హామీలకే పరిమితమైన తెరాస ప్రభుత్వం ; బిజె పి జిల్లా కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 25; తెలంగాణ పాలనలో ప్రభుత్వ హామీలు హామీలకే పరిమితం అయ్యాయని బిజెపి జిల్లా కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్ అన్నారు మంగళవారం రెబ్బెన మండలంలోని గోలేటిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడురు. తెరాస ప్రభుత్వ మూడు సంవత్సరాల పాలనలో అభివృద్ధి కుంటుపడిందని,అవినీతి పెరిగిందని అందుకు మిషన్ కాకతీయ,మిషన్ భగీరథ వంటివి ఉదాహరణ అని ,అన్నారు. దళిత ముఖ్య మంత్రి హామీ ,దళితులకు 3 ఎకరాల భూమి,హామీలను మరిచి కుటుంబపాలన సాగిస్తున్నారని విమర్శించారు. జిల్లా కార్యవర్గ సమావేశం ఈ నెలలో 28వ తేదీన కాగజ్ నగర్ జరుగుతుందని కావున బీజేపీ కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన మండల ప్రెసిడెంట్ కుందారపు బాలకృష్ణ,ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శితో రస కొండా రాజు అమండాలా ప్రధాన కార్యదర్శి మల్రాజు రాంబాబు బి జె వై ఎం నాయకులూ జి శ్రావణ్ నానవేని సునీల్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment