Tuesday, 18 July 2017

కార్మికుల సంక్షేమమే సింగరేణి సంస్థ లక్ష్యం


కార్మికుల సంక్షేమమే సింగరేణి సంస్థ లక్ష్యం 


ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 18;   సింగరేణి ఉత్పత్తితోపాటు కార్మికుల సంక్షేమం కూడా ముఖ్యమని డైరెక్టర్ భాస్కర్ రావు అన్నారు. మంగళవారం బెల్లంపల్లి ఏరియా లోని గోలేటిలో 80 లక్షలతో నూతనంగా  నిర్మించిన స్విమ్మింగ్ పూల్  ప్రారంభించి  మాట్లాడారు. కార్మికుల మానసిక శారీరక వికాసానికి దోహదపడే కార్యక్రమాలలో భాగంగా ఈ స్విమ్మింగ్ పూల్  నిర్మించడం జరిగిందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని కార్మికులకు సూచించారు. ఆసుపత్రి అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నదని కూడా తెలిపారు విద్యాభిరుద్ది,రవాణా సదుపాయంకోసం రోడ్డు డివైడెర్ఫ్ ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు  ఏ కార్యక్రమంలో జి ఎం రవిశంకర్, డ్ జి ఎం పర్సనల్ చిత్తరంజన్ ,డ్ వై పి  ఎం రామశాస్ట్రీ,సుదర్శన్ సివిల్ డ్ జి ఎం ప్రసాదరావు ,కార్మిక నాయకులూ ఎస్ తిరుపతి,సదాశివ్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment