Saturday, 29 July 2017

లాంగ్ మార్చ్ గోడ ప్రతుల ఆవిష్కరణ

 లాంగ్ మార్చ్ గోడ ప్రతుల ఆవిష్కరణ    
                    


  ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 29;  అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏ ఐ ఎస్ ఎఫ్ అద్వర్యoలో  జిల్లా కేంద్రంలో   సేవ్ ఇండియా చేంజ్ ఇండియా పేరిట కన్యాకుమారి నుండి పంజాబ్ లోని ఉసెన్వాలి వరకు లాంగ్ మార్చ్ ఏ ఐ ఎస్ ఎఫ్ మరియు ఏ ఐ వై ఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న లాంగ్ మార్బ్ గోడ ప్రతులను ఏ ఐ ఎస్ ఎఫ్ నాయకులు విడుదల  చేసారు.ఈ సందర్భంగా ఏ ఐ ఎన్ ఎఫ్ అసిఫాబాద్ దివిజన్ అధ్యక్షలు బావునే వికాస్,కార్యదర్శి పూదరి సాయికిరణ్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా నిరుద్యోగులు పెరిగిపోతున్న సరైన ఉద్యోగా  అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయని,తక్షణమే భగత్ సింగ్ జాతీయ ఉపాధి పథకం క్రింద ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.అదే విధంగా దేశ వ్యాప్తంగా ఒకే విద్య విధానాన్ని అమలు చేయాలని, ఉచిత నాణ్యమైన విద్యను అందించాలని డిమాండ్ చేసారు. అలాగే దేశ వ్యాప్తంగా దళితుల పైన,ముస్లిం మైనారిటీల మీద దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.పై సమస్యలు పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం ఈ నెల 15 వ తేదీన లాంగ్ మార్చ్ ప్రారంభమైందని, తెలంగాణ రాష్ట్రం లో ఆగస్టు 1వ తేదీన ప్రవేశిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా నాయకులు పర్వతి సాయి,నాయకులు నామని హరీష్,సాయి కృష్ణ,తిరుపతి,నవీన్,తేజ,రాకేష్, విద్యార్థులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment