Friday, 7 July 2017

రైతులు పంటలపై బీమా తప్పనిసరి చేయిచాలి

రైతులు పంటలపై బీమా తప్పనిసరి చేయిచాలి 


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూలై 07 (వుదయం ప్రతినిధి) ;    రైతులకు పంటలపై బీమా తప్పనిసరి చేయించాలని డివిజన్ వ్యవసాయ  అధికారి శ్రీనివాస్ రావు తెలిపారు శుక్రవారం రెబ్బన మండలం లోని గంగాపూర్ లో పంటల బీమా వలన ప్రయోజనాల గురుంచి అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రధాన మంత్రి ప్రవేశ పెట్టిన ఫసల్ భీమా పథకాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు. ఖరీఫ్  సీజన్ లో సాగు చేస్తున్నటువంటీ వరి, జొన్న మక్కజొన్న, కంది, పెసర, పత్తి, సోయాబీన్ పంటలకు ఫసల్  భీమా పథకంలో ఈ నెల 31వరకు పంట భీమా చేసుకోవచ్చని తెలిపారు ఏలంటి ప్రకృతి వైపరీత్యాల వాళ్ళ సరైన దిగుబడి రాణి యడల ఈ పథకం లో భీమి చేసిన వారికీ ప్రభుత్వం తరఫు నుంచి కొంత మోతాదుకిలో ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ రవీందర్ . ఉపసర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ . మండల వ్యవసాయ అధికారి  మంజుల,  ఏఈఓ మార్క్ బిటిఎం గురుమూర్తి ,  తదితరులు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment