Thursday, 27 July 2017

హమాలీల శ్రమను దోచుకుంటున్న ప్రభుత్వం ; ఏఐటియూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్

హమాలీల శ్రమను దోచుకుంటున్న ప్రభుత్వం; ఏఐటియూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్ 


  ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 27;  తెలంగాణ రాష్టంలో సుమారుగా 4వేల  మంది హమాలీలు ప్రతి రోజు చాలీ చాలని వేతనాలు తీసుకుంటూ దుర్భరమైన జీవితం గడుపుతున్నారని అలాగే వారికీ కనీస వేతనం అమలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభత్వాలు శ్రమ దోపిడీకి గురు చేస్తున్నాయని ఏఐటియూసీ జిల్లా కార్యదర్శి  బోగే ఉపేందర్ అన్నారు. గురువారం రోజున ఏఐటియూసీ ఆధ్వర్యంలో చేపట్టిన హమాలీల సమ్మె 3వ రోజుకు చేరుకుంది వారి  సమస్యలను పరిష్కరించాలని కగజనగర్ రెవెన్యూ డివిజినల్ అధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహిచి అనంతరం ఇంచార్జి అధికారి లింగమూర్తికి   వినతి పత్రం అందచేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్రము లోని సుమారు  4 కోట్ల మంది ప్రజలకు నిత్యావసర వస్తువులను పేద బడుగు బలహీన ప్రజలకు అందించడంలో ప్రధాన పాత్ర హమాలీలు పోషిస్తున్నారని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ వ్యవస్థను రద్దు చేసే ఆలోచనను విరమిన్చుకోవాలని అలాగే హమాలీలని ప్రభుత్వ ఉద్యుగులుగా గుర్తిచాలని  కనీస వేత్తనం  30 వేలు ఇవ్వాలని, ఈ ఎస్ ఐ సౌకర్యం  బోనస్ పది వేలు చెల్లించాలని, 50 సంవత్సరాలు పై బడిన హమాలీలకు 3 వేల  పెన్షన్ ఇవ్వాలని ప్రతి హమాలీ కార్మికులకు డబుల్ బెడ్ రూమ్,3 ఎకరాల భూమి,ప్రతి సంవత్సరం రెండు జతల దుస్తులు ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం హమాలీల సమస్యలలు పరిష్కరించాలని లేని పక్షం లో ఏఐటియూసీ ఆధ్వర్యంలో హమాలీల సమ్మెను మరింత ఉదృతం చేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమాంలో హమాలీలు, రాజు, కిషన్,సుధాకర్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.  

No comments:

Post a Comment