హరితహారం కార్యక్రమంలో జిల్లాపాలనాధికారి
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 20 ; మూడో విడత హరితహరం కార్యక్రమంలో భాగంగ గురువారం జిల్లా పాలనాధికారి చంపాలాల్ రెబ్బెన మండలంలోని గంగాపూర్ గ్రామంలోని కస్తూర్బా బాలికల వసతి గృహంలో జరిగిన హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ విద్యార్ధినులు కేజీబీవీలో నాటిన మొక్కలను సంరక్షించాలని,నాటిన మొక్కలకు నిరంతరం నీళ్లు పోస్తూ వాటిని కుటుంబంలోని సభ్యుల్లా కాపాడాలని అన్నారు.వసతి గృహంలోని విద్యార్థినులకు దుప్పట్లు పంపిణిచేసారు. శ్రద్దగా చదువుకొని ఉన్నతస్థితికి రావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తలపెట్టిన బృహత్తర కార్యక్రమం హరితహారంలో పాల్గొని ప్రతి ఒక్కరు తమ వంతు భాద్యతగా మొక్కలు నాటుతూ సమాజ శ్రేయస్సుకు పాటుపడాలన్నారు.ఇప్పుడు నాటిన మొక్కలను సంరక్షిస్తే అవి రేపటికి వృక్షాలు అవుతాయని,వాటితో ప్రాణవాయువు లభిస్తుందని అన్నారు.మొక్కలు మనిషి జననం నుండి మరణం వరకు ప్రత్యక్షంగానూ,పరోక్షంగానూ ఉపయోగపడుతున్నాయి అని అన్నారు.హరిత హారంలో నాటిన మొక్కలను సంరక్షిస్తే రేపటి వృక్షాలై మన తెలంగాణ హరిత తెలంగాణ గ మారుతుందని అన్నారు. శ్రద్దగా చదువుకొని ఉన్నతస్థితికి రావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జెడ్ పి ట్ సి బాబురావు,ఎం పి పి సంజీవ్ కుమార్,ఎం పి డ్ ఓ సత్యనారాయణసింగ్ గంగాపూర్ సర్పంచ్ ముంజం రవీందర్ తహసీల్దార్ రమేష్ గౌడ్ ,ఆసిఫాబాద్ మార్కెట్ కమిట వైస్ చైర్మన్ శంకరమ్మ తెరాస మండల అధ్యక్షుడు పోతూ శ్రీధర్ రెడ్డి మరియు మండలం లోని సర్పంచులు,ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment