Wednesday, 5 July 2017

పథకాలన్ని సక్రమంగా అమలు చేయాలి ; ఎ ఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

పథకాలన్ని సక్రమంగా అమలు చేయాలి ; ఎ ఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూలై  05 (వుదయం ప్రతినిధి) ;  జిల్లాలో మంజూరైన బెస్ట్ ఆవలెబుల్ పాఠశాలల పథకాన్ని కనీస వసతులు ఉన్న పాఠశాలలకె మంజూరు చేయాలని ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ డిమాండ్ చేశారు. బుధవారం రోజున ఎఐఎస్ఏఫ్ ఆద్వర్యంలో డిటిడివొ జిల్లా అధికారి క్రిష్ణనాయక్ కు వినతి పత్రం అందించారు. అనంతరం రవీందర్ మాట్లాడుతూ జిల్లాకు మంజూరైన బెస్ట్ ఆవలెబుల్ పాఠశాలలను అన్ని వసతులు ఉన్న పాఠశాలలకె మంజూరు చేయాలని,రేకుల షెడ్ లు ఉన్న పాఠశాలలకు,ప్రహరీ గోడలు లేని పాఠశాలలకు,మంచి నీటి సౌకర్యం లేని పాఠశాలలకు, మరుగుదొడ్లు లేని పాఠశాలలకు అవకాశం ఇవ్వొద్దని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠత్మకంగా ప్రవేశ పెట్టిన పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎఐఎస్ఏఫ్ ఆద్వర్యంలో చేసే ఆందోళనలకు అధికారులె బధ్యత వహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఏఫ్ నాయకులు ప్రణయ్, సాయి,తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment