Friday, 7 July 2017

రహదారి  సమస్యను పరిష్కరించాలని వినతి 

రహదారి  సమస్యను పరిష్కరించాలని వినతి 


  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూలై 07 (వుదయం ప్రతినిధి) ;   రెబ్బెన మండలంలోని కొండపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రాంపూర్,నవేగం గ్రామాలకు వెళ్లే రహదారిని కొంతమంది కబ్జా చేసి,ఆ భూమిని కోల్డ్ స్టోరేజ్ భవనం  నిర్మించారని దాని వల్ల గ్రామంలోకి వెళ్లాలంటే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంతున్నామని రాంపూర్,నవేగం,కొండపల్లి గ్రామాల ప్రజలు శుక్రవారం రెబ్బెన తహశీల్ధార్ కార్యాలయంలోని రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ చౌహన్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా గ్రామస్థులు మాట్లాడుతు గత కొన్నేళ్ల నుండి మూడు గ్రామాల ప్రజలం కోల్డ్ స్టోరేజ్ భవనం నిర్మించిన స్థలంలో పశువులు పోవుటకు సదరు ఉండేదని,అట్టి సదరు భూమిని కొందరు  అన్యాయంగా ఆక్రమించడంతో  పశువులను మేపుటకు తీవ్ర ఇబ్బంధులు పడుతున్నామని ,అక్కడ జరిగిన ఆక్రమణ,కబ్జాను గుర్తించి,వారి పై చట్టరీత్య చర్యలు తీసుకొని,తమకు న్యాయం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు తులసీరామ్,వడై అరుణ్ కుమార్,పోశెట్టి,బిక్కు,వెంకటి,రామయ్య,గురువయ్య,రాజుబాబు,గ్రామస్థులు,రైతులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment