విద్యా సంస్థల బంద్ విజయవంతం
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 21; అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్)మరియు వామపక్ష విద్యార్ధి సంఘాలు శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన ప్రభుత్వ,ప్రైవేట్ విద్య సంస్థల బంద్ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వివిధ మండలాలతోపాటు రెబ్బన మండలంలో కూడా విజయవంతం అయిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి దుర్గం రవీందర్,నియోజకవర్గ కార్యదర్శి పూదరి సాయికిరణ్ తెలిపారు.కొన్ని పాఠశాలలు స్వచ్చందంగా బంద్ పాటించగా కొన్ని పాఠశాలలకు ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి పర్వతి సాయికుమార్,మండల నాయకులూ జాడి సాయి,నాయకులూ వెళ్లి విద్యార్థులను బయటికి పంపించి బంద్ చేశారు.కాగా మండలంలోని నడుస్తున్న కొన్ని పాఠశాలలకు వెళ్లి పాఠశాలల బంద్ నిర్వహించారు.ఈ సందర్బంగా దుర్గం రవీందర్,పూదరి సాయికిరణ్ లు మాట్లాడుతు ప్రభుత్వ విద్య సంస్థల్లో నెలకొన్న సమస్యలు పరిష్కకరించాలని,వసతి గృహాల్లో మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రభుత్వాలు వాటి ఊసే ఎత్తడం లేదని అన్నారు.ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని ఈ విద్యా సంవత్సరం నుండే అమలు చేయాలనీ డిమాండ్ చేశారు.నూతనంగా ఏర్పడిన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు,ఐటిఐ,పాలిటెక్నిక్ కళాశాలలను ఏర్పాటు చేసి పేద,గిరిజన విద్యార్థులకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మహిపాల్,రవి,సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment