వట్టివాగు ప్రాజెక్ట్ సాగు నీటి విడుదల
ఆసిఫాబాద్ వుదయం కరెస్పాండంట్ జూలై 10 ; వట్టివాగు ప్రాజెక్ట్ కింద ఉన్న ఆయకట్టు భూములకు నీటిని ఎంఎల్ఏ కోవలక్ష్మి సోమవారంనాడు ప్రాజెక్ట్ గేట్ల ద్వారా విడుదల చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు పంటల ద్వారా అధిక దిగుబడిని చేసి మన తెలంగాణాని పంటల దిగుబడిలో ముందంజలో ఉంచి మన ముఖ్యమంత్రిగారి ఆశయ సాధనలో పాలుపంచుకోవాలని,రైతులు నాణ్యమైన విత్తనాలు,ఎరువులు,మందులు వదలని,తద్వారా నకిలీల బారిన పడకుండా ఉండాలని చెప్పారు. పంటల భీమా చేయించి ఆర్ధిక పరమైన నష్టాలను నివారించు కోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి బాబురావు ఆసిఫాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంధం శ్రీనివాస్, వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ,డైరెక్టర్ పల్లె రాజేశ్వర్ ,సర్పంచులు పెసర వెంకటమ్మ ,భీమేష్ సింగల్ విండో డైరెక్టర్ మధునయ్య ,పెంటయ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment