Saturday, 29 July 2017

బంగారు తెలంగాణ సాధనలో విద్యార్థుల పాత్ర ఎంతో ఉంది ; ఎం ఎల్ ఏ కోవ లక్ష్మి

బంగారు తెలంగాణ సాధనలో విద్యార్థుల పాత్ర ఎంతో ఉంది ; ఎం ఎల్ ఏ కోవ లక్ష్మి 
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 29;  తెలంగాణ రాష్ట్ర అవతరణ  ఎంతో మంది త్యాగఫలమని అందులో విద్యార్థులు కీలక పాత్ర పోషించి, ఎందరో ప్రాణాలు త్యాగం చేశారని, నేటి విద్యార్థులు బంగారు  తెలంగాణకు సహకరించాలని ఎం ఎల్ ఏ కోవా లక్ష్మి అన్నారు. శనివారం తెరాస విద్యార్ధి సంగం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమమును ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశానికి  ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వాలు   చేయలేని పనులను సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది అన్నారు.ముఖ్యంగా  పేద విద్యార్థులకు ఉన్నత చదువుల ఆసరా కొరకు స్కాలర్షిప్ లు అందిస్తూ పైచదువులకై  ప్రోత్వహిస్తుంది అన్నారు. మన జిల్లా లో ప్రత్యక బాలబాలికల గురుకుల పాఠశాలను ఏర్పాటు అయ్యాయన్నారు. జిల్లా కేంద్రం ఆయన ఆసిఫాబాద్ లో మెరుగైన చదువు కోసం  డిగ్రీ కళాశాలను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రెబ్బెనలో నూతనగా ఏర్పాటు చేసిన కళాశాలకు కరెంట్, చుట్టూ ప్రరారీ గోడ,సిమెంట్ రోడ్, మౌలికా వసతుల కొరకు 6 లక్షల రూపాయలను కేటాయించి త్వరలోనే కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తాం అన్నారు. ఈ సందర్బంగా సభ్యత్వం నమోదు చేసుకున్నారు. విద్యార్థులు సంఘాలుగా ఏర్పడి ఎలాంటి సమస్యలు వచ్చిన తమ దృష్టికి తీసుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సంజీవ్ కుమార్,  జెడ్ పి  టీ  సీ  బాబు రావు ,ఆసిఫాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్  కుందారపు శంకరమ్మ ,రెబ్బెన సర్పంచ్  పెసర వెంకటమ్మ, ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్,  టీ ఆర్ ఎస్ వి కొమురం భీం జిల్లా కోఆర్డినేటర్ మస్కు రమేశ్ , నాయకులు  కోవా సాయి,  శ్రీనివాసరావు. సోమశేఖర్, భరద్వాజ్, చిరంజీవి, రంగు మహేష్ ,  రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment