కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు చెక్కుల పంపిణి
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 15 ; తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల పెళ్లిళ్ల కోసం ప్రవేశ పెట్టిన కళ్యాణ లక్ష్మి పధకంలో భాగంగా అర్హులైన అభ్యర్థులకు శనివారం నాడు రెబ్బెన మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్సీ పురాణం సతీష్,స్థానిక శాసనసభ సభ్యురాలు కోవా లక్ష్మి పాల్గొని చెక్కులను పంపిణి చేసారు.ఈ సందర్బంగా అర్హులైన 27 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణి చేశారు.ఎంపీపీ కర్నాథం సంజీవ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండలి సభ్యులు పురాణం సతీష్,శాశన సభ్యురాలు లక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల పెళ్లిళ్ల ఆసార కోసం కళ్యాణ లక్ష్మి,షాదీ ముభారక్ వంటి కార్యక్రమాలను చేపట్టిందని అన్నారు.తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఊరూరా తిరిగి పేద ప్రజల బాధలను తెలుసుకొని,ఇప్పుడు అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ అమలు పరుస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు చేయలేని పనులను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేసి చూపుతుందని అన్నారు. గత ప్రభుత్వాలలో 200 రూపాయలు ఉన్నా పింఛన్లు ఇప్పుడు వితంతువులు,వృద్ధులకు 1000 మరియు వికలాంగులకు 1500 గ పెంచిన ఘనత కేసిఆర్ కె దక్కిందని అన్నారు. రాష్ట్రాన్ని 31 జిల్లాలుగా చేసి ఆసిఫాబాద్ అభివృద్ధి కోసం కొమురంభీమ్ జిల్లా గ ముఖ్యమంత్రి ప్రకటించాటం వాళ్ళ కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా అభివృద్ధి ప్రారంభం అయిందని అన్నారు. హరిత హరంలో అందరూ పాల్గొని విజయవంతం చేసి వాటిని సంరక్షించే బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలదే అని అన్నారు. మొక్కలను నాటి పెంచి,సంరక్షించే గ్రామాలను ఉత్తమ గ్రామాలుగా ప్రకటించి నగదు బహుమతులు 8,00,000 నుండి 10,00,000 అందిస్తామని అన్నారు.అదే విధంగా గోలేటిలోని కైరిగూడ వాగు వంతెన కోసం కోటి యాబై లక్షలు మొతంగా మూడు కోట్ల రూపాయలు ఎమ్మెల్సీ,ఎమ్మెల్యే నిధుల నుండి విడుదల చేసి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మండలంలోని గ్రామాల రోడ్ల అభివృద్ధి కోసం కోటి యాబై లక్షలు ఖర్చుతో అభివృద్ధి చేయటం జరిగినది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ ఛైర్మెన్ కానక యాదవరావు, జైనూర్ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ భగవంతరావు,రెబ్బెన జిల్లా ప్రాదేశిక సభ్యులు అజ్మీర బాబురావు,సర్పంచ్ పెసరు వెంకటమ్మ,తహసీల్దార్ బండారి రమేష్ గౌడ్,యంపిడిఓ సత్యనారాయణ,రెబెనా సిఐ మదన్లాల్,మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ కుందారపు శంకరమ్మ,తెరాస మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి,మండలంలోని సర్పంచులు రవీందర్,వెంకటేశ్వర్లు,లక్ష్మణ్, ఎంపిటిసి సభ్యులు కొవ్వూరి శ్రీనివాస్,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment