రేషన్ డీలర్ ల సమ్మె ను విజయవంతం చెయ్యండి ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగె ఉపేందర్
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 24; తెలంగాణ రాష్ట్రంలో రేషన్ డీలర్ లు ఎదుర్కుంటున్న సమస్యలు పరిష్కరించి వారికి ప్రతి నెల గౌరవ వేతనం ఇరవై వెయ్యిలు ఇవ్వాలని ఏఐటీయూసి కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కార్యదర్శి బోగె ఉపేందర్ డిమాండ్ చేసారు.సోమవారం నాడు రెబ్బెన మండల కేంద్రంలోని రోడ్లు మరియు భవనాలు శాఖ అతిధి గృహంలో రేషన్ డీలర్ లు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన విలేఖరులను ఉద్దేశించి మాట్లాడారు.అదే విధంగా జూలై నెల 1వ తేది నుండి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్ లు సమ్మెకు సిద్ధం అవుతున్నారని,ఈ సమ్మెలో జిల్లాలోని రేషన్ డీలర్ లు అందరు పాల్గొని సమ్మెను విజయవంతం చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐటియూసీ మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్య,రేషన్ డీలర్ సంఘం మండల అధ్యక్షులు ఎస్.రామయ్య,రేషన్ డీలర్ లు గాజుల బాపు,శంకర్,మురళి, సంతోష్ ,శ్రీపతి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment