Thursday, 20 July 2017

రైతు కష్టాలు పట్టించుకోని ప్రభుత్వాలు ; సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ మల్లేష్

రైతు కష్టాలు పట్టించుకోని ప్రభుత్వాలు ;
 సిపిఐ రాష్ట్ర  కార్యవర్గ సభ్యులు గుండ మల్లేష్ 

 ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 20 ; కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలను గాలికి వదిలి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని  సిపిఐ రాష్ట్ర   కార్యవర్గ సభ్యులు గుండ మల్లేష్ అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా రైతుల సమస్యలు  పరిష్కరించాలని అఖిల భారత రైతు సంఘం చేపట్టిన జీపు జాతా రెబ్బెన చేరుకున్న సందర్భంగా దానికి స్వాగతం సిపిఐ శ్రేణులు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా గుండ మల్లేష్ మాట్లాడుతు పంటలకు  గిట్టుబాటు ధరలను సకాలంలో ప్రకటించాలని డిమాండ్ చేశారు.దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని,ఎస్సీ,ఎస్టీలకు మూడు ఎకరాల భూపంపిణీ చెయ్యాలని,రెండు పడకల ఇండ్లని నిర్మిస్తామని ఇప్పటికి ఒక్క గది ఇండ్ల నిర్మాణం చేపట్టక పోగా  ముఖ్యమంత్రి వాటి సంగతే మరిచిపోయారని,కుటుంబ పాలనతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కేసీఆర్  మిషన్ కాకతీయ,మిషన్ భగీరధాలలో జరుగుతున్నా అవినీతి గురించి బహిరంగ చర్చకు రావాలని బహిరంగా సవాలు చేశారు.కేంద్రంలో మోడీ,రాష్ట్రంలో చంద్రశేఖర్రావుల పాలనా ఊరుకో కోడి,ఇంటికో ఈక అన్న చందంగా మారిందని అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి రైతులకు సకాలంలో పంట రుణాలు మంజూరు చెయ్యాలని,పహాణి నఖలు,బ్యాంకర్లు నుండి రైతులు ఎదుర్కుంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 26 న జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనీ రైతులకు,కార్యకర్తలకు,ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముడుపు ప్రభాకర్,ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్ ఏఐటీయూసీ మండల కార్యదర్శి రాయల్ల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment