Saturday, 15 July 2017

మొక్కలు నాటడంలో విద్యార్థులు ముందుండాలి ; ఆసిఫాబాద్ శాసనసభ సభ్యురాలు కోవా లక్ష్మి

మొక్కలు నాటడంలో విద్యార్థులు ముందుండాలి 
ఆసిఫాబాద్ శాసనసభ సభ్యురాలు కోవా లక్ష్మి 


ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 15; రెబ్బెన: జులై 15 తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో   మొక్కలను నాటడంలో విద్యార్థులు ముందుండాలని,అదే విధంగా నాటిన మొక్కలకు ప్రతి రోజు నీరు పోసి సంరక్షించడంలో కూడా శ్రద్ధ పెట్టాలని అప్పుడే   సమస్త మానవాళికి ప్రాణవాయువు లభిస్తుందని ఆసిఫాబాద్ శాసన  సభ్యురాలు కోవా లక్ష్మి అన్నారు.మూడో విడత హరితహరం కార్యక్రమంలో భాగంగ శనివారం రోజున రెబ్బెన మండల కేంద్రంలో  విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని సబ్  స్టేషన్ వెళ్లే రోడ్డుకు ఇరు వైపులా మొక్కలు నాటారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తలపెట్టిన బృహత్తర కార్యక్రమంలో పాల్గొని   ప్రతి ఒక్కరు తమ వంతు భాద్యతగా మొక్కలు నాటుతూ సమాజ శ్రేయస్సు కు పాటుపడాలన్నారు.ఇప్పుడు నాటిన మొక్కలను సంరక్షిస్తే  అవి రేపటికి వృక్షాలు అవుతాయని,వాటితో  ప్రాణవాయువు లభిస్తుందని అన్నారు.మొక్కలు మనిషి జననం నుండి మరణం వరకు ప్రత్యక్షంగానూ,పరోక్షంగానూ ఉపయోగపడుతున్నాయి అని అన్నారు.హరిత హారంలో నాటిన మొక్కలను సంరక్షిస్తే రేపటి వృక్షాలై మన తెలంగాణ హరిత తెలంగాణగ  మారుతుందని అన్నారు.విద్యార్థులు మానవహారం నిర్వహించి మొక్కల ప్రాముఖ్యతను నినాదాల ద్వారా తెలియజేసారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు కార్నాథం సంజీవ్ కుమార్,జిల్లా ప్రాదేశిక సభ్యులు అజ్మీర బాబురావు,సర్పంచ్ పెసరు వెంకటమ్మ,తహసీల్దార్ బండారి రమేష్ గౌడ్,యంపిడిఓ సత్యనారాయణ,మండల విద్యాధికారి వెంకటేశ్వర స్వామీ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ కుందారపు శంకరమ్మ,తెరాస మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి,మండలంలోని  సర్పంచులు,ఎంపిటిసి లు ,అధ్యాపకులు,ఉపాధ్యాయులు,విద్యార్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment