాలనా పాటిస్తూ తెరవాలని సూచించారు.ఒక్కో విసిఓ పది మంది సభ్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని,వారిని ఆగస్టు 20వ తేదీన నిర్వహించే ఎన్ఐఓఎస్ పరీక్షకు సిద్ధం చెయ్యాలని విసిఓలకు తెలిపారు.ఈ కార్యక్రమంలో సాక్షర భారత్ కో ఆర్డినేటర్ గాంధర్ల సాయిబాబా,మండలంలోని విసిఓలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment