Friday, 21 July 2017

పోలీసు మార్గదర్శకుడిలా వ్యవహరిస్తేనే లక్ష్యం ను చేరగలము – జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

     పోలీసు మార్గదర్శకుడిలా వ్యవహరిస్తేనే  లక్ష్యం ను చేరగలము – జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్


 ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 21;  జిల్లాపోలీసులు అన్ని కార్యక్రమలలో ముందువుండి మార్గదర్శకం చేస్తేనే మన నియమిత లక్ష్యం ను చేరగలము అని జిల్లా సన్ ప్రీత్ సింగ్ తెలిపారు శుక్రవారం జిల్లాలోని స్థానిక పోలీసు కాన్ఫరెన్స్  హాల్  లో నెల వారి నేర సమీక్షా సమావేశం ను జిల్లా లోని పోలీసు సిబ్బంది తో నిర్వహించారు. ఈ  నేర సమీక్షాసమావేశం లో జిల్లా శాంతి భద్రత లకు తిసుకోవలిసిన చర్యలను  జిల్లా ఎస్పి జిల్లా పోలీసులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం తీసుకొని నిర్వహిస్తున్న హరిత హారం కార్యక్రము లో పోలీసులు గురుతర బాద్యత ను పోషించాలి అని మొక్కలు నాటడం మాత్రమె కాకుండా వాటిని సంరక్షించే బాద్యత కూడా ముఖ్యం అని జిల్లా ఎస్పి తెలిపారు హరిత హారం లో విద్యార్థులను బాగాస్వాములను చేసి వారి అబిరుచి కు తగినట్లు  మొక్కలు స్వయముగా ఎంచుకొని వాటిని సరఫరా అయ్యేలా చూడాలని ,హరిత హారం పైన రోజు వారి  గా స్టేషన్ , సర్కిల్ , సబ్ డివిజన్  ల వారిగా సమీక్షా నిర్వహించాలి అని తెలిపారు , నేర సమీక్షాసమావేశం లో జిల్లా లో ఆహార కల్తి , హోటల్స్ లలో కల్తి చేసేవారిని గుట్కా, నిషేదిత పాన్ మసాలా లను విక్రయించేవారిని ఉక్కు పాదం తో అణచివేయాలని అధికారులను ఆదేశించారు, మరియు అనుమానం కలిగిన ఆహార పదార్థాలను శాంపిల్ సేకరించి ఫోరెన్సిక్ లాబ్ కు పంపాలని ఆదేశించారు, అంతేకాక జిల్లా లో నూతనముగా ఏర్పాటు చేసిన ఫింగర్ ప్రింట్ AFIS, క్లూస్ టీం లను వాడుకొని కేసు లను త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని తెలిపారు , జిల్లా లో  ఒంటరి మహిళ లను ,గ్రామీణ  ప్రాంత యువతులను మోసం చేసే వారి పట్ల  కటినం గా వ్యవహరించాలని , వెనుకబడిన గిరిజన గ్రామాలలో విద్యపైన సంపూర్ణ అవగాహన లేక గ్రామాలు ,తండా లలో  విద్యార్థులు ,లాంగ్ అబ్సెంట్, డ్రాప్ పుట్ లు ఎక్కువగా అవుతున్నారని  అటువంటి విద్యార్థుల సమాచారం ను సేకరించి వారికీ, వారి తల్లిదండ్రులకు విద్య యొక్క ప్రాదాన్యం ను వివరిoచాలి  అని ,లేక వారు ఏది అయిన సమస్యను ఎదుర్కొన్నట్లఅయితే అది తన ద్రుష్టి కు తీసుకురావాలని తెలిపారు. జిల్లా లోని రాష్ట్ర సరిహద్దుల  వెంబడి  వున్న గ్రామ యువత పైన ప్రత్యెక ద్రుష్టి  వుంచి వారి సంక్షేమమునకు గ్రామ సభలను నిర్వహించి పోలీసులు మీకోసం అనే భావన వారిలో  వచ్చేలా చైతన్యం తీసుకురావాలని తెలిపారు , జిల్లా లోని మారుమూల ప్రాంతాల లో కులం పెరు తో గ్రామ బహిష్కరణలు విదించే వారిపట్ల కటినం గా వ్యవహరించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు.  ఈ కార్యక్రమం లో కాగజ్ నగర్ డిఎస్పి హబీబ్ ఖాన్ ,ఎస్బి సీ ఐ వెంకటేశ్వరులు , ఆసిఫాబాద్ టౌన్  సీఐ సతీశ్ , జిల్లా సి ఐ లు , ఎసై లు, , డిసిఆర్బి ఎసై రాణాప్రతాప్ ,ఎస్పి సీసీ శ్రీనివాస్ , ఎస్బి ఎసై లు శివకుమార్ ,శ్యామ్ సుందర్ , సీనియర్ అసిస్టెంట్ ఇంతియాజ్ , పోలీసు కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ సూర్యకాంత్,  MD.ఇంతియాజ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రహ్లాద్, పాస్ పోర్ట్ అధికారి మురళి, క్యాంప్ కార్యాలయ సిబ్బంది కిరణ్, మరియు వామన్ లు మరియు పిఆర్.ఓ మనోహర్ లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment