వేకువ ఫౌండేషన్ ఆధ్వర్యం లోవిద్యా సామాగ్రి పంపిణి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూలై 05 (వుదయం ప్రతినిధి) ; రెబ్బెన మండలలోని వంకులం ప్రాథమిక పాఠశాలలో వేకువ ఫౌండేషన్ వారు విద్యార్థిని విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు . మరియు పలకల పంపిణి చేశారు. ఖతార్లో నివసిస్తున్న తెలంగాణ వాస్తవ్యుడు వెంకట్ రెడ్డి గారి సహాయ సహకారాలతో వారి ప్రతినిధి అవధూత శ్రీనివాస్ వంకులం ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థిని విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు . మరియు పలకల పంపిణి చెయ్యడం జరిగిందని తెలిపారు. ఈ సందర్బం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు డీ జ్యోతి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు వేకువ ఫౌండేషన్ వారు అందివస్తున్న సహకారం ప్రశంసనీయం ఆని అన్నారు.
No comments:
Post a Comment