కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అండ ;జ్ పి పౌడెల్
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 14 ; కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు లబ్ది చేకూరేలా ఉన్నాయని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు జ్ పి పౌడెల్ రెబ్బెన మండలం లోని గోలేటిలోని బి జ్ పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ప్రజల అభివృద్ధి కోసం ప్రెవేశ పెట్టని ఎన్నో పథకాలను ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టినవివిధ సంక్షేమ పథకాలపై సామాన్య ప్రజలకు ఆవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసారు. ప్రధాన మంత్రి ఫసల్ భీమా పథకం వల్ల రైతులకు జారుతున్న వెసులుబాటును రైతులందరికీ వివరించాలని, వారిని పంటల భీమా చేయించాలని ప్రోత్సహించాలని కోరారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు యలమంచిలి సునీల్ చౌదరి ,ఉపాధ్యక్షులు గెడ్డం మల్లయ్య ,రోడ్డ శంకర్ ,దుర్గం చంద్రశేఖర్,నంది సత్యనారాయణ ,ప్రధాన కార్యదర్శికోట వెంకన్న తదితరులను కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకొన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కుందారపు బాలకృష్ణ ,కేసరి ఆంజనేయగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment