బెల్లంపెల్లి ఏరియా లో కనీస వేతన ల సలహా బోర్డు చేర్మెన్ ఆవుల గోవర్ధన్ పర్యటన
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 21; రెబ్బన మండలం లోని గోలేటి బెల్లంపెల్లి ఏరియా లో శుక్రవారం జాతీయ కనీస వేతన ల సలహా బోర్డు చేర్మెన్ ఆవుల గోవర్ధన్ పర్యటించారు . ఈ పర్యటన లో భాగంగా సివిల్ డిపార్ట్మెంట్ యందు ఖైర్గుడా యందు మరియు బీపీ ఏ ఓసీ 2 లోని ఒప్పంద ఉద్యోగులను కలిసి వారి కష్టనష్టాలు తెలుసుకున్నారు ,అనంతరం జీఎం గారి కార్యాలయం లో బెల్లంపల్లి ఏరియా జీఎం కే రవిశంకర్ గారితో సమావేశం ఐ బెల్లంపెల్లి ఏరియా కాంట్రాక్టు కార్మికుల సౌకర్యాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేసారు అలాగే కొన్ని చిన్న చిన్న సమస్యలను జీఎం గారి దృష్టికి తీసుకొని వచ్చి వాటిని పరిష్కరించాల్సిందిగా కోరారు ఈ సమస్యల పట్ల జీఎం రవిశంకర్ గారు సమకూలంగా స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలిసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది తదనంతరం బీపీ ఏ ఏరియా విచ్చేసిన ఆవుల గోవర్ధన్ గారికి బీపీ ఏ జీఎం రవిశంకర్ వారిని పులా మల మరియు శాలువాతో సన్మానించారు. ఈ విషయం ఫై కాంట్రాక్టు కార్మికుల సంక్షేమాన్ని చూస్తున్న జీఎం రవిశంకర్ గారికి గోవర్ధన్ గారు అభినందిస్తూ వారిని శాలువాతో సన్మానించారు. బెల్లంపెల్లి ఏరియా లో కనీస వేతన ల సలహా బోర్డు చేర్మెన్ ఆవుల గోవర్ధన్ పర్యటన విచ్చేసిన వారికీ బీజేపీ జిల్లా అధ్యక్షులు జే పి పొడేల్ గౌరంగా ఆహ్వానించారు. కార్మికులు, నాయకులు పలు సమస్యలపై చర్చ సమావేశాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆవుల గోవర్ధన్ మాట్లాడుతు ఈ నెల 25న బొగ్గు గని కార్మిక మంత్రులతో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరిస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఓ మోహన్ రెడ్డి డిజిఎం పర్సునల్ జె చిత్తరంజన్ కుమార్, ఫైనాన్స్ మేనేజర్ శ్రీధర్, డి వై పి ఎం రామశాస్రి, కార్యదర్శి పులిరాజారెడ్డి,పి గట్టయ్య, సంజీవ్ యాదవ్, డి లక్ష్మి నారాయణ, కె శంకర్, తిఆరుపతి, ఉపేందర్, బ్రమ్మానందం, లోకేష్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment