Tuesday, 4 July 2017

ప్రజా విశ్వాసమే పోలీసు వ్యవస్థకు నూతన ఉత్తేజం – జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

ప్రజా విశ్వాసమే పోలీసు వ్యవస్థకు  నూతన  ఉత్తేజం – జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూలై  04 (వుదయం ప్రతినిధి) ; జిల్లా కేంద్రము లోని పోలీసు కార్యాలయంలో జిల్లాఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐ పిఎస్  గారు ప్రజాఫిర్యాదుల విభాగం ను నిర్వహించి  ,ప్రజాఫిర్యాదు  కు వచ్చిన ఫిర్యాదు దారులనుంచిఫిర్యాదులను నేరుగా స్వీకరించారు. ప్రజా ఫిర్యాదు కు జిల్లా నుంచి మొత్తం 14 మంది వచ్చారు ఇందులో  ప్రజా ఫిర్యాదు కు వచ్చిన పెందూరు యెశ్వంత్ రావు సిర్పూర్ (U) మండలము నేటి గూడ గ్రామము లొ గ్రామా పటేలులు అందరు కలిసి తన కుటుంబం ను గ్రామా బహిష్కరణ చేసారని ,గ్రామము లోని మంచి నీటి ను కూడా వాడుకోకుండా అడ్డుకుంటున్నారని  ఎస్పి ఎదుట విలపించగా స్పందించిన జిల్లా ఎస్పి తక్షణము అధికారులను ను ఆదేశించి కుల ,బహిష్కరణ నెపంతో వారి యొక్క హక్కులను హరించే వారి పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపర మైన చర్యలను తీసుకోవాలని ఆదేశించారు, గోలేటి గ్రామము నకు జిల్లెల  రాజు  s/o నాగులు ను ఉద్యోగము ఇప్పిస్తాము అని మోసం చేసి డబ్బులను కాజేశారు అని న్యాయం జరిపించాలని జిల్లా ఎస్పి ను ప్రజా ఫిర్యాదు లొ వేడుకున్నారు ,స్పందించిన జిల్లా ఎస్పి విచారణ జరిపి తక్షణము న్యాయం జరిగేలా చూస్తాము అని హామీ ఇచ్చారు. ఈ సందర్బముగా జిల్లా ఎస్పి మాట్లాడుతూ జిల్లా లో వ్యవసాయ ఆదారిత కుటుంబాలు ఎక్కువగా వున్నాయని వ్యవసాయము పైన ఆదారపడిన కుటుంబాలు తమ తో పాటు వ్యవసాయ పనులకు పిల్లలను తీసుకువెళ్ళి పనులు  చేయించ   కుండా , వారి భవిష్యతు గురించి తెలిపి  విధి గా వారిని బడులకు పంపేలా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించి ,తగు చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు, జిల్లా లొ నిరుపయోగముగా వున్నా బోర్ బావులను మూసి వేసేలా చర్యలను తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎస్బి సీ ఐ వెంకటేశ్వరులు,ఆసిఫాబాద్ టౌన్  సీఐ సతీశ్ ,ఎస్పి సీసీ శ్రీనివాస్ ,ఎస్బి ఎసై లు శివకుమార్ ,శ్యామ్ సుందర్ ,డిసీబీఎసై రాణాప్రతాప్  అడ్మినిస్ట్రేషన్ఆఫీసర్  ప్రహ్లాద్,సీనియర్ అసిస్టెంట్ ఇంతియాజ్ ,ఐటి  కోర్  శ్రీనివాస్,పిఆర్.ఓ మనోహర్ లు మరియు ఫిర్యాదుల విభాగంఅధికారిని సునీత గార్లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment