సమిష్టి కృషితో లక్ష్యానికి మించిన ఉత్పత్తి ; జి ఎం రవిశంకర్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూలై 01 (వుదయం ప్రతినిధి); కార్మికులు,అధికారుల సమిష్టి కృషితోనే సింగరేణి సంస్థలో లక్ష్యానికి మించి ఉత్పత్తి సాధించగలిగామని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కే రవిశంకర్ తెలిపారు. శనివారం రెబ్బెన మండలం లోని గోలేటి జి ఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జూన్ మాసంలో నిర్దేశిత లక్ష్యమైన 490000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తికిగాను 620480 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధించి 127 శాతం తో సింగరేణి మొదటిస్థానం లో నిలవడం జరిగిందన్నారు. గతసంవత్సరం తో పోలిస్తే 24 శాతం అధికంగా ఉత్పత్తి సాధించామని తెలిపారు. రవాణా విషయం లో కూడా 600000 టన్నులు అదనంగా రవాణా చేయడం జరిగిందన్నారు జూన్ నెలలో వర్షం, సమ్మె ఉన్నప్పటికీ కార్మిక సోదరులు విధులకు హాజరై 12 శాతం వృద్ధిని సాధించి ,127,107 రేకులు రవాణా ఉత్పత్తి కి సహకరించారన్నారు. ఈ సందర్భంగా కార్మికులకు,అధికారులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈనెల 15 న డైరెక్టర్ గారిచే స్విమ్మింగ్ పూల్ ను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఆలాగే ఆసుపత్రి ఆధునికీకరణ ,కమ్యూనిటీ హాల్ పనులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు సింగరేణి సేవాసమితి ఆధ్వర్యం లో నిరుద్యోగ యువతి యువకులకు వివిధ వృత్తివిద్యా కోర్సులలో శిక్షణ తరగతులు చేపడుతున్నట్లు తెలిపారు. హరిత హారం కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లి ఏరియాలో 650000 పూలు పండ్లమొక్కలు పంపిణీకి సిద్ధంగాఉంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జిఎం కొండయ్య ఏ ఈడ యోహాన్, డీజీఎంలు రామశాస్త్రి ,సుదర్శన్ , డీ వై పీఎం రాజేశ్వర్ , ఏరియా ఇంజనీర్ రామారావు , సింగరేణి సేవ కో ఆర్డినేటర్ కుమార స్వామి లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment