Wednesday, 19 July 2017

తలసిమియా – సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు సమిష్టి సహకారo అందించటం ఎంతో అవసరం – ఎస్పి సన్ ప్రీత్ సింగ

తలసిమియా – సికిల్ సెల్  వ్యాధిగ్రస్తులకు  సమిష్టి  సహకారo అందించటం ఎంతో అవసరం – ఎస్పి సన్ ప్రీత్ సింగ

  ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 19; తలసిమియా వ్యాధి గ్రస్తులను మానవత దృక్పథం, సమిష్టి సహకారం తోనే ఆదుకోగాలమని కుమ్రంభీమ్ జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు.జన్యుపరంగా ,వారసత్వ పరంగా హిమోగ్లోబిన్ లోపాలు వంటి బహుముఖ వైద్య సమస్యలను వీరు కలిగి ఉంటారని , తలసిమియా వ్యాధి గ్రస్తుల సంరక్షణ మెరుగు పరుచుటకు  ప్రారంభయత్నాలు ఇంకా అబివృద్ది దశలోనే వున్నాయని , అవి పూర్తి స్థాయి లొ అందుబాటులో లేనందున వారి అవసర నిమిత్తం ప్రాణాపాయ స్థితి లో వుండే పిల్లలను ఆదుకునేందుకు మానవీయ కోణం లొ మనం అందరం రక్తదాన శిబిరాలలో రక్తదానo చేయలిసిన అవసరం ఎంతైనా వున్నదని తెలిపారు. ఎక్కువగా తలసిమియా బాధితులు  మంచిర్యాల్ , కుమ్రంభీం జిల్లా లో చిన్న వయస్సు అయిన 1 సం. నుంచి 35 సo. ల వారు ఎక్కువగా వున్నారని వారిని ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించుటకు రక్త మార్పిడి తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు అని  రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు , అభినవ యూత్ సభ్యులు తెలిపారు, ఈ సందర్బముగా జిల్లా లో తలసిమియా వ్యాధి గ్రస్తుల కోసం రక్తదాన శిబిరాలను నెలకొల్పాలని జిల్లా ఎస్పి గార్కి వినతి పత్రంను అందచేశారు. ఈ కార్యక్రమం లో ఎస్బి సీ ఐ వెంకటేశ్వరులు ,ఆసిఫాబాద్ టౌన్  సీఐ సతీశ్ ,ఎస్పి సీసీ శ్రీనివాస్ , ఎస్బి ఎసై లు శివకుమార్ ,శ్యామ్ సుందర్ , సీనియర్ అసిస్టెంట్ ఇంతియాజ్ , రెడ్ క్రాస్ సొసైటీ కో-ఆర్డినేటర్ సంతోష్ , తలసిమియా –సికిల్ సెల్ కో- ఆర్డినేటర్ కాసర్ల శ్రీనివాస్ మరియుపిఆర్.ఓ మనోహర్ లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment