Tuesday, 11 July 2017

http://rebbananews.blogspot.in/2017/07/blog-post_11.html?m=1

విధ్యార్ధుల సమస్యలను పరిష్కరించాలని  సైకిల్ జాత 


 ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 11 ;   ప్రభుత్వ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని,ప్రభుత్వ విద్యా పరిరక్షణకై ఎఐఎస్ఏఫ్ ఆద్వర్యంలో మంగళవారం రెబ్బెన నుండి  సైకిల్ జాత  ప్రారంబించారు .ఈ సందర్బంగా ఏ  ఐ ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వేణు మాట్లాడుతూ  విద్యారంగ సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నరాని అన్నారు. సంక్షేమ వసతి గృహలల్లో సమస్యలు రాజ్యమేలుతున్నయని అన్నారు. కెజి టూ పిజి ఉచిత విద్య అని చెప్పిన కెసిఆర్ ఇప్పటి వరకు హమీ నెరవెర్చలేదని అన్నారు.ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లో ప్రభుత్వ డిగ్రీ.పాలిటెక్నీక్.ఐ టీ ఐ కళాశాలలు మంజూరు చెయ్యాలని అన్నారు.పెంచిన డిగ్రీ విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే భరించాలి,ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యన భోజన పథకాన్ని అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు , విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొవాడానికి సైకిల్ జాత కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు,ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ  జిల్లా అధ్యక్షుడు తిరుపతి ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి దుర్గం రవీందర్ , ఎఐఎస్ఏఫ్ డివిజన్ కార్యదర్శి పుదారి సాయి,జిల్లా కార్యవర్గ సభ్యులు కస్తూరి రవీ,,జిల్లా సమితి సభ్యులు పర్వతి సాయి , ప్రణయ్,తిరుపతి,శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment