Tuesday, 18 July 2017

21న విద్యాసంస్థల బంద్ ; వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు

21న విద్యాసంస్థల బంద్ ; వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు



ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 18; విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన  విద్యాసంస్థల బంద్ కు విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం రోజున ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో గోడ ప్రతులను వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆవిష్కరించారు..అనంతరం ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్,ఎ.ఐ.ఎఫ్.డి.ఎస్ జిల్లా ఇంచార్జ్ కొండగోర్ల చంద్రశేఖర్,ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కార్తిక్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సంక్షేమ వసతి గృహ సమస్యలు పరిష్కరించాలని,కెజి టూ పిజి ఉచిత విద్యాను అందించాలని,కార్పొరేట్ ,ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని,ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యహ్న భోజనం అమలు చేయాలని తదితర విద్యారంగ సమస్యలపై నిర్వహించే బంద్ లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి ప్రణయ్ నాయకులు  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment