నంబాల స్కాలర్స్ పాఠశాలలో హరిత హరం
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 26 ; తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా బుధవారం రెబ్బెన మండలం నంబాల గ్రామం లోని స్కాలర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన రెబ్బెన సబ్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ ,నంబాల సర్పంచ్ గజ్జెల సుశీల మాట్లాడుతూ హరిత హరం కార్యక్రమాన్ని కేవలం మొక్కలు నాటడంతోనే సరికాదని వాటిని పెంచి వృక్షాలుగా అయ్యేటట్లు చూడాల్సిన భాద్యత తీసుకోవాలని చెప్పారు. విద్యార్థులకు ఈ భాద్యత అప్పగిస్తే వారికీ మొక్కల సంరక్షణలో అవగాహన పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సర్పంచ్ భాను ప్రసాద్,స్కూల్ కరెస్పాండంట్ గట్టు రాము, హెడ్ మాస్టర్ కవిత మరియు టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment