Monday, 31 July 2017

ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి

ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి

   ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 31;ఎస్సి వర్గీకరణ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాలలో బిల్లు ప్రవేశపెట్టాలని సోమవారం రోజున రెబ్బెన మండల తహశీల్దార్ బండారి రమేష్ గౌడ్ కు  వినతి పత్రం సమర్పించారుఈ  సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జి గద్దల బానయ్య మాట్లాడుతూ ఎస్సిలలోని 59 ఉపకులాలకు సమన న్యాయం జరగాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో గత 23 సం/వత్సరాలనుండి జరుగుతున్న పోరాటాలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయని అన్నారు.అందుకు నిరసనగా నేటినుండి ఆగష్టు 07 వరకు రిలే దీక్షలు  కొనసాగుతాయన్నారు.ఈ కార్యక్రమం ప్రధాన డిమాండ్స్   ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే బిల్లు ప్రెవేశపెట్టాలి.తెలంగాణ ప్రభుత్వం అఖిల పక్షాన్ని ఢిల్లీ కి పంపి పార్లమెంట్ లో  చట్టబద్దత కల్పించాలి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎస్సీల వర్గీకరణ పై అసెంబ్లీ లో ఏకగ్రీవ తీర్మానం చేసి అఖిల పక్షాన్ని ఢిల్లీ కి పంపాలి.బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజులలో ఎస్ సి  ల ఏ  బి సీ  డి  వర్గీకరణ చేస్తామన్న మాట నిలబెట్టుకోవాలి.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు లింగంపల్లి ప్రభాకర్,మండల ఇంచార్జి  అరికిళ్ల మొగిలి  నాయకులూ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment